ZeeCinemalu – Nov 24

Monday,November 23,2020 - 08:40 by Z_CLU

చిన్నారి నటీనటులు : ప్రియాంక ఉపేంద్ర, బేబీ యువిన, ఐశ్వర్య షిందోగి, మధుసూధన రావు మ్యూజిక్ డైరెక్టర్ : B. అజనీత్ లోకనాథ్ డైరెక్టర్ : లోహిత్ M. ప్రొడ్యూసర్ : K. రవి కుమార్ రిలీజ్ డేట్ : డిసెంబర్ 16, 2016 ప్రియాంక ఉపేంద్ర నటించిన చిన్నారి మూవీ పర్ఫెక్ట్ హారర్ ఎంటర్ టైనర్. చనిపోయిన తన భర్త కోరిక మేరకు గర్భవతి అయిన ప్రియా తన 6 ఏళ్ల కూతురు క్రియ, ఇంకో ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి గోవాలోని తన విల్లాకి వెళుతుంది. అక్కడకు వెళ్లిన కొద్ది రోజుల తరువాత విల్లాలో జరిగే విచిత్రమైన కొన్ని సంఘటనలు వాళ్లకు భయాన్ని కలిగిస్తాయి. ఆ ఇంట్లో ఉన్న ఏదో అదృశ్య శక్తి ప్రియను, ఆమె కూతురు క్రియను, ఇతర కుటుంబ సభ్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇంతకీ ఆ అదృశ్య శక్తి ఎవరు ? అది ప్రియను, ఆమె కూతురు క్రియను ఎందుకు ఇబ్బంది పెడుతోంది ? ఆ అదృశ్య శక్తి బారి నుండి ప్రియ, క్రియలు తప్పించుకున్నారా లేదా ? అనేదే ఈ సినిమా కథ. హారర్ ఎలిమెంట్స్ సినిమాలో హైలెట్ గా నిలుస్తాయి.

=============================

చూడాలని ఉంది నటీనటులు : చిరంజీవి, సౌందర్య, అంజలా జవేరి ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, ధూళిపాళ్ళ, బ్రహ్మాజీ, వేణు మాధవ్, ఆహుతి ప్రసాద్ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ డైరెక్టర్ : గుణశేఖర్ ప్రొడ్యూసర్ : అశ్విని దత్ రిలీజ్ డేట్ : 27 ఆగష్టు 1998 తన కూతురు ప్రియ, తనకిష్టం లేకుండా రామకృష్ణని పెళ్ళి చేసుకుందన్న కోపంతో తనపై ఎటాక్ చేయిస్తాడు మహేంద్ర. అయితే ఓ సందర్భంలో రామకృష్ణకి బులెట్ తగిలే సమయానికి ప్రియ అడ్డు పడుతుంది. దాంతో ప్రియ చనిపోతుంది. ఇదే సమయంలో రామకష్ణ, ప్రియ ల కొడుకును మహేంద్ర తీసుకెళ్ళిపోతాడు. దానికి తోడు ప్రియని చంపింది రామకృష్ణే అని హత్యానేరం మోపుతాడు. దాంతో జైలుకు వెళ్ళిన రామకృష్ణ మహేంద్ర దగ్గర ఉన్న తన కొడుకు కోసం తిరిగి వస్తాడు. అప్పుడే తనకు పద్మావతితో పరిచయమవుతుంది. చివరికి రామకృష్ణ, మహేంద్రకి ఎదురు నిలిచి కొడుకును ఎలా దక్కించు కున్నాడనేదే అసలు కథ.

=========================

మిస్టర్ మజ్ను నటీ నటులు : అఖిల్, నిధి అగర్వాల్, నాగబాబు , జయప్రకాష్, రావు రమేష్ , హైపర్ ఆది తదితరులు సంగీతం : థమన్ ఛాయాగ్రహణం : జార్జ్ సి. విలియమ్స్ నిర్మాణం : శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఎల్ఎల్ పీ నిర్మాత : బీవీఎస్ఎన్ ప్రసాద్ కథ -స్క్రీన్ ప్లే -దర్శకత్వం: వెంకీ అట్లూరి నిడివి : 145 నిమిషాలు విడుదల తేది : 25 జనవరి , 2019 లండన్ లో చదువుకునే విక్రమ్ కృష్ణ అలియాస్ విక్కి(అఖిల్) నిత్యం అమ్మాయిలను తన మాయలో పడేస్తూ వారిని ఆనందంగా ఉంచుతుంటాడు. అదే లండన్ లో అబద్దాలు చెప్పకుండా తనని మాత్రమే ప్రేమించే అబ్బాయి కోసం ఎదురుచూస్తోంటుంది నిఖిత(నిధి అగర్వాల్). అనుకోకుండా వీరిద్దరూ లండన్ లో పరిచయమవుతారు. విక్కి ప్లే బాయ్ క్యారెక్టర్ చూసి అతనికి దూరంగా ఉండాలనుకుంటుంది నిఖిత.. ఈ క్రమంలో ఇండియా తిరిగి వచ్చిన వీరిద్దరికీ విక్కీ చెల్లికి , నిఖిత అన్నయ్య కి పెళ్లి కుదిరిందని తెలుస్తుంది. అయితే విక్కీ తన ఫ్యామిలీ కి ఇచ్చే ఇంపార్టెన్స్ , తండ్రిపై అతనికున్న గౌరవం, దగ్గరైన వారిని ఎంతగా ప్రేమిస్తాడో తెలుసుకొని అతనితో ప్రేమలో పడిపోతుంది నిఖిత. అయితే ప్రేమ అనేది జస్ట్ నెలకే పరిమితం అనే ఫీలింగ్ లో ఉంటూ పెళ్ళికి దూరంగా ఉండే విక్కీ కి లవ్ ప్రపోజ్ చేస్తుంది నిఖిత. అతనికి ఇష్టం లేకపోవడంతో ఓ రెండు నెలలు తనను ప్రేమించాలని, ఆ తర్వాత ఇష్టం కలిగితే పెళ్లి చేసుకోవాలని ఒప్పందం కుదుర్చుకుంటుంది నిఖిత. అక్కడి నుండి అసలు కథ మొదలవుతోంది. అలా నిఖిత ఒప్పందానికి లాక్ అయిన విక్కీ ఎలాంటి సంఘటనలు ఎదుర్కున్నాడు.. చివరికి విక్కీ-నిఖిత ఎలా ఒకటయ్యారు..అనేది మిగతా కథ.

=======================

మేము నటీనటులు : సూర్య, అమలా పాల్ ఇతర నటీనటులు : రామ్ దాస్, కార్తీక్ కుమార్, విద్యా ప్రదీప్, బిందు మాధవి, నిశేష్, వైష్ణవి తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : ఆరోల్ కోలేరి డైరెక్టర్ : పాండిరాజ్ ప్రొడ్యూసర్స్ : సూర్య, పాండిరాజ్ రిలీజ్ డేట్ : 24th డిసెంబర్ 2015 పిల్లల్లో హైపర్ ఆక్టివిటీని ఎలా హ్యాండిల్ చేయాలి అనే సెన్సిటివ్ టాపిక్ తో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మేము. ఈ సినిమాలో సూర్య, అమలా పాల్ నటన హైలెట్ గా నిలిచింది.

============================

రావోయి చందమామ నటీనటులు – నాగార్జున, అంజలా ఝవేరీ, ఐశ్వర్యరాయ్, కీర్తిరెడ్డి, జగపతిబాబు బ్యానర్ – వైజయంతీ మూవీస్ నిర్మాత – అశ్వనీదత్ దర్శకుడు – జయంత్ సి.పరాన్జీ సంగీతం – మణిశర్మ రిలీజ్ – అక్టోబర్ 15, 1999 నాగార్జున నటించిన లవ్-రొమాంటిక్ మూవీ రావోయి చందమామ. 1999 నాటికి భారీ బడ్జెట్ సినిమా ఇదే. మణిశర్మ కంపోజ్ చేసిన ఈ సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్టయ్యాయి. అంతేకాదు.. అందాలతార ఐశ్వర్యరాయ్ ఈ సినిమాలో ఐటెంసాంగ్ చేయడం మరో హైలెట్.

===========================

పల్నాడు నటీనటులు : విశాల్, భారతీ రాజా, లక్ష్మీ మీనన్ ఇతర నటీనటులు : సూరి, విక్రాంత్, శరత్ లోహితశ్వ, హరీష్ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : D. ఇమ్మన్ డైరెక్టర్ : సుసీంతిరన్ ప్రొడ్యూసర్ : విశాల్ రిలీజ్ డేట్ : 2 నవంబర్ 2013 విశాల్, విక్రాంత్, లక్ష్మీ మీనన్ నటించిన డ్రామా థ్రిల్లర్ పలనాడు. ఒక చిన్న మొబైల్ సేల్స్ అండ్ సర్వీస్ షాప్ నడుపుకునే సాధారణ యువకుడి జీవితాన్ని ఒక చిన్న సంఘటన ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది అనే కథాంశంతో తెరకెక్కిందే పలనాడు. ఇమ్మన్ సంగీతం అందించిన ఈ సినిమాకి సుసీంతిరన్ దర్శకత్వం వహించాడు.