ZeeCinemalu – Oct 12

Sunday,October 11,2020 - 11:14 by Z_CLU

aha-na-pellanta-zee-cinemalu-551x320

అహనాపెళ్లంట నటీనటులు : అల్లరి నరేష్, శ్రీహరి, రీతు బర్మేచ ఇతర నటీనటులు : అనిత హాసనందిని, బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, సుబ్బరాజు, విజయ్ సామ్రాట్ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : రఘు కుంచె డైరెక్టర్ : వీరభద్రం ప్రొడ్యూసర్ : అనిల్ సుంకర రిలీజ్ డేట్ : 2 మార్చి 2011 రియల్ స్టార్ శ్రీహరి, నరేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన హిలేరియస్ ఎంటర్ టైనర్ అహ నా పెళ్ళంట. వీరభద్రం డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అన్ని సెంటర్ లలోను సూపర్ హిట్ అయింది. కామెడీ ఈ సినిమాకి పెద్ద ఎసెట్.

================================= Na Love story Modalaindhi నా లవ్ స్టోరీ మొదలైంది zeecinemalu

నా లవ్ స్టోరీ మొదలైంది హీరోహీరోయిన్లు - శివకార్తికేయన్, నయనతార, ప్రియా ఆనంద్ డైరక్టర్ - దురై సెంథిల్ కుమార్ బ్యానర్ - సర్వాంత్ రామ్ క్రియేషన్స్ నిర్మాత - జె.రామాంజనేయులు మ్యూజిక్ డైరక్టర్ - అనిరుధ్ సినిమాటోగ్రాఫర్ - వేల్ రాజ్ రిలీజ్ డేట్ - జనవరి 29, 2014 మంచి కథ, ఆరోగ్యకరమైన హాస్యం, వినసొంపైన పాటలు ఉన్న సినిమా నా లవ్ స్టోరీ మొదలైంది. శివకార్తికేయన్, నయనతార, ప్రియా ఆనంద్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను దురై సెంథిల్ కుమార్ తెరకెక్కించాడు. ఈ సినిమాను తమిళ్ లో హీరో ధనుష్ నిర్మించడంతో పాటు ఓ పాట పాడాడు. అంతేకాదు, ఆ పాటకు నయనతారతో కలిసి డాన్స్ కూడా చేశాడు. అనిరుధ్ అందించిన ఈ సినిమాలో పాటలన్నీ బాగుంటాయి.

===================================== okato-number-kurradu-ఒకటో-నంబర్-కుర్రాడు-zeecinemalu-580x320

ఒకటో నంబర్ కుర్రాడు నటీనటులు : తారకరత్న, రేఖ ఇతర నటీనటులు : గిరిబాబు, సునీల్, తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, ఎమ్మెస్ నారాయణ మ్యూజిక్ డైరెక్టర్ : కీరవాణి డైరెక్టర్ : కోదండరామిరెడ్డి ప్రొడ్యూసర్ : అశ్వనీదత్, కె.రాఘవేంద్రరావు రిలీజ్ డేట్ : సెప్టెంబర్ 18, 2002 తారకరత్న, రేఖ నటించిన హిట్ సినిమా ఒకటో నంబర్ కుర్రాడు. తారకరత్న ను హీరోగా పరిచయం చేసిన సినిమా ఇది. కోదండ రామిరెడ్డి డైరక్ట్ చేసిన ఈ సినిమాకు రాఘవేంద్రరావు కథ అందించడం విశేషం. స్వప్న సినిమాస్ బ్యానర్ పై అశ్వనీదత్ ఈ సినిమాను సమర్పించగా.. రాఘవేంద్రరావు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈ సినిమాకు కీరవాణి అందించిన సంగీతం సూపర్ హిట్టయింది. ఇప్పటికీ ఈ సినిమాలో పాటలు అక్కడక్కడ వినిపిస్తుంటాయి.

=========================== manikarnika-zee-cinemalu-569x320-569x320

మణికర్నిక నటీనటులు : కంగనా రనౌత్, మొహమ్మద్ జీషన్ అయ్యుబ్ ఇతర నటీనటులు : అతుల్ కులకర్ణి, జీషు సేన్ గుప్తా, రిచర్డ్ కీప్, సురేష్ ఒబెరాయ్, డానీ డెన్ జోంగ్ పా, అంకిత లోఖాండే తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : శంకర్ – ఎహసాన్- లాయ్ డైరెక్టర్ : క్రిష్ ప్రొడ్యూసర్ : జీ స్టూడియోస్, కమాల్ జైన్, నిశాంత్ పిట్టి రిలీజ్ డేట్ : 25 జనవరి 2019 మహారాణి ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా మణికర్ణిక. ఝాన్సీ రాజ్యాన్ని బ్రిటీషు వారి బారిన పడకుండా లక్ష్మీ బాయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది..? తన ప్రజలను కలుపుకుని వారిపై ఎలా తిరగబడింది అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం. యుద్ధ సన్నివేశాలు సినిమాలో హైలెట్ గా నిలిచాయి.

============================ Police-Story-2-zee-cinemalu

పోలీస్ స్టోరీ 2 హీరో – సాయికుమార్ ఇతర నటీనటులు – రాక్ లైన్ వెంకటేశ్, పీజే శర్మ, సన, శోభరాజ్, పొన్నాంబలం సంగీతం – ఆర్పీ పట్నాయక్ స్క్రీన్ ప్లే, దర్శకత్వం – థ్రిల్లర్ ముంజు విడుదల తేదీ – 1996 అప్పటికే సౌత్ లో పెద్ద హిట్ అయిన పోలీస్ స్టోరీకి సీక్వెల్ గా పోలీస్ స్టోరీ-2నుతెరకెక్కించారు. పోలీస్ స్టోరీ సినిమాకు పనిచేసిన టీం అంతా దాదాపుగా ఈ సీక్వెల్ కు కూడాపనిచేశారు. ఇప్పటికీ సాయికుమార్ కెరీర్ లో చిరస్థాయిగా నిలిచిపోయే అగ్ని పాత్ర ఈ సినిమాలోనిదే.

=============================== mohini-zee-cinemalu

మోహిని నటీనటులు : త్రిష, జాకీ భజ్ఞాని ఇతర నటీనటులు : ముకేష్ తివారీ, పూర్ణిమ భాగ్యరాజ్, యోగి బాబు, జాంగిరి మధుమిత, జ్ఞానేశ్వర్, స్వామినాథన్ మరియు తదితరలు మ్యూజిక్ డైరెక్టర్ : వివేక్ – మెర్విన్ డైరెక్టర్ : రమణ మాదేశ్ ప్రొడ్యూసర్ : S. లక్ష్మణ్ కుమార్ రిలీజ్ డేట్ : 27 జూలై 2018 ఇండియాలో పాపులర్ చెఫ్ వైష్ణవి (త్రిష). ఆమెకు లండన్ నుంచి ఊహించని ఆఫర్ వస్తుంది. అక్కడకు తన టీమ్ తో పాటు వెళ్తుంది వైష్ణవి. అక్కడే సందీప్ (జాకీ భగ్నానీ) ను కలుస్తుంది. తొలిచూపులోనే ఇద్దరూ ప్రేమించుకుంటారు. తన ప్రేమ విషయాన్ని తల్లికి (పూర్ణిమ) కూడా చెప్పేస్తుంది వైష్ణవి. ఇక్కడ వరకు అంతా ప్రశాంతం. సడెన్ గా తన బాయ్ ఫ్రెండ్ సందీప్, టీమ్ తో కలిసి బోటు షికారుకు వెళ్తుంది వైష్ణవి. అక్కడే ఊహించని సంఘటన జరుగుతుంది. ఆ ఘటన కారణంగా సముద్ర గర్భంలో ఓ శంఖంలో కొన్నేళ్లుగా ఉన్న మోహిని (త్రిష) ఆత్మ బయటకు వస్తుంది. బయటకొచ్చి తనలా ఉన్న వైష్ణవిని చూసి ఆమెలో ప్రవేశిస్తుంది. గతంలో తనకు అన్యాయం చేసిన వ్యక్తులపై వైష్ణవి రూపంలో ఉన్న మోహిని ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. ఇందులో భాగంగా తనను చంపిన గుంపులో సందీప్ కూడా ఉన్నాడనే చేదు నిజం తెలుసుకుంటుంది. వైష్ణవిలోకి మోహిని ప్రవేశించిందనే విషయాన్ని సందీప్ తో పాటు విలన్లు గుర్తిస్తారు. మరో క్షుద్ర మాంత్రికుడితో కలిసి మోహినిని బంధించాలని, అవసరమైతే వైష్ణవిని చంపేయాలని చూస్తారు. ఫైనల్ గా విలన్లను మోహిని ఏం చేసింది.. విలన్ల బారి నుంచి వైష్ణవిని మోహిని ఎలా కాపాడింది అనేది ఈ సినిమా స్టోరీ.