ZeeCinemalu – Oct 18

Saturday,October 17,2020 - 11:16 by Z_CLU

అవును 2 నటీనటులు : పూర్ణ, హర్షవర్ధన్ రాణే ఇతర నటీనటులు : రవి బాబు, సంజన గల్రాని, నిఖిత తుక్రాల్, రవి వర్మ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర డైరెక్టర్ : రవి బాబు ప్రొడ్యూసర్ : D. సురేష్ బాబు రిలీజ్ డేట్ : 3 ఏప్రిల్ 2015 రవిబాబు డైరెక్షన్ లో తెరకెక్కిన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ అవును సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కింది అవును 2. ఈ సినిమా కూడా రవిబాబు మార్క్ తో సూపర్ హిట్ అనిపించుకుంది. హీరోయిన్ పూర్ణ నటన ఈ సినిమాకి హైలెట్ గా నిలిచింది.

==========================

పూజ నటీనటులు : విశాల్, శృతి హాసన్ ఇతర నటీనటులు : సత్య రాజ్, రాధికా శరత్ కుమార్, ముకేశ్ తివారి, సూరి, జయ ప్రకాష్, తదిరులు మ్యూజిక్ డైరెక్టర్ : యువన్ శంకర్ రాజా డైరెక్టర్ : హరి ప్రొడ్యూసర్ : విశాల్ రిలీజ్ డేట్ : 22 అక్టోబర్ 2014 విశాల్, శృతి హాసన్ జంటగా మాస్ సినిమా దర్శకుడు తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘పూజ’. ప్రతి సినిమాలో మాస్ క్యారెక్టర్స్ తో ఎంటర్టైన్ చేసే విశాల్ అలాంటి మాస్ క్యారెక్టర్ లో నటించిన ఈ సినిమా లో యాక్షన్ సీన్స్, శృతి హాసన్ గ్లామర్, కామెడీ సీన్స్ , సాంగ్స్ హైలైట్స్

========================

బెండు అప్పారావు నటీనటులు : అల్లరి నరేష్, కామ్న జెఠ్మలానీ ఇతర నటీనటులు : కృష్ణ భగవాన్, మేఘన రాజ్, ఆహుతి ప్రసాద్, రఘుబాబు, L.B. శ్రీరామ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : కోటి డైరెక్టర్ : E.V.V. సత్యనారాయణ ప్రొడ్యూసర్ : D. రామానాయుడు రిలీజ్ డేట్ : 16 అక్టోబర్ 2009 R.M.P. గా పని చేస్తుంటాడు బెండు అప్పారావు. నిజానికి తనకు వైద్యం చేసే పద్ధతి తెలీకపోయినా, చిన్నా చితకా ట్రిక్స్ వాడి ఊరి జనానికి వైద్యం చేస్తుంటాడు. దానికి తోడు తన అక్క కాపురాన్ని ఎలాగైనా నిలబెట్టాలని తాపత్రయపడుతుంటాడు. బెండు అప్పారావు బావ, ఎప్పుడు చూసినా తన అక్కని కట్నం కోసం వేదిస్తూనే ఉంటాడు. అంతలో ఊరిలో జరిగిన ఒక సంఘటన అప్పారావు జీవితాన్ని ఇంకో మలుపు తిప్పుతుంది. ఏంటది..? అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

==========================

యోగి నటీనటులు : ప్రభాస్, నయన తార ఇతర నటీనటులు : కోట శ్రీనివాస రావు, ప్రదీప్ రావత్, సుబ్బరాజు, ఆలీ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : రమణ గోగుల డైరెక్టర్ : V.V. వినాయక్ ప్రొడ్యూసర్ : రవీంద్ర నాథ్ రెడ్డి రిలీజ్ డేట్ : 12 జనవరి 2017 ప్రభాస్ హీరోగా V.V. వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన హై ఎండ్ ఇమోషనల్ ఎంటర్ టైనర్ యోగి. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఊర్వశి శారద ప్రభాస్ కి తల్లిగా నటించారు. ఈ ఇద్దరి మధ్యన నడిచే ఇమోషనల్ సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.

==========================

జెర్సీ నటీనటులు : నాని, శ్రద్ధా దాస్ ఇతర నటీనటులు : సత్యరాజ్, మాస్టర్ రోనిత్ కామ్ర, హరీష్ కళ్యాణ్, విశ్వనాథ్ దుద్దుంపూడి, సానుష మరియు తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : అనిరుద్ రవిచందర్ డైరెక్టర్ : గౌతమ్ తిన్ననూరి ప్రొడ్యూసర్ : సూర్యదేవర నాగవంశి రిలీజ్ డేట్ : 19 ఏప్రిల్ 2019 అర్జున్ (నాని).. క్రికెట్ అతడి ప్రపంచం. హైదరాబాద్ ప్లేయర్ గా ది బెస్ట్ అనిపించుకుంటాడు. రంజీల్లో కూడా సత్తా చాటుతాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో క్రికెట్ ను వదిలేస్తాడు. ప్రేమించిన సారా (శ్రద్ధ శ్రీనాధ్)ను పెళ్లి చేసుకుంటాడు. వాళ్లకు ఓ కొడుకు కూడా పుడతాడు. కానీ క్రికెట్ ను వదిలేసి పదేళ్లయినా జీవితంలో సెటిల్ అవ్వడు అర్జున్. భార్య సంపాదన మీద బతుకుతుంటాడు. ప్రభుత్వ ఉద్యోగం కూడా పోగొట్టుకుంటాడు. అనుకోని సంఘటనల మధ్య మరోసారి క్రీజ్ లోకి అడుగుపెడతాడు అర్జున్. ఊహించని విధంగా క్రికెట్ బ్యాట్ పట్టుకుంటాడు. 36 ఏళ్ల లేటు వయసులో అర్జున్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటాడు? అసలు అర్థాంతరంగా అర్జున్ క్రికెట్ ను వదిలేయడానికి కారణం ఏంటి? క్లయిమాక్స్ లో అర్జున్ ఏం సాధించాడు? అనేది బ్యాలెన్స్ కథ.

==========================

కృష్ణ నటీనటులు : రవితేజ, త్రిష కృష్ణన్ ఇతర నటీనటులు : బ్రహ్మానందం, సునీల్, వేణు మాధవ్, ముకుల్ దేవ్, చంద్ర మోహన్, దండపాణి, కళ్యాణి తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి డైరెక్టర్ : V.V.వినాయక్ ప్రొడ్యూసర్స్ : కాశీ విశ్వనాథం, D.V.V. దానయ్య రిలీజ్ డేట్ : 11 జనవరి 2008 రవితేజ, త్రిష నటించిన కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ కృష్ణ. V.V. వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా రవితేజ కరియర్ లో హైలెట్ గా నిలిచింది. కాశీ విశ్వనాథం, D.V.V. దానయ్య కలిసి నిర్మించిన ఈ సినిమాకి చక్రి సంగీతం హైలెట్ గా నిలిచింది.