ZeeCinemalu-2nd December

Tuesday,December 01,2020 - 10:06 by Z_CLU

Mr.నూకయ్య

నటీ నటులు : మంచు మనోజ్కృతి కర్బందాసనా ఖాన్

ఇతర నటీనటులు :రాజా,  బ్రహ్మానందంమురళి శర్మ ,రఘు బాబుపరుచూరి వెంకటేశ్వరావు ,వెన్నెల కిషోర్ఆహుతి ప్రసాద్ తదితరులు 

మ్యూజిక్ డైరెక్టర్ : యువ శంకర్ రాజా

డైరెక్టర్ : అనిల్ కన్నెగంటి

నిర్మాత : డి.ఎస్.రావు

రిలీజ్ డేట్ : 8  మార్చ్ 2012

 మంచు మనోజ్ సరి కొత్త ఎనర్జీ తో ఆవిష్కరించిన సినిమా మిస్టర్ నూకయ్య‘. అనిల్ డైరెక్షన్ లో తెరకెక్క్కిన ఈ సినిమా లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందింది. ముఖ్యంగా  యువన్ శంకర్ రాజా అందించిన పాటలు ఈ సినిమాకు హైలైట్. ఈ సినిమాలో లవ్ సీన్స్కామెడీపాటలుక్లైమాక్స్ లో ట్విస్ట్ అందరినీ ఆకట్టుకుంటాయి.

_______________________________________

దేవత

హీరోహీరోయిన్లు – శోభన్ బాబు, శ్రీదేవి ఇతర నటీనటులు – జయప్రద, మోహన్ బాబు, రావుగోపాల్రావు సంగీతం – చక్రవర్తి దర్శకత్వం – కె.రాఘవేంద్రరావు విడుదల తేదీ – 1982, సెప్టెంబర్ 4

దేవత పేరుచెప్పగానే బిందెలు గుర్తొస్తాయిచీరలతో చేసిన డెకరేషన్ గుర్తొస్తుంది వెంటనే  సూపర్ హిట్ సాంగ్ గుర్తొస్తుందిఅదే వెల్లువొచ్చి గోదారమ్మ .

________________________________________

ఇది మా ప్రేమకథ

నటీనటులు : రవి, మేఘనా లోకేష్ ఇతర నటీనటులు : ప్రభాస్ శ్రీను, ప్రియదర్శి, తులసి శివమణి తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : కార్తీక్ కొడకండ్ల డైరెక్టర్ : అయోధ్య కార్తీక్ ప్రొడ్యూసర్ : P.L. K. రెడ్డి రిలీజ్ డేట్ : డిసెంబర్ 15, 2017

రవి, మేఘన లోకేష్ జంటగా నటించిన ఇమోషనల్ లవ్ ఎంటర్ టైనర్ ‘ఇది మా ప్రేమకథ’. అప్పటివరకు టెలివిజన్ షోస్ లో ఎంటర్టైన్ చేసిన రవి ఏ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. హీరోయిన్ మేఘా లోకేష్ కి కూడా ఇది డెబ్యూ మూవీ కావడం విశేషం.

ఇక సినిమా విషయానికి వస్తే అరుణ్ (రవి) సంధ్యను చూసి చూడగానే ప్రేమలో పడతాడు. కొన్నాళ్ళకు సంధ్య కూడా రవికి దగ్గరవుతుంది. ఈ లవ్ స్టోరీ సరిగ్గా ట్రాక్ లో పడే మూమెంట్ లో ప్రియ అనే అమ్మాయి రావడం, దానికి మరికొన్ని ఇన్సిడెంట్స్ జతై అరుణ్, సంధ్య విడిపోతారు. అసలు అంతగా ప్రేమించుకున్న జంట విడిపోవడానికి కారణమేంటి..? వీళ్ళిద్దరినీ మళ్ళీ ఒకటి చేసిన సందర్భమేమిటన్నది జీ సినిమాలు చూడాల్సిందే.

_________________________________________

లింగ

నటీనటులు : రజినీకాంత్అనుష్క శెట్టిసోనాక్షి సిన్హా

ఇతర నటీనటులు : జగపతి బాబు, K. విశ్వనాథ్, N. సంతానంకరుణాకరన్దేవ్ గిల్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : A.R. రెహ్మాన్

డైరెక్టర్ : K.S. రవి కుమార్

ప్రొడ్యూసర్ : రాక్ లైన్ వెంకటేష్

రిలీజ్ డేట్ : 12 డిసెంబర్ 2014

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన డైరెక్ట్ సినిమా ‘లింగ’. రెండు డిఫరెంట్ బ్యాక్ డ్రాప్స్ ఓ ఉండే ఈ సినిమాలో రజినీకాంత్ డ్యూయల్ రోల్ ప్లే చేశాడు.  అనుష్కసోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు.

_____________________________________

ఎక్కడికి పోతావు చిన్నవాడా

నటీనటులు : నిఖిల్ సిద్ధార్థ, హేబా పటేల్, అవిక గోర్

ఇతర నటీనటులు : నందితా శ్వేత, వెన్నెల కిషోర్, అన్నపూర్ణ, సత్య, సుదర్శన్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర

డైరెక్టర్ : వి. ఐ. ఆనంద్

ప్రొడ్యూసర్ : P.V. రావు

రిలీజ్ డేట్ : 18 నవంబర్ 2016

ఒక అమ్మాయిని ప్రేమించి మోసపోయిన అర్జున్(నిఖిల్) తన స్నేహితుడి అన్నయ్య కు దెయ్యం వదిలించడానికి అనుకోకుండా ఆత్మలను వదిలించే కేరళ లోని మహిశాసుర మర్దిని గుడికి వెళ్లాల్సి వస్తుంది. అలా కిషోర్(వెన్నెల కిషోర్) తో కేరళ వెళ్లిన అర్జున్ కి అమల(హెబ్బా పటేల్) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. అలా పరిచయమైన అమల తన యాటిట్యూడ్ తో అర్జున్ కు దగ్గరవుతుంది. ఇంతకీ అమల అక్కడికి ఎందుకొచ్చింది? అర్జున్ కి కావాలనే ఎందుకు దగ్గరైంది? అసలు అమల ఎవరు? కేరళ వెళ్లిన అర్జున్ హైదరాబాద్ తిరిగొచ్చాక అమల గురించి ఏం తెలుసుకున్నాడు? అనేది చిత్ర కధాంశం.