ZeeCinemalu -2nd February

Monday,February 01,2021 - 10:00 by Z_CLU

జయసూర్య

నటీనటులు : విశాల్, కాజల్ అగర్వాల్ ఇతర నటీనటులు : సముథిరఖని, సూరి, DMJ రాజసింహన్, ఐశ్వర్య దత్త తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : D. ఇమ్మన్ డైరెక్టర్ : సుసీంథిరణ్ ప్రొడ్యూసర్ : S. మదన్ రిలీజ్ డేట్ : 4 సెప్టెంబర్ 2015

విశాల్, కాజల్ జంటగా నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జయసూర్య. సిటీలో కిడ్నాప్ లు చేసి భయ భ్రాంతులకు గురి చేసే క్రిమినల్స్ కి మధ్య జరిగే క్రైం థ్రిల్లర్ ఈ సినిమా. ACP జయసూర్యగా విశాల్ నటన సినిమాకే హైలెట్.

__________________________________________________

అదిరిందయ్యా చంద్రం

హీరో  హీరోయిన్లు – శివాజీ, లయ

ఇతర నటీనటులు – సంగీత, మధుశర్మ, బ్రహ్మానందం, అలీ, వేణుమాధవ్, ఏవీఎస్

సంగీతం – ఎం.ఎం.శ్రీలేఖ

స్క్రీన్ ప్లే, దర్శకత్వం – శ్రీనివాసరెడ్డి

విడుదల తేదీ – 2005, ఆగస్ట్ 20

బ్యానర్ – ఎస్పీ క్రియేషన్స్

శివాజీ, లయ కలిసి నటించిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అదిరిందయ్యా చంద్రం.  శివాజీ కెరీర్ లో సూపర్ హిట్ సినిమాల్లో ఒకటిగా ఇది నిలిచిపోతుంది. శివాజీలో అదిరిపోయే కామెడీ టైమింగ్ ఉందని మరోసారి నిరూపించింది ఈ సినిమా.

____________________________________________

కోమాలి

రిలీజ్ డేట్ – 4 డిసెంబర్, 2020 నటీనటులు – జయం రవి, కాజల్ అగర్వాల్, యోగిబాబు దర్శకుడు : ప్రదీప్ రంగనాథ్ సంగీత దర్శకుడు : హిప్ హాప్ తమిళ సినిమాటోగ్రాఫర్ : రిచర్డ్ ఎం.నాథన్ నిర్మాత : ఐసరి కె.గణేష్ బ్యానర్ : అపోలో ప్రొడక్షన్స్

జయంరవి, కాజల్ హీరోహీరోయిన్లుగా నటించిన సూపర్ హిట్ మూవీ కోమాలి. 1999 డిసెంబర్ 31న యాక్సిడెంట్ కారణంగా కోమాలోకి వెళ్లిన రవి (జయం రవి) సరిగ్గా 16 ఏళ్ల తర్వాత కోమా నుంచి బయటకొస్తాడు. అప్పటికే ప్రపంచం మొత్తం మారిపోతుంది. ఈ సరికొత్త ప్రపంచంలో అతడు ఎలా నిలదొక్కుకున్నాడు? లోకల్ ఎమ్మెల్యే (కె.ఎస్.రవికుమార్) కారణంగా ఎదుర్కొన్న సమస్యలను ఎలా అధిగమించాడు అనేది క్లుప్తంగా “కోమాలి” కథాంశం. ఈ క్రమంలో రవికి కాజల్ ఎలా సహాయం చేసిందనేది స్టోరీ.

ఇందులో ‘జయం’ రవి, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించగా.. సంయుక్తా హెగ్డే కీలక పాత్రలో కనిపించింది. ఇక కమెడియన్ యోగిబాబు, హీరో జయం రవి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తాయి. ఎమ్మెల్యేగా దర్శకుడు కె.ఎస్. రవికుమార్ విలన్ పాత్రలో కనిపిస్తారు. ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ‘హిప్ హాప్’ తమిజ్ సంగీతం అందించారు.

__________________________________________

భలే దొంగలు

నటీనటులు – తరుణ్ఇలియానా

ఇతర నటీనటులు – జగపతి బాబుధర్మవరపు సుబ్రహ్మణ్యంప్రదీప్ రావత్బ్రహ్మానందంసునీల్ఎం.ఎస్.నారాయణ  తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ – కె.ఎం.రాధా కృష్ణన్

నిర్మాత – శాఖమూరి పాండు రంగారావు బెల్లం కొండ సురేష్

దర్శకత్వం –  విజయ్ భాస్కర్

విడుదల తేదీ – 11  ఏప్రిల్  2008

తరుణ్-ఇలియానా లతో దర్శకుడు విజయ్ భాస్కర్ తెరకెక్కించిన లవ్ & కామెడీ ఎంటర్టైనర్ సినిమా భలే దొంగలు’. జగపతి బాబు ముఖ్య పాత్ర పోషించిన ఈ సినిమాలో తరుణ్-ఇలియానా మధ్య వచ్చే సీన్స్ధర్మవరపుసునీల్బ్రహ్మానందం కామెడీరాధా కృష్ణన్ మ్యూజిక్ హైలైట్స్.

____________________________________________

బ్రదర్స్

నటీనటులు : సూర్య శివకుమార్, కాజల్ అగర్వాల్ ఇతర నటీనటులు : ఇషా శర్వాణి, వివేక్, సచిన్ ఖేడ్కర్, తార మ్యూజిక్ డైరెక్టర్ : హారిస్ జయరాజ్ డైరెక్టర్ : K.V.ఆనంద్ ప్రొడ్యూసర్ : బెల్లంకొండ సురేష్ రిలీజ్ డేట్ : 2012

సూర్య, కాజల్ అగర్వాల్ నటించిన బ్రదర్ సైన్స్ ఫిక్షన్ ఎంటర్ టైనర్. K.V. ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూర్య కరియర్ లోనే హైలెట్ గా నిలిచింది. అతుక్కుని ఉండే కవలలుగా సూర్య నటించిన తీరు అద్భుతమనిపిస్తుంది.

_________________________________________ Bangaru_Thalli-fpc-బంగారు_తల్లి-మూవీ-zeecinemalu-600x338

బంగారుతల్లి

నటీనటులు : జ్యోతిక, భాగ్యరాజ్, పార్తీబన్ తదితరులు దర్శకత్వం : జె జె ఫ్రెడ్రిక్ నిర్మాత‌లు : సూర్య సంగీతం : గోవింద్ వసంత సినిమాటోగ్రఫర్ : రాంజీ ఎడిటర్: రూబెన్

ఊటీలో జ్యోతి అనే మ‌హిళ‌.. కొంత‌మంది చిన్న‌పిల్ల‌ల్ని దారుణంగా చంపేస్తుంది. అడ్డొచ్చిన ఇద్ద‌రు యువ‌కుల్ని నాటు తుపాకీతో కాల్చి చంపేస్తుంది. ఆ మ‌హిళ‌ని పోలీసులు ఎన్‌కౌంట‌ర్ చేస్తారు. ఇది జరిగిన 15 ఏళ్ల తర్వాత ఈ కేసుని వెన్నెల (జ్యోతిక‌) అనే లాయ‌రు తిరిగి ఓపెన్ చేస్తుంది. అసలు నిజాల్ని బ‌య‌ట‌కు తీసే ప్ర‌య‌త్నం చేస్తుంది.

ఈ పోరాటంలో పెద్ద మ‌నిషిగా చ‌లామ‌ణీ అవుతున్న వ‌ర‌ద‌రాజులు (త్యాగ‌రాజ‌న్‌), తిమ్మిని బ‌మ్మిగా చేసే ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ రాజార‌త్నం (పార్తీబ‌న్‌)ని ఎదుర్కోవాల్సివ‌స్తుంది వెన్నెల‌. అస‌లు సైకో జ్యోతి ఎవ‌రు? ఆమె నిజంగా పిల్లల్ని చంపేసిందా? ఆమెకీ వెన్నెల‌కూ ఉన్న లింక్ ఏంటనేది బ్యాలెన్స్ కథ.