ZeeCinemalu – March 6

Friday,March 05,2021 - 10:45 by Z_CLU

బ్రాండ్ బాబు నటీనటులు : సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బ ఇతర నటీనటులు : పూజిత పున్నాడ, మురళీ శర్మ, రాజా రవీంద్ర, సత్యం రాజేష్ మరియు తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : J.B. డైరెక్టర్ : ప్రభాకర్ P. ప్రొడ్యూసర్ : A. శైలేంద్ర బాబు రిలీజ్ డేట్ : ఆగష్టు 3, 2018 వ్యాపారవేత్త డైమండ్ రత్నం (మురళీ శర్మ)కు బ్రాండ్స్ అంటే పిచ్చి. డబ్బున్నవాళ్ల స్టేటస్ మొత్తం వాళ్లు వాడే బ్రాండ్స్ లోనే కనిపిస్తుందనేది అతడి ప్రగాఢ విశ్వాసం. అతడి నమ్మకాలకు తగ్గట్టే కొడుకును పెంచుతాడు రత్నం. వాడే స్పూన్ నుంచి వేసుకునే అండర్ వేర్ వరకు ఇలా ప్రతిది బ్రాండ్ వాడే హీరో (సుమంత్ శైలేంద్ర) డైమండ్.. తనకు కాబోయే భార్య కూడా ఆల్-బ్రాండ్ అమ్మాయిగా ఉండాలని భావిస్తాడు. అయితే ఒకసారి తనకొచ్చిన ఓ మెసేజ్ చూసి హోం మినిస్టర్ కూతురు తనను ప్రేమిస్తుందని భ్రమపడతాడు. తనను ఇంప్రెస్ చేసేందుకు తన ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతుంటాడు. ఈ క్రమంలో హోం మినిస్టర్ కూతురు అనుకొని, ఆ ఇంట్లో పనిచేస్తున్న రాధ (ఇషా రెబ్బా)ను ప్రేమిస్తాడు. అక్కడే అసలు కథ బిగిన్ అవుతుంది. బ్రాండ్ నే నమ్ముకున్న డిమాండ్, పని మనిషితో ప్రేమలో పడితే ఏం జరుగుతుంది అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

======================

నిన్నే ఇష్టపడ్డాను నటీనటులు – తరుణ్, అనిత, శ్రీదేవి, రాజీవ్ కనకాల, శరత్ బాబు, బ్రహ్మానందం, గిరిబాబు దర్శకుడు – కొండ డైలాగ్స్ – కోన వెంకట్ బ్యానర్ – శ్రీ దుర్గా ఆర్ట్స్ నిర్మాత – కేఎల్ నారాయణ సంగీతం – ఆర్పీ పట్నాయక్ రిలీజ్ – జూన్ 12, 2003 వైజాగ్ లో ఉండే చెర్రీ (తరుణ్) సరదాగా ఉండే ఓ కాలేజ్ స్టూడెంట్. హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చిన సంజన(అనిత), చరణ్ కాలేజ్ లో చేరుతుంది. ఇద్దరి మధ్య చిన్నచిన్న గొడవలు, ఆట పట్టించుకోవడాలు జరుగుతుంటాయి. దీంతో చరణ్ ను ఎలాగైనా దెబ్బకొట్టాలని భావించిన సంజన, అతడ్ని ప్రేమించినట్టు నాటకం ఆడుతుంది. పెళ్లి వరకు తీసుకొచ్చి హైదరాబాద్ చెక్కేస్తుంది. భగ్నప్రేమికుడిగా మారిన చెర్రీ, సంజన కోసం హైదరాబాద్ వెళ్తాడు. సంజన తనను మోసం చేసిందని తెలుకుంటాడు. సంజనకు కాబోయే భర్త బోనీ (రాజీవ్ కనకాల) సహాయంతో ఆమె ఇంట్లోకి ఎంటరైన చరణ్.. సంజనకు ఎలా బుద్ధిచెప్పాడు. ఈ క్రమంలో మరో అమ్మాయి గీత (శ్రీదేవి)కు ఎలా దగ్గరయ్యాడనేది ఈ సినిమా కథ. ఆర్పీ పట్నాయక్ కంపోజ్ చేసిన ఈ సినిమాలో పాటలన్నీ సూపర్ డూపర్ హిట్టయ్యాయి. బాలీవుడ్ హాట్ బ్యూటీ నేహా ధూపియా ఇందులో ఐటెంసాంగ్ చేసింది.

======================

బెండు అప్పారావు నటీనటులు : అల్లరి నరేష్, కామ్న జెఠ్మలానీ ఇతర నటీనటులు : కృష్ణ భగవాన్, మేఘన రాజ్, ఆహుతి ప్రసాద్, రఘుబాబు, L.B. శ్రీరామ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : కోటి డైరెక్టర్ : E.V.V. సత్యనారాయణ ప్రొడ్యూసర్ : D. రామానాయుడు రిలీజ్ డేట్ : 16 అక్టోబర్ 2009 R.M.P. గా పని చేస్తుంటాడు బెండు అప్పారావు. నిజానికి తనకు వైద్యం చేసే పద్ధతి తెలీకపోయినా, చిన్నా చితకా ట్రిక్స్ వాడి ఊరి జనానికి వైద్యం చేస్తుంటాడు. దానికి తోడు తన అక్క కాపురాన్ని ఎలాగైనా నిలబెట్టాలని తాపత్రయపడుతుంటాడు. బెండు అప్పారావు బావ, ఎప్పుడు చూసినా తన అక్కని కట్నం కోసం వేదిస్తూనే ఉంటాడు. అంతలో ఊరిలో జరిగిన ఒక సంఘటన అప్పారావు జీవితాన్ని ఇంకో మలుపు తిప్పుతుంది. ఏంటది..? అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

=========================

2.O నటీనటులు : రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ తదితరులు సంగీతం : ఏ.ఆర్.రెహమాన్ సినిమాటోగ్రఫీ : నిరవ్ షా ఎడిటింగ్ : ఆంటోనీ నిర్మాణం : లైకా ప్రొడక్షన్స్ నిర్మాత : సుభాస్కరన్ రచన-స్క్రీన్ ప్లే- దర్శకత్వం : ఎస్.శంకర్ విడుదల : 29 నవంబర్ 2018 450 వందల కోట్ల బడ్జెట్ … 3D టెక్నాలజీ , రోబో కి సీక్వెల్ , సూపర్ స్టార్ రజినీ కాంత్-శంకర్ కాంబో.. ఇవన్నీ కలిసి 2.Oను క్రేజీ ప్రాజెక్టుగా మార్చేశాయి. కథ విషయానికొస్తే.. నగరంలో హఠాత్తుగా సెల్‌ఫోన్లు మాయమవుతుంటాయి. ఫోన్స్ ఎలా మాయమవుతున్నాయో అర్థం కాని పరిస్థితి.. సరిగ్గా అప్పుడే డా.వసీకరణ్‌ (రజనీకాంత్‌) రంగంలోకి దిగి ఈ సమస్య ను ఎదుర్కోవాలంటే మనకి చిట్టి రోబో(రజినీ కాంత్) ఒక్కటే మార్గమని మళ్లీ చిట్టి కి ప్రాణం పోస్తాడు. సెల్‌ఫోన్లు మాయంచేస్తూ నగరంలో విధ్వంసం సృష్టిస్తున్నది పక్షిరాజా (అక్షయ్‌ కుమార్‌) అని తెలుసుకున్న ఆ శక్తి ని చిట్టి ఎలా ఎదురించింది ? అసలు పక్షి రాజా ఎవరు.. అతని కథేంటి.. సెల్ ఫోన్స్ వాడుతున్న వారిపై ఎందుకు ఎటాక్ చేస్తుంటాడు.. అనేది ‘2.O’.

==========================

సాహో నటీనటులు: ప్రభాస్, శ్రద్దా కపూర్, జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్‌, అరుణ్ విజ‌య్‌, వెన్నెల కిషోర్‌, చుంకీ పాండే, మందిరా బేడి, మ‌హేష్ మంజ్రేఖ‌ర్‌ త‌దిత‌రులు బ్యాక్ గ్రౌండ్ స్కోర్: జిబ్రాన్ సినిమాటోగ్రాఫర్ : మధి ఆర్ట్ డైరెక్టర్ : సాబు సిరీల్ నిర్మాణం: యువి క్రియేషన్స్ నిర్మాతలు: వంశీ-ప్రమోద్ కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుజీత్ రన్ టైమ్: 171 నిమిషాలు ముంబయిలో 2వేల కోట్ల రూపాయల దొంగతనం జరుగుతుంది. అలాంటివి వరుసగా 3 జరుగుతాయి. దీంతో పోలీసులు ఎలర్ట్ అవుతారు. ఈ కేసును సీక్రెట్ ఏజెంట్ అశోక్ చక్రవర్తి (ప్రభాస్)కి అప్పగిస్తారు. అతడికి రిపోర్టింగ్ గా పోలీస్ ఆఫీసర్లు అమృతా నాయర్ (శ్రద్ధాకపూర్), గోస్వామి (వెన్నెల కిషోర్), డేవిడ్ (మురళీ శర్మ)ను అప్పగిస్తారు. దొంగను కనుక్కునే ప్రాసెస్ లో.. 2వేల కోట్ల రాబరీ కాస్తా 2 లక్షల కోట్ల వ్యవహారంగా మారుతుంది. సరిగ్గా ఇక్కడే ట్విస్టుల మీద ట్విస్ట్ లు వస్తాయి. కేసును డీల్ చేస్తున్న అశోక్ చక్రవర్తి ఎవరు? అశోక్ కు సాహోకు ఏంటి సంబంధం? మాఫియాతో అశోక్ ఎందుకు పెట్టుకుంటాడు? అమృతను ప్రేమించిన అశోక్ ఆమెను తిరిగి కలిశాడా లేదా అనేది స్టోరీ.

===========================

బ్రదర్ ఆఫ్ బొమ్మాలి నటీనటులు : అల్లరి నరేష్, కార్తీక, మోనాల్ గజ్జర్ ఇతర నటీనటులు : హర్ష వర్ధన్ రాణే, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర డైరెక్టర్ : చిన్ని కృష్ణ ప్రొడ్యూసర్ : అమ్మి రాజు కనిమిల్లి రిలీజ్ డేట్ : నవంబర్ 7 , 2014 కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా , కార్తీక, మోనాల్ గజ్జర్ ఇతర పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘బ్రదర్ అఫ్ బొమ్మాలి’. ఈ సినిమా లో అల్లరిగా నరేష్ అక్కగా కార్తీక యాక్టింగ్ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. కోన వెంకట్ గా బ్రహ్మానందం కామెడీ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. అల్లరి నరేష్ ఎనర్జీ తో కూడిన ఫన్నీ పెరఫార్మెన్స్, శేఖర్ చంద్ర మ్యూజిక్, కామెడీ సీన్స్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్స్.