ZeeCinemalu – June 27

Saturday,June 26,2021 - 07:32 by Z_CLU

Cheekati-చీకటి-fpc-zeecinemalu1

చీకటి నటీనటులు – సుందర్ సి, గణేశ్, సాక్షి చౌదరి, సాయిధన్సిక, విమలా రామన్ దర్శకత్వం – వీజెడ్ దురై సంగీతం – గిరీష్ జి. డీవోపీ – కృష్ణస్వామి రన్ టైమ్ – 132 నిమిషాలు మధ్యాహ్నం 12 గంటలకు ఓ హిల్ స్టేషన్ లో సినిమా ఓపెన్ అవుతుంది. అక్కడున్న వ్యక్తులంతా ఎవరి పనుల్లో వాళ్లు ఉంటారు. ఇంతలో సడెన్ గా కొండల నుంచి ఓ పెద్ద కొండచిలువ వస్తుంది. అది చూసి అంతా పారిపోతారు. అదే టైమ్ లో సడెన్ గా చీకటి పడుతుంది. ఆ చీకట్లో ఆ ప్రాంతానికి చెందిన ఐదుగురు హత్యకు గురవుతారు. అదే ప్రాంతానికి ట్రాన్సఫర్ పై వచ్చిన పోలీసాఫీసర్ సుందర్ సి. ఆ హత్యల్ని దర్యాప్తు చేస్తుంటారు. అంతుచిక్కని ఆ చీకటి సుందర్ సి కుటుంబాన్ని కూడా కమ్మేస్తుంది. ఫైనల్ గా సుందర్ సి. ఆ కేసును ఛేదించాడా లేదా? ఆ ప్రాంతానికి, చీకటికి ఉన్న సంబంధం ఏంటనేది ఈ సినిమా స్టోరీ.

========================== Ninne-Istapaddanu-నిన్నే-ఇష్టపడ్డాను-Zeecinemalu1

నిన్నే ఇష్టపడ్డాను నటీనటులు – తరుణ్, అనిత, శ్రీదేవి, రాజీవ్ కనకాల, శరత్ బాబు, బ్రహ్మానందం, గిరిబాబు దర్శకుడు – కొండ డైలాగ్స్ – కోన వెంకట్ బ్యానర్ – శ్రీ దుర్గా ఆర్ట్స్ నిర్మాత – కేఎల్ నారాయణ సంగీతం – ఆర్పీ పట్నాయక్ రిలీజ్ – జూన్ 12, 2003 వైజాగ్ లో ఉండే చెర్రీ (తరుణ్) సరదాగా ఉండే ఓ కాలేజ్ స్టూడెంట్. హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చిన సంజన(అనిత), చరణ్ కాలేజ్ లో చేరుతుంది. ఇద్దరి మధ్య చిన్నచిన్న గొడవలు, ఆట పట్టించుకోవడాలు జరుగుతుంటాయి. దీంతో చరణ్ ను ఎలాగైనా దెబ్బకొట్టాలని భావించిన సంజన, అతడ్ని ప్రేమించినట్టు నాటకం ఆడుతుంది. పెళ్లి వరకు తీసుకొచ్చి హైదరాబాద్ చెక్కేస్తుంది. భగ్నప్రేమికుడిగా మారిన చెర్రీ, సంజన కోసం హైదరాబాద్ వెళ్తాడు. సంజన తనను మోసం చేసిందని తెలుకుంటాడు. సంజనకు కాబోయే భర్త బోనీ (రాజీవ్ కనకాల) సహాయంతో ఆమె ఇంట్లోకి ఎంటరైన చరణ్.. సంజనకు ఎలా బుద్ధిచెప్పాడు. ఈ క్రమంలో మరో అమ్మాయి గీత (శ్రీదేవి)కు ఎలా దగ్గరయ్యాడనేది ఈ సినిమా కథ. ఆర్పీ పట్నాయక్ కంపోజ్ చేసిన ఈ సినిమాలో పాటలన్నీ సూపర్ డూపర్ హిట్టయ్యాయి. బాలీవుడ్ హాట్ బ్యూటీ నేహా ధూపియా ఇందులో ఐటెంసాంగ్ చేసింది.

========================= santosham-movie-సంతోషం-zeecinemalu

సంతోషం నటీనటులు – నాగార్జున, శ్రియ, ప్రభుదేవా, గ్రేసీసింగ్, సునీల్ తదితరులు సంగీతం – ఆర్పీ పట్నాయక్ దర్శకత్వం – దశరథ్ బ్యానర్ – శ్రీ దుర్గా ఆర్ట్స్ నిర్మాత – కేఎల్ నారాయణ రిలీజ్ – 2002, మే 9 నాగార్జున కెరీర్ లో సూపర్ హిట్ సినిమాల్లో ఒకటి సంతోషం. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా, కింగ్ నాగ్ ను ఫ్యామిలీ ఆడియన్స్ కు మరింత దగ్గర చేసింది. హార్ట్ టచింగ్ స్టోరీని దర్శకుడు దశరథ్, అంతే హార్ట్ టచింగ్ గా తెరకెక్కించాడు. హీరోయిన్ గ్రేసీ సింగ్ ఈ సినిమాతోనే టాలీవుడ్ కు పరిచయమైంది. ఇక మరో హీరోయిన్ శ్రియ, ఎప్పట్లానే తన క్యూట్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది. ఈ సినిమాలో సాంగ్స్ అన్నీ సూపర్ హిట్. థీమ్ సాంగ్ తో కలిపి మళ్లీ మళ్లీ హమ్ చేసుకునేలా మొత్తం 8 ట్యూన్స్ ఇచ్చాడు ఆర్పీ పట్నాయక్.

=========================== sudigadu-zeecinemalu1

సుడిగాడు నటీనటులు : అల్లరి నరేష్, మోనాల్ గజ్జర్ ఇతర నటీనటులు : బ్రహ్మానందం, ఆలీ, M.S. నారాయణ, రఘుబాబు, వేణు మాధవ్, చంద్ర మోహన్, చలపతి రావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీ వసంత్ డైరెక్టర్ : భీమనేని శ్రీనివాస రావు ప్రొడ్యూసర్ : చంద్రశేఖర్ D రెడ్డి రిలీజ్ డేట్ : 24 ఆగష్టు 2012 అల్లరి నరేష్ నటించిన స్పూఫ్ కామెడీ చిత్రం సుడిగాడు. భీమనేని శ్రీనివాస రావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా పక్కా కామెడీ ఎంటర్ టైనర్ అనిపించుకుంది. అల్లరి నరేష్, బ్రహ్మానందం కాంబినేషన్ లోని కామెడీ సీన్స్ సినిమాకే హైలెట్.

========================== saakshyam-bellamkonda-zeecinemalu1

సాక్ష్యం నటీనటులు : బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే ఇతర నటీనటులు : శరత్ కుమార్, మీనా, జగపతి బాబు, రవి కిషన్, ఆశుతోష్ రానా, మధు గురుస్వామి తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : హర్షవర్ధన్ రామేశ్వర్ డైరెక్టర్ : శ్రీవాస్ ప్రొడ్యూసర్ : అభిషేక్ నామా రిలీజ్ డేట్ : 27 జూలై 2018 స్వస్తిక్ నగరంలో ఉమ్మడి కుటుంబంతో అందరికీ ఆదర్శంగా, ఊరికి పెద్దగా ఉంటాడు రాజు గారు (శరత్ కుమార్). అదే ఊరిలో ఉంటూ తన తమ్ముళ్ళతో కలిసి అన్యాయాలకు, అక్రమాలకూ కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తాడు మునిస్వామి(జగపతిబాబు). తను చేసే ప్రతీ పనికి ఎదురు రావడంతో తన ముగ్గురు తమ్ముళ్ళు(రవి కిషన్, అశుతోష్ రానా)లతో కలిసి సాక్ష్యాలు లేకుండా రాజు గారు కుటుంబాన్ని మొత్తం హత్య చేస్తాడు ముని స్వామి. కానీ ఒక్క వారసుడు మాత్రం తప్పించుకుని చివరికి న్యూయార్క్ లో సెటిల్ అయిన వ్యాపారవేత్త శివ ప్రకాష్ (జయప్రకాష్)వద్ద విశ్వాజ్ఞ(బెల్లంకొండ సాయి శ్రీనివాస్)గా పెరిగి పెద్దవుతాడు. అలా ఓ పెద్ద వ్యాపారవేత్త కొడుకుగా వీడియో గేమ్ డెవలపర్ గా జీవితాన్ని కొనసాగించే విశ్వజ్ఞ ఓ సందర్భంలో ఇండియా నుండి న్యూయార్క్ వచ్చిన సౌందర్య లహరి(పూజా హెగ్డే)ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. పురాణాలు, ఇతిహాసాల మీదుగా ఆసక్తి ఉన్న సౌందర్యలహరి దగ్గర చాలా విషయాలు తెలుసుకుంటాడు. హఠాత్తుగా తన తండ్రి గురించి ఇండియాకి వెళ్ళిన సౌందర్య ను వెతుక్కుంటూ ఇండియాలో అడుగుపెడతాడు విశ్వాజ్ఞ. ఇండియా వచ్చాక విశ్వ తనకు తెలియని వ్యక్తుల చావులకు కారణం అవుతాడు.. చంపే వాడికి చచ్చేవాడెవరో తెలియదు… చచ్చే వాడికి చంపెదేవరో తెలియదు విధి ఆడే ఈ ఆటలో ఏం జరిగింది… చివరికి తన కుటుంబాన్ని దారుణంగా చంపిన ముని స్వామీ ను అతని తమ్ముళ్ళను విస్వా ఎలా అంతమొందించాడు.. అనేది కథ.

========================= leader-rana-zeecinemalu1

లీడర్ నటీనటులు : రానా దగ్గుబాటి, ప్రియా ఆనంద్, రిచా గంగోపాధ్యాయ ఇతర నటీనటులు : తనికెళ్ళ భరణి, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, సుహాసినీ మణిరత్నం, సుబ్బరాజు మరియు తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ.జే.మేయర్ డైరెక్టర్ : శేఖర్ కమ్ముల ప్రొడ్యూసర్ : M. శరవణన్, M.S. గుహన్ రిలీజ్ డేట్ : 19 ఫిబ్రవరి 2010 రానా దగ్గుబాటి ఈ సినిమాతోనే టాలీవుడ్ లో ఇంట్రడ్యూస్ అయ్యాడు. న్యూ ఏజ్ పొలిటికల్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమాలో రానా ముఖ్యమంత్రిగా నటించాడు. తన తండ్రి మరణం తరవాత పదవీ పగ్గాలు చేతిలోకి తీసుకున్న ఈ యంగ్ పాలిటీషియన్ వ్యవస్థలో ఉన్న లొపాలను సరిదిద్దగలిగాడా…? ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోగలిగాడా..? అన్నదే ఈ సినిమాలోని ప్రధాన కథాంశం.