ZeeCinemalu – Nov 23

Sunday,November 22,2020 - 10:54 by Z_CLU

అవును 2 నటీనటులు : పూర్ణ, హర్షవర్ధన్ రాణే ఇతర నటీనటులు : రవి బాబు, సంజన గల్రాని, నిఖిత తుక్రాల్, రవి వర్మ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర డైరెక్టర్ : రవి బాబు ప్రొడ్యూసర్ : D. సురేష్ బాబు రిలీజ్ డేట్ : 3 ఏప్రిల్ 2015 రవిబాబు డైరెక్షన్ లో తెరకెక్కిన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ అవును సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కింది అవును 2. ఈ సినిమా కూడా రవిబాబు మార్క్ తో సూపర్ హిట్ అనిపించుకుంది. హీరోయిన్ పూర్ణ నటన ఈ సినిమాకి హైలెట్ గా నిలిచింది.

======================

నా లవ్ స్టోరీ మొదలైంది హీరోహీరోయిన్లు – శివకార్తికేయన్, నయనతార, ప్రియా ఆనంద్ డైరక్టర్ – దురై సెంథిల్ కుమార్ బ్యానర్ – సర్వాంత్ రామ్ క్రియేషన్స్ నిర్మాత – జె.రామాంజనేయులు మ్యూజిక్ డైరక్టర్ – అనిరుధ్ సినిమాటోగ్రాఫర్ – వేల్ రాజ్ రిలీజ్ డేట్ – జనవరి 29, 2014 మంచి కథ, ఆరోగ్యకరమైన హాస్యం, వినసొంపైన పాటలు ఉన్న సినిమా నా లవ్ స్టోరీ మొదలైంది. శివకార్తికేయన్, నయనతార, ప్రియా ఆనంద్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను దురై సెంథిల్ కుమార్ తెరకెక్కించాడు. ఈ సినిమాను తమిళ్ లో హీరో ధనుష్ నిర్మించడంతో పాటు ఓ పాట పాడాడు. అంతేకాదు, ఆ పాటకు నయనతారతో కలిసి డాన్స్ కూడా చేశాడు. అనిరుధ్ అందించిన ఈ సినిమాలో పాటలన్నీ బాగుంటాయి.

=======================

36 వయసులో నటీనటులు: జ్యోతిక, రెహమాన్ తదితరులు దర్శకత్వం: రోషన్ ఆండ్రూస్ సంగీతం: సంతోష్ నారాయణ్ సినిమాటోగ్రఫీ: ఆర్.దివాకరన్ నిర్మాత: సూర్య బ్యానర్: 2డి ఎంటర్ టైన్మెంట్ రిలీజ్ డేట్: 24 జులై, 2020 వాసంతి (జ్యోతిక) రెవెన్యూ కార్యాలయంలో అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌. భర్త రాంప్రసాద్‌ (రహమాన్‌), 13 ఏళ్ల కూతురు మృదుల సంతోషమే తన సంతోషంగా కాలం వెల్లదీస్తుంది. ఐర్లాండ్‌లో ఉద్యోగం చేయాలన్న భర్త ఆశలు, అక్కడే చదవాలన్న కూతురు కలల్ని నెరవేర్చేందుకు తానూ ప్రయత్నిస్తుంది. ఐర్లాండ్‌లో కుటుంబం మనుగడ సాధించాలంటే భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తే తప్ప సాధ్యం కాదు. అయితే 36 ఏళ్ల వాసంతికి ఉద్యోగం రాదు. వరుస ఘటనలతో కుంగిపోయిన వాసంతి.. ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఎలా సక్సెస్‌ సాధించింది అన్నదే 36-వయసులో సినిమా కథ.

=====================

ఒంగోలు గిత్త నటీనటులు : రామ్ పోతినేని, కృతి కర్బందా ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, కిషోర్ దాస్, ప్రభు, అజయ్, అభిమన్యు సింగ్, ఆహుతి ప్రసాద్, రమాప్రభ, రఘుబాబు, సంజయ్ రెడ్డి తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : G.V. ప్రకాష్ కుమార్ డైరెక్టర్ : భాస్కర్ ప్రొడ్యూసర్ : B.V.S.N. ప్రసాద్ రిలీజ్ డేట్ : 1 ఫిబ్రవరి 2013 రామ్ కరియర్ లోనే అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఒంగోలుగిత్త. పసితనంలో తన తండ్రికి జరిగిన అన్యాయానికి, ఆ కుట్ర వెనక దాగిన పెద్ద మనిషి అసలు రంగును బయటపెట్టడానికి వచ్చిన యువకుడిలా రామ్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో కృతి కర్బందా హీరోయిన్ గా నటించింది.

==========================

మణికర్నిక నటీనటులు : కంగనా రనౌత్, మొహమ్మద్ జీషన్ అయ్యుబ్ ఇతర నటీనటులు : అతుల్ కులకర్ణి, జీషు సేన్ గుప్తా, రిచర్డ్ కీప్, సురేష్ ఒబెరాయ్, డానీ డెన్ జోంగ్ పా, అంకిత లోఖాండే తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : శంకర్ – ఎహసాన్- లాయ్ డైరెక్టర్ : క్రిష్ ప్రొడ్యూసర్ : జీ స్టూడియోస్, కమాల్ జైన్, నిశాంత్ పిట్టి రిలీజ్ డేట్ : 25 జనవరి 2019 మహారాణి ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా మణికర్ణిక. ఝాన్సీ రాజ్యాన్ని బ్రిటీషు వారి బారిన పడకుండా లక్ష్మీ బాయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది..? తన ప్రజలను కలుపుకుని వారిపై ఎలా తిరగబడింది అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం. యుద్ధ సన్నివేశాలు సినిమాలో హైలెట్ గా నిలిచాయి.

==========================

ఇంద్రుడు హీరో హీరోయిన్స్ : విశాల్,లక్ష్మి మీనన్ ఇతర నటీనటులు : ఇనియా ,శరణ్య పొన్ వణ్ణం, సుందర్ రాము, జయ ప్రకాష్ తదితరులు సంగీతం : జి.వి.ప్రకాష్ కుమార్ నిర్మాత : విశాల్. రోన్ని,సిద్దార్థ్ దర్శకత్వం : తిరు విశాల్– లక్ష్మి మీనన్ జంటగా దర్శకుడు తిరు తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఇంద్రుడు’. ఈ సినిమాలో ఓ డిజార్డర్ తో భాధ పడే ఓ యువకుడిగా నటించాడు విశాల్. విశాల్ యాక్టింగ్, లక్ష్మి మీనన్ గ్లామర్, కామెడీ సీన్స్ , యాక్షన్ సీన్స్, క్లైమాక్స్ లో ట్విస్ట్ ఈ సినిమాకు హైలైట్స్.