ZeeCinemalu – Nov 20

Thursday,November 19,2020 - 11:10 by Z_CLU

ఆకాశగంగ 2 నటీనటులు – రమ్యకృష్ణ, వీణా నాయర్, విష్ణువినయ్, శ్రీనాథ్ భాసి, ప్రవీణ, సతీష్ కృష్ణ తదితరులు కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం – వినయన్ సంగీతం – బిజిబుల్ సినిమాటోగ్రఫీ – ప్రకాష్ కుట్టి నిర్మాణం – ఆకాష్ ఫిలిమ్స్ నిర్మాత – వినయన్ రిలీజ్ – నవంబర్ 1, 2019 మన్యకేసరి రాజ్యం యొక్క యువరాణి ఆరతి ఒక మెడికల్ స్టూడెంట్. అతీంద్రియ శక్తులు, ఆత్మలు పరమాత్మలు ఉన్నాయని నమ్మదు. తన సంస్థానం ఒక ఆత్మ కారణంగా ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతుంది అని వివరించిన వినిపించుకోదు. అలాంటి ఒక సందర్భంలో ఆరతికి సౌమిని తారసపడుతుంది. తనొక భగవత్ స్వరూపిణి. తాను ఆత్మలతో మాట్లాడగలదు. అది తెలుసుకున్న ఆరతి స్నేహితులు ఆశ్చర్యపోతారు. ఆరతిని చనిపోయిన మీ అమ్మ తోటి మాట్లాడు అప్పుడు నీకు ఇలాంటి అతీంద్రియ శక్తుల గురించిన అపనమ్మకం పోయి ఈలాంటి శక్తులు ఉన్న మనుషులు ఉంటారు అనే నమ్మకం ఏర్పడుతుందని చెప్పుతారు. తన స్నేహితులని తప్పు అని నిరూపించడానికి తాను సౌమిని చెప్పినట్టుగా చేయడానికి సిద్దపడుతుంది. ఆరతి తన అమ్మ తోటి మాట్లాడేలోపే ఆకాశగంగ ఉచ్చులో బిగుంచుకుపోతుంది. ఆరతిని సౌమిని ఏవిధంగా కాపాడబోతుంది? అసలు ఎందుకు ఆకాశగంగ ఆరతిని బాధిస్తుంది? ఆ వివరాలు తెలుసుకోవాలంటే ఆకాశగంగ 2 చూడాల్సిందే.

========================== Bommarillu-zee-cinemalu1-551x3201

బొమ్మరిల్లు నటీనటులు : సిద్ధార్థ్, జెనీలియా ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, జయసుధ, సత్య కృష్ణన్, సుదీప పింకీ, సురేఖా వాణి తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్ డైరెక్టర్ : భాస్కర్ ప్రొడ్యూసర్ : దిల్ రాజు రిలీజ్ డేట్ : 9 ఆగష్టు 2006 తండ్రి కొడుకుల అనుబంధాన్ని అద్భుతంగా తెరకెక్కించిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ బొమ్మరిల్లు. న్యాచురల్ పర్ఫామెన్స్ అలరించిన జెనీలియా, సిద్ధార్థ్ పర్ఫామెన్స్ సినిమాకే హైలెట్. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకే హైలెట్.

======================== loukyam-zee-cinemalu-586x276

లౌక్యం నటీనటులు : గోపీచంద్, రకుల్ ప్రీత్ సింగ్ ఇతర నటీనటులు : బ్రహ్మానందం, ముకేష్ రిషి, సంపత్ రిషి, చంద్ర మోహన్, రాహుల్ దేవ్ మరియు తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్ డైరెక్టర్ : శ్రీవాస్ ప్రొడ్యూసర్ : V. ఆనంద్ ప్రసాద్ రిలీజ్ డేట్ : 26 సెప్టెంబర్ 2014 గోపీచంద్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లౌక్యం. తన ఫ్రెండ్ ఒక అమ్మాయిని ప్రేమించడంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా ఆ ఇంట్లోంచి ఆ అమ్మాయిని ఎత్తుకొచ్చి వారిద్దరి పెళ్ళి చేస్తాడు వెంకీ. దాంతో ఆ అమ్మాయి అన్న వెంకీపై కక్ష కడతాడు. ఈ ఇన్సిడెంట్ తరవాత వెంకీ ఒక ఆమ్మాయి ప్రేమలో పడతాడు. తర్వాత ఆ లోకల్ క్రిమినల్ మరో చెల్లెలే తను ప్రేమించిన అమ్మాయి అని తెలుసుకుంటాడు. అప్పుడు వెంకీ ఏం చేస్తాడు..? అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

========================= rarandoi veduka chudham రారండోయ్ వేడుక చూద్దాం zeecinemalu

రారండోయ్ వేడుక చూద్దాం నటీనటులు : అక్కినేని నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ ఇతర నటీనటులు : జగపతి బాబు, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ మురళి, పృథ్విరాజ్, చలపతి రావు మరియు తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్ డైరెక్టర్ : కళ్యాణ్ కృష్ణ కురసాల ప్రొడ్యూసర్ : నాగార్జున అక్కినేని రిలీజ్ డేట్ : 26 మే 2017 పల్లెటూరిలో ఓ పెద్దమనిషిగా కొనసాగే ఆది(సంపత్) ఏకైక కూతురు భ్రమరాంబ(రకుల్ ప్రీత్) చిన్నతనం నుంచి నాన్న గారాల పట్టిగా పెరిగి పెద్దవుతుంది. అలా నాన్నని కుటుంబాన్ని అమితంగా ప్రేమించే భ్రమరాంబను కజిన్ బ్రదర్ పెళ్లిలో చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు శివ(నాగ చైతన్య). అలా భ్రమరాంబతో ప్రేమలో పడిన శివ.. ఆదికి తన తండ్రి కృష్ణ(జగపతి బాబు) కి గొడవ ఉందని ఆ గొడవే తన ప్రేమకు అడ్డుగా మారిందని తెలుసుకుంటాడు.ఇంతకీ ఆది-కృష్ణ కి ఏమవుతాడు..? వారిద్దరి మధ్య గొడవేంటి.. చివరికి శివ-భ్రమరాంబ కలిశారా లేదా అనేది స్టోరీ.

=========================

దొంగ నటీనటులు – కార్తి, జ్యోతిక, సత్యరాజ్, నిఖిలా విమల్, సీత, ఇళవరసు దర్శకుడు – జీతూ జోసెఫ్ బ్యానర్ – వయకామ్ స్టుడియోస్, పారలల్ మైండ్స్ ప్రొడక్షన్ నిర్మాత – రావూరి వి శ్రీనివాస్ సంగీతం – గోవింద వసంత్ రిలీజ్ డేట్ – డిసెంబర్ 20, 2019 విలక్షణ నటుడు కార్తి, సీనియర్ హీరోయిన్ జ్యోతిక నటించిన సినిమా దొంగ. జ్యోతిక, కార్తీ కలిసి నటించిన తొలి చిత్రం ‘దొంగ’ (Donga). నిజ జీవితంలో వదిన-మరిది అయిన వీళ్లిద్దరూ ఈ చిత్రంలో అక్కాతమ్ముళ్లుగా నటించడం విశేషం. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘దృశ్యం’ చిత్రానికి దర్శకత్వం వహించిన జీతూ జోసేఫ్‌ ఈ చిత్రానికి దర్శకుడు. సత్యరాజ్‌ తండ్రి పాత్ర పోషించిన ఈ చిత్రంలో Karthi సరసన ‘మేడ మీద అబ్బాయి’, ‘గాయత్రి’ ఫేమ్‌ నిఖిలా విమల్‌ హీరోయిన్ గా నటించింది. గోవాలో చిన్న చిన్న దొంగతనాలు, చీటింగ్ లు చేస్తూ ఫ్రీ బర్డ్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు విక్కీ(కార్తీ). 15ఏళ్లుగా తప్పిపోయిన కొడుకు శర్వా కోసం వెతుకుతుంటారు తండ్రి జ్ఞానమూర్తి (సత్య రాజ్), అక్క పార్వతి(జ్యోతిక). బాగా డబ్బున్న ఈ కుటుంబంలోకి శర్వాలానే ఉన్న విక్కీని ప్రవేశపెడతాడు పోలీసాఫీసర్ జీవానంద్ (ఇళవరసు). డబ్బు కోసం అతడు ఈ పని చేస్తాడు. మరి శర్వా గా జ్ఞానమూర్తి కుటుంబంలోకి వెళ్లిన విక్కీ అక్కడ ఎదుర్కున్న పరిస్థితులు ఏమిటి? ఆ కుటుంబం అతనిని నమ్మిందా? అసలు శర్వా ఏమయ్యాడు? చివరికి విక్కీ, పార్వతి, జ్ఞానమూర్తిల కథ ఎలా ముగిసింది? అనేది ఈ ‘దొంగ’ స్టోరీ.