ZeeCinemalu – Oct 13

Monday,October 12,2020 - 11:12 by Z_CLU

chinnari-zee-cinemalu

చిన్నారి నటీనటులు : ప్రియాంక ఉపేంద్ర, బేబీ యువిన, ఐశ్వర్య షిందోగి, మధుసూధన రావు మ్యూజిక్ డైరెక్టర్ : B. అజనీత్ లోకనాథ్ డైరెక్టర్ : లోహిత్ M. ప్రొడ్యూసర్ : K. రవి కుమార్ రిలీజ్ డేట్ : డిసెంబర్ 16, 2016 ప్రియాంక ఉపేంద్ర నటించిన చిన్నారి మూవీ పర్ఫెక్ట్ హారర్ ఎంటర్ టైనర్. చనిపోయిన తన భర్త కోరిక మేరకు గర్భవతి అయిన ప్రియా తన 6 ఏళ్ల కూతురు క్రియ, ఇంకో ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి గోవాలోని తన విల్లాకి వెళుతుంది. అక్కడకు వెళ్లిన కొద్ది రోజుల తరువాత విల్లాలో జరిగే విచిత్రమైన కొన్ని సంఘటనలు వాళ్లకు భయాన్ని కలిగిస్తాయి. ఆ ఇంట్లో ఉన్న ఏదో అదృశ్య శక్తి ప్రియను, ఆమె కూతురు క్రియను, ఇతర కుటుంబ సభ్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇంతకీ ఆ అదృశ్య శక్తి ఎవరు ? అది ప్రియను, ఆమె కూతురు క్రియను ఎందుకు ఇబ్బంది పెడుతోంది ? ఆ అదృశ్య శక్తి బారి నుండి ప్రియ, క్రియలు తప్పించుకున్నారా లేదా ? అనేదే ఈ సినిమా కథ. హారర్ ఎలిమెంట్స్ సినిమాలో హైలెట్ గా నిలుస్తాయి.

=============================== bava-zee-cinemalu

బావ నటీనటులు : సిద్ధార్థ, ప్రణీత ఇతర నటీనటులు : రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, నాజర్, సింధు తులాని మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి డైరెక్టర్ : రామ్ బాబు ప్రొడ్యూసర్ : పద్మ కుమార్ చౌదరి రిలీజ్ డేట్ : 29 డిసెంబర్ 2010 అందమైన పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిందే బావ. ఈ సినిమాలో సిద్ధార్థ, ప్రణీత హీరోహీరోయిన్లుగా నటించారు. రాజేంద్ర ప్రసాద్ సిద్ధార్థ తండ్రి సీతారామ్ గా నటించాడు. నిజానికిఅసలు కథ సీతారామ్ దగ్గరి నుండే మొదలవుతుంది. ప్రేమించి పెళ్ళి చేసుకున్న తను తన భార్య కుటుంబం నుండి తనను దూరం చేశాననే గిల్ట్ ఫీలిగ్ తో తను చేసిన తప్పు తన కొడుకుచేయకూడదు అనుకుంటూ ఉంటాడు. అంతలో వీరబాబు(సిద్ధార్థ) ఒక అమ్మాయి ప్రేమలోపడతాడు. ఆ అమ్మాయి తన భార్య అన్న కూతురు అని తెలుసుకున్న సీతారామ్, వీరబాబుతోతన ప్రేమను మర్చిపొమ్మంటాడు. అప్పుడు వీరబాబు ఏం చేస్తాడు..? కథ ఏ మలుపుతిరుగుతుందన్న అంశాలు జీ సినిమాలు లో చూడాల్సిందే.

============================= brother-of-bommali-zee-cinemalu

బ్రదర్ ఆఫ్ బొమ్మాలి నటీనటులు : అల్లరి నరేష్, కార్తీక, మోనాల్ గజ్జర్ ఇతర నటీనటులు : హర్ష వర్ధన్ రాణే, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర డైరెక్టర్ : చిన్ని కృష్ణ ప్రొడ్యూసర్ : అమ్మి రాజు కనిమిల్లి రిలీజ్ డేట్ : నవంబర్ 7 , 2014 కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా , కార్తీక, మోనాల్ గజ్జర్ ఇతర పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘బ్రదర్ అఫ్ బొమ్మాలి’. ఈ సినిమా లో అల్లరిగా నరేష్ అక్కగా కార్తీక యాక్టింగ్ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. కోన వెంకట్ గా బ్రహ్మానందం కామెడీ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. అల్లరి నరేష్ ఎనర్జీ తో కూడిన ఫన్నీ పెర్ఫార్మెన్స్, శేఖర్ చంద్ర మ్యూజిక్, కామెడీ సీన్స్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్స్.

================================= Nagavalli-zee-cinemalu

నాగవల్లి నటీనటులు : వెంకటేష్, అనుష్క శెట్టి ఇతర నటీనటులు : రజినీకాంత్, జ్యోతిక, రిచా గంగోపాధ్యాయ, శ్రద్దా దాస్, కమలినీ ముఖర్జీ, పూనం కౌర్ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : గురుకిరణ్ డైరెక్టర్ : P. వాసు ప్రొడ్యూసర్ : బెల్లంకొండ సురేష్ రిలీజ్ డేట్ : 16 డిసెంబర్ 2010 విక్టరీ వెంకటేష్, అనుష్క నటించిన హారర్ కామెడీ ఎంటర్ టైనర్ నాగవల్లి. రజినీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖి సినిమాకి సీక్వెల్ ఈ సినిమా. అనుష్క నటన సినిమాకే హైలెట్ గా నిలిచింది.

=============================== dabangg-3-దబాంగ్-3-zeecinemalu

దబాంగ్ 3 నటీనటులు: సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా, సుదీప్, సయీ మంజ్రేకర్ తదితరులు మ్యూజిక్: సుదీప్ శిరోద్కర్ ఫోటోగ్రఫి: మహేష్ లిమయే నిర్మాత: సల్మాన్ ఖాన్, అర్భాజ్ ఖాన్ దర్శకత్వం: ప్రభుదేవా సల్మాన్ ఖాన్, అతని భార్య సోనాక్షి సిన్హా, అతని తమ్ముడు అర్భాజ్ ఖాన్ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటారు. పోలీసుగా ఉద్యోగం చేస్తూ ఎంజాయ్ చేస్తుండే సల్మాన్ ఖాన్ అనుకోకుండా ఓ ఆపరేషన్ చేపట్టాల్సి వస్తుంది. ఆ ఆపరేషన్ లో కొంతమంది వ్యభిచారం చేస్తున్న అమ్మాయిలను సల్మాన్ ఖాన్ పట్టుకుంటాడు. వ్యభిచారం వ్యాపారంగా మలుచుకొని అనేక చీకటి వ్యాపారాలు చేస్తున్న సుదీప్ కు ఈ విషయంలో సల్మాన్ పై కోపం వస్తుంది. సల్మాన్ పై రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటాడు. అదే సమయంలో సల్మాన్ ఖాన్ గతం గురించి తెలుసుకోవడం మొదలుపెడతారు. గతంలో సల్మాన్ ఖాన్, సయీ మంజ్రేకర్ లు ఘాడంగా ప్రేమించుకుంటారు. అనుకోని విధంగా ఇద్దరు దూరం అవుతారు. ఇద్దరి ఎందుకు విడిపోయారు. సల్మాన్ ఖాన్ సుదీప్ ను ఎలా ఎదుర్కొన్నారు అన్నది కథ.

============================

nagabharanam-zee-cinemalu నాగభరణం నటీనటులు : విష్ణువర్ధన్, దిగంత్, రమ్య ఇతర నటీనటులు : సాయి కుమార్, రాజేష్ వివేక్, దర్శన్, సాదు కోకిల, అమిత్ తివారీ మరియు తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : గురుకిరణ్ డైరెక్టర్ : కోడి రామకృష్ణ ప్రొడ్యూసర్స్ : సాజిద్ ఖురేషి, సోహెల్ అన్సారి, ధవళ్ గాద రిలీజ్ డేట్ : 14 అక్టోబర్ 2016 సూర్య గ్రహణం రోజు తమ శక్తి అంత కోల్పోతామని గ్రహించి దేవుళ్లందరూ కలిసి తమ శక్తితో ఓ శక్తివంతమైన ‘శక్తి కవచం‘ సృష్టిస్తారు. లోకాన్ని అంతా కాపాడే ఈ అతి శక్తివంతమైన శక్తికవచాన్ని తమ సొంతం చేసుకోవడానికి కోసం ఎన్నో దుష్ట శక్తులు ప్రయత్నిస్తాయి. అయితే ఆ దుష్ట శక్తుల నుంచి కవచాన్ని శివయ్య(సాయి కుమార్) కుటుంబం తరతరాలుగా కాపాడుకుంటూ వస్తుంది. శివయ్య తరువాత ఆ శక్తి కవచాన్ని తమ కుటుంబం తరుపున కాపాడుకుంటూ వస్తున్న నాగమ్మ(రమ్య) ఒకానొక సందర్భంలో మరణించి మరో జన్మలో మానస గా పుట్టి ఆ శక్తి కవచం సుస్థిర స్థానంలో పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇక ఆ శక్తి కవచం ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ వారి దగ్గర ఉందని దానిని ఢిల్లీ మ్యూజిక్ కాంపిటీషన్ లో బహుమతి గా ఇస్తారని తెలుసుకున్న మానస… నాగ్ చరణ్ (దిగంత్) అనే మ్యూజిషియన్ ద్వారా ఆ కవచాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఆ కవచాన్ని దక్కించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన విలన్స్ ను దుష్ట శక్తులను మానస ఎలా అంతం చేసింది? చివరికి శక్తి కవచాన్ని ఎలా కాపాడుకుంది? అనేది ఈ సినిమా స్టోరీ.