ZeeCinemalu – Jan 15

Thursday,January 14,2021 - 09:52 by Z_CLU

అహనా పెళ్లంట నటీనటులు : అల్లరి నరేష్, శ్రీహరి, రీతు బర్మేచ ఇతర నటీనటులు : అనిత హాసనందిని, బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, సుబ్బరాజు, విజయ్ సామ్రాట్ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : రఘు కుంచె డైరెక్టర్ : వీరభద్రం ప్రొడ్యూసర్ : అనిల్ సుంకర రిలీజ్ డేట్ : 2 మార్చి 2011 రియల్ స్టార్ శ్రీహరి, నరేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన హిలేరియస్ ఎంటర్ టైనర్ అహ నా పెళ్ళంట. వీరభద్రం డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అన్ని సెంటర్ లలోను సూపర్ హిట్ అయింది. కామెడీ ఈ సినిమాకి పెద్ద ఎసెట్.

=========================

నా పేరు సూర్య నటీనటులు : అల్లు అర్జున్, అనూ ఇమ్మాన్యువెల్ ఇతర నటీనటులు : అర్జున్ సర్జ, R. శరత్ కుమార్, జానకి వర్మ, ఠాకూర్ అనూప్ సింగ్, బోమన్ ఇరాని తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : విశాల్ శేఖర్, జాన్ స్టీవర్ట్ ఏడూరి డైరెక్టర్ : వక్కంతం వంశీ ప్రొడ్యూసర్ : శ్రీధర్ లగడపాటి, శిరీష లగడపాటి, బన్నీ వాస్ రిలీజ్ డేట్ : 4 మే 2018 సైనికుడు సూర్య(అల్లు అర్జున్)కు కోపం ఎక్కువ. ఈ క్రమంలో ఎప్పుడూ ఏదో ఒక గొడవలో నలుగుతుంటాడు. కానీ ఆ ప్రతి గొడవకు ఓ రీజన్ ఉంటుంది. అదే కోపంతో ఒక టెర్రరిస్ట్ ని కాల్చి చంపుతాడు. దీంతో కల్నల్ శ్రీవాత్సవ్ (బోమన్ ఇరానీ) సూర్యను డిస్మిస్ చేస్తాడు. తిరిగి ఆర్మీలో చేరాలంటే చివరి అవకాశంగా ప్రముఖ సైకాలజి యూనివర్సిటీ డీన్ రామకృష్ణంరాజు(అర్జున్) సంతకం తీసుకుని రమ్మని చెబుతారు. అలా రామకృష్ణంరాజు సంతకం కోసం వైజాగ్ వస్తాడు సూర్య. అయితే తను సంతకం చేయాలంటే 21 రోజులు కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలని సూర్య కి కండీషన్ పెడతాడు కృష్ణంరాజు. అప్పుడే వైజాగ్ లోకల్ డాన్ చల్లా(శరత్ కుమార్), కొడుకు(అనూప్ టాగోర్ సింగ్)తో గొడవ పెట్టుకుంటాడు సూర్య. స్థానికంగా ఉండే మాజీ సైనికుడు ముస్తఫా(సాయి కుమార్)ను ఓ లాండ్ కోసం హత్య చేస్తాడు చల్లా కొడుకు. ఆ హత్యలో ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తాడు సూర్య. కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం తన వ్యక్తిత్వాన్ని వదిలేసి అబద్ధం చెబుతాడు. ఫైనల్ గా సూర్య తను అనుకున్నది సాధించాడా.. కృష్ణంరాజు సంతకంతో తిరిగి ఆర్మీలో చేరాడా లేదా..? అసలు సూర్యకు కృష్ణంరాజుకు సంబంధం ఏంటి ? తన క్యారెక్టర్ కోసం సూర్య ఏం చేశాడు అనేది సినిమా కథ.

=======================

లక్ష్మి తారాగణం : ప్రభుదేవా , ఐశ్వర్య రాజేష్, కోవై సరళ, దిత్య బండే , సల్మాన్ యూసుఫ్ ఖాన్, చామ్స్ , అక్షత్ సింగ్, జీత్ దాస్, సామ్ పాల్. రచన మరియు దర్శకత్వం: ఎఎల్ విజయ్ నిర్మాతలు: సి. కల్యాణ్, ప్రతీక్ చక్రవర్తి, శృతి నల్లప్ప మరియు ఆర్.రవీంద్రన్ బ్యానర్లు: సి.కె ఎంటర్టైన్మెంట్స్, ప్రమోద్ ఫిల్మ్స్ మరియు ట్రైడెంట్ ఆర్ట్స్ సంగీతం: సామ్ సీఎస్ డీఓపీ : నీరవ్ షా ఎడిటర్ : ఆంథోనీ ప్రభుదేవా, ఐశ్వర్య ప్రధానపాత్రల్లో నటిస్తున్న సినిమా ‘లక్ష్మి’.. ఏ.ఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా కిడ్స్ డాన్స్ రియాలిటీ షో సూపర్ డాన్సర్ సీజన్ 1 విజేత అయిన దిత్య బండే బాలనటిగా పరిచయమైంది. డాన్స్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో దిత్య డాన్స్ గురువుగా ప్రభుదేవా కనిపించాడు. దిత్య స్టెప్పులు, కథలో ఎమోషన్స్ ఈ సినిమాలో మెయిన్ ఎట్రాక్షన్స్.

=========================

మిస్టర్ మజ్ను నటీ నటులు : అఖిల్, నిధి అగర్వాల్, నాగబాబు , జయప్రకాష్, రావు రమేష్ , హైపర్ ఆది తదితరులు సంగీతం : థమన్ ఛాయాగ్రహణం : జార్జ్ సి. విలియమ్స్ నిర్మాణం : శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఎల్ఎల్ పీ నిర్మాత : బీవీఎస్ఎన్ ప్రసాద్ కథ -స్క్రీన్ ప్లే -దర్శకత్వం: వెంకీ అట్లూరి నిడివి : 145 నిమిషాలు విడుదల తేది : 25 జనవరి , 2019 లండన్ లో చదువుకునే విక్రమ్ కృష్ణ అలియాస్ విక్కి(అఖిల్) నిత్యం అమ్మాయిలను తన మాయలో పడేస్తూ వారిని ఆనందంగా ఉంచుతుంటాడు. అదే లండన్ లో అబద్దాలు చెప్పకుండా తనని మాత్రమే ప్రేమించే అబ్బాయి కోసం ఎదురుచూస్తోంటుంది నిఖిత(నిధి అగర్వాల్). అనుకోకుండా వీరిద్దరూ లండన్ లో పరిచయమవుతారు. విక్కి ప్లే బాయ్ క్యారెక్టర్ చూసి అతనికి దూరంగా ఉండాలనుకుంటుంది నిఖిత.. ఈ క్రమంలో ఇండియా తిరిగి వచ్చిన వీరిద్దరికీ విక్కీ చెల్లికి , నిఖిత అన్నయ్య కి పెళ్లి కుదిరిందని తెలుస్తుంది. అయితే విక్కీ తన ఫ్యామిలీ కి ఇచ్చే ఇంపార్టెన్స్ , తండ్రిపై అతనికున్న గౌరవం, దగ్గరైన వారిని ఎంతగా ప్రేమిస్తాడో తెలుసుకొని అతనితో ప్రేమలో పడిపోతుంది నిఖిత. అయితే ప్రేమ అనేది జస్ట్ నెలకే పరిమితం అనే ఫీలింగ్ లో ఉంటూ పెళ్ళికి దూరంగా ఉండే విక్కీ కి లవ్ ప్రపోజ్ చేస్తుంది నిఖిత. అతనికి ఇష్టం లేకపోవడంతో ఓ రెండు నెలలు తనను ప్రేమించాలని, ఆ తర్వాత ఇష్టం కలిగితే పెళ్లి చేసుకోవాలని ఒప్పందం కుదుర్చుకుంటుంది నిఖిత. అక్కడి నుండి అసలు కథ మొదలవుతోంది. అలా నిఖిత ఒప్పందానికి లాక్ అయిన విక్కీ ఎలాంటి సంఘటనలు ఎదుర్కున్నాడు.. చివరికి విక్కీ-నిఖిత ఎలా ఒకటయ్యారు..అనేది మిగతా కథ.

=====================

శివాజీ నటీనటులు : రజినీకాంత్, శ్రియ శరన్ ఇతర నటీనటులు : వివేక్, సుమన్, రఘువరన్, మణివన్నన్, వడివుక్కరసి, కోచిన్ హనీఫా తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : A.R. రెహమాన్ డైరెక్టర్ : S.శంకర్ ప్రొడ్యూసర్ : M.S. గుహన్, M. శరవణన్ రిలీజ్ డేట్ : 15 జూన్ 2007 ఫారిన్ నుండి దేశం కోసం ఏదైనా చేయాలనే ఆరాటం తో ఇండియాకి వస్తాడు శివాజీ. ప్రజల కోసం ఉచిత విద్య, వైద్యం అందించాలనే ఉద్దేశం తో ట్రస్ట్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ శివాజే ఇలా చేయడం వల్ల తన వ్యాపారాలు దెబ్బ తింటాయని భావించిన కొందరు శివాజీని అడ్డుకుంటారు. అప్పుడు శివాజీ వారిని ఎలా ఎదుర్కుంటాడు…? తాను అనుకున్న విధంగా సమాజానికి సేవ చేయగలిగాడా..? లేదా..? అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.