ZeeCinemalu – Feb 23

Monday,February 22,2021 - 09:48 by Z_CLU

పేపర్ బాయ్ నటీనటులు: సంతోష్ శోభన్, రియా సోమన్ ఇతర నటీనటులు: తాన్యా హోప్, పోసాని కృష్ణ మురళి, అన్నపూర్ణ, బిత్తిరి సత్తి, సన్నీ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్: భీమ్స్ డైరెక్టర్ : V. జయశంకర్ ప్రొడ్యూసర్ : సంపత్ నంది, రాములు, వెంకట్, నరసింహ రిలీజ్ డేట్ : 31 ఆగష్టు 2018 పేపర్ బాయ్ రవి, ధరణి ఇద్దరూ ప్రేమించుకుంటారు. అయితే ఎప్పుడైతే వీరి ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలుస్తుందో అక్కడి నుండే సమస్య మొదలవుతుంది. మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన రవితో ధరణి పెళ్లి చేయడానికి ఆమె కుటుంబ సభ్యులు అంత ఈజీగా ఒప్పుకోరు.. అప్పుడు రవి, ధరణి ఏం చేస్తారు..? తమ ప్రేమని ఎలా గెలిపించుకుంటారు. అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

========================

బలాదూర్ నటీనటులు : రవితేజ, అనుష్క శెట్టి ఇతర నటీనటులు : కృష్ణ, చంద్ర మోహన్, ప్రదీప్ రావత్, సునీల్, బ్రహ్మానందం, సుమన్ శెట్టి తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : K.M. రాధాకృష్ణన్ డైరెక్టర్ : K.R. ఉదయ శంకర్ ప్రొడ్యూసర్ : D. రామానాయుడు రిలీజ్ డేట్ : 15 ఆగష్టు 2008 బాధ్యత లేకుండా తిరుగుతుంటాడు చంటి. అందుకే అస్తమానం తండ్రితో మాటలు పడుతుంటాడు. అలాంటప్పుడు కూడా చంటి పెదనాన్న రామకృష్ణ చంటికి సపోర్టివ్ గా ఉంటాడు. అందుకే చంటికి పెదనాన్న అంటే చాలా ఇష్టం. ఇదిలా ఉంటే ఉమాపతి రామకృష్ణని ఎలాగైనా ఇబ్బందుల పాలు చేయలని ప్రయత్నం చేస్తుంటాడు. అప్పుడు చంటి ఏం చేస్తాడు..? ఎలా తన కుటుంబాన్ని… రామక్రిష్ణని కాపాడుకుంటాడు..? అనేదే సినిమా ప్రధాన కథాంశం.

========================

శైలజారెడ్డి అల్లుడు నటీనటులు : నాగ చైతన్య, అనూ ఇమ్మాన్యువెల్ ఇతర నటీనటులు : రమ్య కృష్ణన్, నరేష్, మురళీ శర్మ, కళ్యాణి నటరాజన్, వెన్నెల కిషోర్ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : గోపీ సుందర్ డైరెక్టర్ : మారుతి దాసరి ప్రొడ్యూసర్ : S. రాధాకృష్ణ రిలీజ్ డేట్ : 13 సెప్టెంబర్ 2018 ఈగోకి బ్రాండ్ అంబాసిడర్ అయిన పెద్ద వ్యాపారవేత్త (మురళి శర్మ) ఏకైక కొడుకు చైతు(నాగచైతన్య). తన తండ్రిలా కాకుండా కాస్త సహనం, ఓపికతో జీవితాన్ని కూల్ గా గడుపుతుంటాడు. ఓ సందర్భంలో చైతూకి ఈగో కు మారుపేరైన అను(అను ఇమ్మానియేల్) పరిచయమవుతుంది. ఆ పరిచయం వారిద్దరి మధ్య ప్రేమగా మారుతుంది. అలా తండ్రి , ప్రియురాలి ఈగోల మధ్య నలిగిపోయే చైతూ జీవితంలోకి అనుకోకుండా పౌరుషంతో గల ఈగో ఉన్న మరో వ్యక్తి వస్తుంది.. ఆవిడే శైలజా రెడ్డి(రమ్యకృష్ణ). తన ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళ్లడం కోసం స్నేహితుడు చారి(వెన్నెల కిషోర్)తో కలిసి అత్తయ్య శైలజారెడ్డి ఇంట్లో అడుగుపెడతాడు చైతూ. మామయ్య సహకారంతో తల్లికూతురుని చైతూ ఎలా కలిపాడు, వాళ్ల ఇగోల్ని ఎలా జయించాడు అనేది బ్యాలెన్స్ కథ.

=============================== Ramya-Krishna-Queen-zeecinemalu

క్వీన్ నటీనటులు – రమ్యకృష్ణ, అనికా సురేంద్రన్, ఇంద్రజిత్ సుకుమారన్, అంజనా జయప్రకాష్, వంశీకృష్ణ తదితరులు దర్శకత్వం – గౌతమ్ మీనన్ సంగీతం – శివ సినిమాటోగ్రఫీ – ఎస్ఆర్ ఖాదిర్ ఎడిటర్ – ప్రవీణ్ ఆంటోనీ ప్రొడక్షన్ కంపెనీ – ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓ శివగామి.. ఓ శైలజారెడ్డి.. ఓ శక్తిశేషాద్రి.. శివగామి గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు. శైలజారెడ్డి గురించి కూడా చాలామందికి తెలుసు. త్వరలోనే శక్తి శేషాద్రిని కూడా చూడబోతున్నారు. అవును.. మరో పవర్ ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ కనిపించబోతున్నారు. ఆమె నటించిన సిరీస్ క్వీన్. లేడీ సూపర్ స్టార్ గా… యంగెస్ట్ చీఫ్ మినిస్టర్ గా.. యావత్ రాష్ట్రానికి అమ్మగా.. ఇలా డిఫరెంట్ షేడ్స్ లో శక్తి శేషాద్రి పాత్రలో కనిపించారు రమ్యకృష్ణ. ఈ ప్రతిష్టాత్మక, భారీ బడ్జెట్ సిరీస్ ను ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ డైరక్ట్ చేశాడు. ఇందులో మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించారు రమ్యకృష్ణ. అరుదుగా మాత్రమే ఇలాంటి రోల్స్ వస్తుంటాయి. అలాంటి అరుదైన రోల్ ను రమ్యకృష్ణ పోషించారు.

===========================

శివాజీ నటీనటులు : రజినీకాంత్, శ్రియ శరన్ ఇతర నటీనటులు : వివేక్, సుమన్, రఘువరన్, మణివన్నన్, వడివుక్కరసి, కోచిన్ హనీఫా తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : A.R. రెహమాన్ డైరెక్టర్ : S.శంకర్ ప్రొడ్యూసర్ : M.S. గుహన్, M. శరవణన్ రిలీజ్ డేట్ : 15 జూన్ 2007 ఫారిన్ నుండి దేశం కోసం ఏదైనా చేయాలనే ఆరాటం తో ఇండియాకి వస్తాడు శివాజీ. ప్రజల కోసం ఉచిత విద్య, వైద్యం అందించాలనే ఉద్దేశం తో ట్రస్ట్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ శివాజే ఇలా చేయడం వల్ల తన వ్యాపారాలు దెబ్బ తింటాయని భావించిన కొందరు శివాజీని అడ్డుకుంటారు. అప్పుడు శివాజీ వారిని ఎలా ఎదుర్కుంటాడు…? తాను అనుకున్న విధంగా సమాజానికి సేవ చేయగలిగాడా..? లేదా..? అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

==========================

తడాఖా నటీనటులు : నాగచైతన్య, సునీల్, తమన్నా, ఆండ్రియా జెరెమియా ఇతర నటీనటులు : ఆశుతోష్ రానా, నాగేంద్ర బాబు, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రఘుబాబు, రమాప్రభ మరితు తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : S. తమన్ డైరెక్టర్ : కిషోర్ కుమార్ పార్ధసాని ప్రొడ్యూసర్ : బెల్లంకొండ సురేష్ రిలీజ్ డేట్ : 10th మే 2013 నాగచైతన్య, సునీల్ అన్నాదమ్ములుగా నటించిన ఇమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ తడాఖా. తండ్రి చనిపోగానే వచ్చిన పోలీసాఫీసర్ ఉద్యోగంలో ఇమడలేని అన్నకు తమ్ముడు ఎలాచేదోడు వాదోడుగా నిలిచాడు, కథ చివరికి ఏ మలుపు తిరిగిందనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.