ZeeCinemalu – Jan 14

Wednesday,January 13,2021 - 09:09 by Z_CLU

బొమ్మరిల్లు నటీనటులు : సిద్ధార్థ్, జెనీలియా ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, జయసుధ, సత్య కృష్ణన్, సుదీప పింకీ, సురేఖా వాణి తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్ డైరెక్టర్ : భాస్కర్ ప్రొడ్యూసర్ : దిల్ రాజు రిలీజ్ డేట్ : 9 ఆగష్టు 2006 తండ్రి కొడుకుల అనుబంధాన్ని అద్భుతంగా తెరకెక్కించిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ బొమ్మరిల్లు. న్యాచురల్ పర్ఫామెన్స్ అలరించిన జెనీలియా, సిద్ధార్థ్ పర్ఫామెన్స్ సినిమాకే హైలెట్. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకే హైలెట్.

======================== winner-zee-cinemalu-586x2761

విన్నర్ నటీనటులు : సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ ఇతర నటీనటులు : జగపతి బాబు, ఠాకూర్ అనూప్ సింగ్, ఆదర్శ్ బాలకృష్ణ, ప్రియదర్శి పుల్లికొండ, ముకేష్ రిషి, ఆలీ, వెన్నెల కిషోర్ మరియు తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : S. తమన్ డైరెక్టర్ : గోపీచంద్ మాలినేని ప్రొడ్యూసర్ : నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు రిలీజ్ డేట్ : 24 ఫిబ్రవరి 2017 సిద్దార్థ్ అనే యువకుడు (సాయి ధరమ్ తేజ్) చిన్నతనంలో కొన్ని సంఘటనల వల్ల తన తండ్రి మహేందర్ రెడ్డి(జగపతి బాబు) కి దూరంగా ఉంటూ రేసింగ్, గుర్రాలపై ద్వేషం పెంచుకుంటాడు.. అలా తండ్రికి దూరంగా ఉంటూ జీవితాన్ని కొనసాగిస్తున్న సిద్దార్థ్ ఒక సందర్భంలో సితార(రకుల్) అనే రన్నర్ ని చూసి ప్రేమలో పడతాడు. అలా తన ప్రేమలో పడిన సిద్దార్థ్ ను ఓ అనుకోని సందర్భంలో ఆది అనే రేసింగ్ జాకీ తో బెట్ కట్టిస్తుంది సితార. అలా సితార ప్రేమ కోసం తనకిష్టం లేని రేసింగ్ మొదలుపెట్టిన సిద్దార్థ్… ఆ రేసింగ్ లో ఎలా గెలిచాడు.. చివరికి తనకు 20 ఏళ్ల క్రితం దూరమైన తండ్రికి ఎలా దగ్గరయ్యాడు.. అనేది సినిమా కథాంశం.

========================

బ్రూస్ లీ నటీనటులు : రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ ఇతర నటీనటులు : అరుణ్ విజయ్, కృతి కర్బందా, నదియా, సంపత్ రాజ్, బ్రహ్మానందం, ఆలీ మరియు తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్ డైరెక్టర్ : శ్రీను వైట్ల ప్రొడ్యూసర్ : D.V.V. దానయ్య రిలీజ్ డేట్ : 16 అక్టోబర్ 2015 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కరియర్ లోనే డిఫెరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ బ్రూస్ లీ. తన అక్క చదువు కోసం స్టంట్ మ్యాన్ గా మారిన యువకుడి క్యారెక్టర్ లో చెర్రీ పర్ఫామెన్స్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. మెగాస్టార్ క్యామియో సినిమాకి మరో హైలెట్.

============================ kanchana-3-కాంచన-3-zeecinemalu

కాంచన 3 న‌టీన‌టులు : రాఘ‌వ లారెన్స్‌, ఓవియా, వేదిక‌, నిక్కి తంబోలి, కొవైస‌ర‌ళ‌, క‌భీర్ దుహ‌న్ సింగ్‌, శ్రీమ‌న్‌, దేవ‌ద‌ర్శిని, కిషోర్ త‌దిత‌రులు సినిమాటోగ్ర‌ఫి : వెట్రి, స‌ర్వేష్ మురారి మ్యూజిక్ : తమన్ క‌థ‌-స్క్రీన్‌ప్లే-ద‌ర్శ‌కత్వం: రాఘ‌వ లారెన్స్‌ నిడివి : 161 నిమిషాలు విడుదల తేది : 19 ఏప్రిల్ 2019 దెయ్యం అనే సౌండ్ వింటేనే భయపడే రాఘవ (రాఘవ లారెన్స్) తన కుటుంబంతో కలిసి తాతయ్య షష్టి పూర్తి కోసమని వరంగల్ వెళ్తాడు. అలా తాత ఊరెళ్ళిన రాఘవను తన మావయ్యల కూతుర్లు కావ్య (ఒవియా),ప్రియ (వేదిక),ప్రియా చెల్లి(నిక్కి తంబోలి) ప్రేమలో పడేసి, పెళ్లి చేసుకొనే ప్రయత్నం చేస్తుంటారు. ఆ ముగ్గురిలో తనను బాగా ఆకర్షించిన మరదలిని మాత్రమే పెళ్లి చేసుకుంటానని కండీషన్ పెడతాడు రాఘవ. అయితే అనుకోకుండా ఆ ఇంట్లోకి రెండు ఆత్మలు ప్రవేశిస్తాయి. ఇంట్లో వాళ్ళని భయపెడుతూ పగతో రగిలిపోతుండే ఆ ఆత్మలను ఇంటి నుండి బయటకి పంపించే ప్రయత్నం చేస్తుంటారు రాఘవ తల్లి(కోవై సరళ), అన్నయ్య(శ్రీమాన్) వదిన(దేవ‌ద‌ర్శిని). అయితే ఓ సందర్భంలో రాఘవ లోకి ఆత్మ ప్రవేశిస్తుంది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు రాఘవలోకి కాళి అనే ఆత్మ ప్రవేశించిందని తెలుసుకుంటారు. ఇంతకీ కాళి ఎవరు..? కాళి తో పాటు ఉండే మరో ఆత్మ ఎవరిది..? రాఘవ ద్వారా కాళి తన పగను ఎలా తీర్చుకున్నాడు.. అనేది మిగతా కథ.

=========================

బెండు అప్పారావు నటీనటులు : అల్లరి నరేష్, కామ్న జెఠ్మలానీ ఇతర నటీనటులు : కృష్ణ భగవాన్, మేఘన రాజ్, ఆహుతి ప్రసాద్, రఘుబాబు, L.B. శ్రీరామ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : కోటి డైరెక్టర్ : E.V.V. సత్యనారాయణ ప్రొడ్యూసర్ : D. రామానాయుడు రిలీజ్ డేట్ : 16 అక్టోబర్ 2009 R.M.P. గా పని చేస్తుంటాడు బెండు అప్పారావు. నిజానికి తనకు వైద్యం చేసే పద్ధతి తెలీకపోయినా, చిన్నా చితకా ట్రిక్స్ వాడి ఊరి జనానికి వైద్యం చేస్తుంటాడు. దానికి తోడు తన అక్క కాపురాన్ని ఎలాగైనా నిలబెట్టాలని తాపత్రయపడుతుంటాడు. బెండు అప్పారావు బావ, ఎప్పుడు చూసినా తన అక్కని కట్నం కోసం వేదిస్తూనే ఉంటాడు. అంతలో ఊరిలో జరిగిన ఒక సంఘటన అప్పారావు జీవితాన్ని ఇంకో మలుపు తిప్పుతుంది. ఏంటది..? అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.