ZeeCinemalu (4th February)

Wednesday,March 03,2021 - 10:00 by Z_CLU

kukkalunnayi-jagratta-zee-cinemalu-569x320

కుక్కలున్నాయి జాగ్రత్త

నటీనటులు : సిబిరాజ్, అరుంధతి ఇతర నటీనటులు : ఇదో, బాలాజీ వేణుగోపాల్, మనోబాల, మయిల్ సామి, ప్రింజ్ నితిక్ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : ధరన్ కుమార్ డైరెక్టర్ : శక్తి సౌందర్ రాజన్ ప్రొడ్యూసర్ : సత్యరాజ్, మహేశ్వరి సత్యరాజ్ రిలీజ్ డేట్ : 21 నవంబర్ 2014

సిబిరాజ్, అరుంధతి జంటగా నటించిన ఇమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ ‘కుక్కలున్నాయి జాగ్రత్త’. మోస్ట్ ఇంటెన్సివ్ యాక్షన్ థ్రిల్లర్ లో కుక్క కీ రోల్ ప్లే చేసింది. ఒక అమ్మాయి కిడ్నాప్ కేసును ఇన్వెస్టిగేట్ చేసే ప్రాసెస్ లో తన ఫ్రెండ్ ని కోల్పోతాడు పోలీసాఫీసర్ కార్తీక్. ఆ కిడ్నాపర్లను అంతం చేసే ప్రాసెస్ లో ఉన్న కార్తీక్ కి అనుకోకుండా మిలిటరీ ట్రైన్డ్ కుక్క స్నేహం ఏర్పడుతుంది. ఆ కుక్క పోలీసాఫీసర్ కార్తీక్ కి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో ఎలా సహాయపడింది..? అనేదే ఈ సినిమాలో మోస్ట్ థ్రిల్లింగ్ ఎలిమెంట్.

___________________________________________

రెడీ

నటీనటులు : రామ్జెనీలియా ఇతర నటీనటులు : బ్రహ్మానందంనాజర్చంద్రమోహన్తనికెళ్ళ భరణికోట శ్రీనివాస రావు,జయప్రకాష్ రెడ్డిసుప్రీత్షఫీ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్ డైరెక్టర్ : శ్రీను వైట్ల ప్రొడ్యూసర్ : స్రవంతి రవి కిషోర్ రిలీజ్ డేట్ : 19 జూన్ 2008

రామ్ జెనీలియా నటించిన హిలేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ రెడీ. శ్రీను వైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాని స్రవంతి రవి కిషోర్ నిర్మించారు. కామెడీ తో పాటు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకి హైలెట్ గా నిలిచాయి.

__________________________________________

ఫస్ట్ ర్యాంక్ రాజు 

నటీనటులు: చేత‌న్‌ మ‌ద్దినేని, కాశిష్‌ వోరా, వి.కె.న‌రేష్, ప్ర‌కాష్‌రాజ్‌, బ్ర‌హ్మానంద‌ం‌, రావుర‌మేష్‌, పోసానికృష్ణ‌ముర‌ళి, త‌నికెళ్ళ‌భ‌ర‌ణి, వెన్నెల కిషోర్‌, ప్ర‌య‌ద‌ర్శి తదితరులు.

మ్యూజిక్ః కిర‌ణ్‌ ర‌వీంద్ర‌నాధ్

ప్రొడ్యూస‌ర్ః మంజునాధ్ వి కందుకూర్

డైరెక్ట‌ర్ః న‌రేష్‌ కుమార్‌

రిలీజ్ డేట్ : జూన్ 21, 2019

____________________________________

గోరింటాకు

నటీ నటులు : రాజ శేఖర్, ఆర్తి అగర్వాల్ , మీరా జాస్మీన్ ఇతర నటీ నటులు : ఆకాష్, హేమ చౌదరి,సుజిత, శివ రాజా, మాస్టర్ నిధీశ్ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : ఎస్.ఎ.రాజ్ కుమార్ డైరెక్టర్ : వి.ఆర్.ప్రతాప్ ప్రొడ్యూసర్ : ఎం.వి.ప్రసాద్, పారస్ జైన్ రిలీజ్ డేట్ : జులై 4 , 2008

అన్న-చెల్లెళ్ళ బంధం కధాంశం తో రాజ శేఖర్, ఆర్తి అగర్వాల్, మీరా జాస్మీన్ నటించిన ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమ లో ఎవర్ గ్రీన్ ఫామిలీ ఎంటర్టైనర్ గా నిలిచిపోయింది. ముఖ్యంగా ఈ సినిమాలో రాజ శేఖర్-మీరా జాస్మీన్ ల మధ్య వచ్చే సన్నివేశాలు, అన్న-చెల్లెళ్ళ బంధం గురించి తెలియజేసే సీన్స్ సినిమాకు హైలైట్స్. ఎస్.ఎ.రాజ్ కుమార్ అందించిన పాటలు, ఆర్.ఆర్. సినిమాకు ప్లస్.

______________________________________

DJ – దువ్వాడ జగన్నాథం

నటీనటులు : అల్లు అర్జున్పూజా హెగ్డే

ఇతర నటీనటులు : చంద్ర మోహన్రావు రమేష్మురళి శర్మసుబ్బరాజుపోసాని కృష్ణ మురళితనికెళ్ళ భరణివెన్నెల కిషోర్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : హరీష్ శంకర్

ప్రొడ్యూసర్ : దిల్ రాజు

రిలీజ్ డేట్ : 23 జూన్ 2017

విజయవాడలో సత్యనారాయణపురం అగ్రహారం అనే ఊళ్ళో బ్రాహ్మణ కుర్రాడిగా కుటుంబంతో కలిసి పెళ్లిళ్లకు వంటచేసే దువ్వాడ జగన్నాథం(అల్లు అర్జున్) చిన్నతనంలో తనకు ఎదురైన కొన్ని సంఘటనల వల్ల సమాజంలో అన్యాయాలు జరగకుండా ఓ మార్పు తీసుకురావాలనుకుంటాడు. ఇందుకోసం ఓ పోలీస్ అధికారి పురుషోత్తం(మురళి శర్మ) సహాయం అందుకున్న దువ్వాడ సమాజంలో ప్రజలకి అన్యాయం చేసే వారిని ఎలా ఏ విధంగా ఎదుర్కున్నాడు.. చివరికి పెద్ద రియల్టర్ గా పేరొంది ప్రజల నుంచి డబ్బు దండుకున్న రొయ్యల నాయుడును ఏ విధంగా ఎదిరించి అంతమొందిచాడు.. అనేది సినిమా కథాంశం.

_______________________________________________

కాంచన 3

న‌టీన‌టులు : రాఘ‌వ లారెన్స్‌, ఓవియా, వేదిక‌, నిక్కి తంబోలి, కొవైస‌ర‌ళ‌, క‌భీర్ దుహ‌న్ సింగ్‌, శ్రీమ‌న్‌, దేవ‌ద‌ర్శిని, కిషోర్ త‌దిత‌రులు సినిమాటోగ్ర‌ఫి : వెట్రి, స‌ర్వేష్ మురారి మ్యూజిక్ : తమన్ క‌థ‌-స్క్రీన్‌ప్లే-ద‌ర్శ‌కత్వం: రాఘ‌వ లారెన్స్‌ నిడివి : 161 నిమిషాలు విడుదల తేది : 19 ఏప్రిల్ 2019

దెయ్యం అనే సౌండ్ వింటేనే భయపడే రాఘవ (రాఘవ లారెన్స్) తన కుటుంబంతో కలిసి తాతయ్య షష్టి పూర్తి కోసమని వరంగల్ వెళ్తాడు. అలా తాత ఊరెళ్ళిన రాఘవను తన మావయ్యల కూతుర్లు కావ్య (ఒవియా),ప్రియ (వేదిక),ప్రియా చెల్లి(నిక్కి తంబోలి) ప్రేమలో పడేసి, పెళ్లి చేసుకొనే ప్రయత్నం చేస్తుంటారు. ఆ ముగ్గురిలో తనను బాగా ఆకర్షించిన మరదలిని మాత్రమే పెళ్లి చేసుకుంటానని కండీషన్ పెడతాడు రాఘవ. అయితే అనుకోకుండా ఆ ఇంట్లోకి రెండు ఆత్మలు ప్రవేశిస్తాయి. ఇంట్లో వాళ్ళని భయపెడుతూ పగతో రగిలిపోతుండే ఆ ఆత్మలను ఇంటి నుండి బయటకి పంపించే ప్రయత్నం చేస్తుంటారు రాఘవ తల్లి(కోవై సరళ), అన్నయ్య(శ్రీమాన్) వదిన(దేవ‌ద‌ర్శిని). అయితే ఓ సందర్భంలో రాఘవ లోకి ఆత్మ ప్రవేశిస్తుంది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు రాఘవలోకి కాళి అనే ఆత్మ ప్రవేశించిందని తెలుసుకుంటారు. ఇంతకీ కాళి ఎవరు..? కాళి తో పాటు ఉండే మరో ఆత్మ ఎవరిది..? రాఘవ ద్వారా కాళి తన పగను ఎలా తీర్చుకున్నాడు.. అనేది మిగతా కథ.