ZeeCinemalu (20th February)

Friday,March 19,2021 - 10:03 by Z_CLU

36 వయసులో

నటీనటులు: జ్యోతిక, రెహమాన్ తదితరులు దర్శకత్వం: రోషన్ ఆండ్రూస్ సంగీతం: సంతోష్ నారాయణ్ సినిమాటోగ్రఫీ: ఆర్.దివాకరన్ నిర్మాత: సూర్య బ్యానర్: 2డి ఎంటర్ టైన్మెంట్ రిలీజ్ డేట్: 24 జులై, 2020

వాసంతి (జ్యోతిక) రెవెన్యూ కార్యాలయంలో అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌. భర్త రాంప్రసాద్‌ (రహమాన్‌), 13 ఏళ్ల కూతురు మృదుల సంతోషమే తన సంతోషంగా కాలం వెల్లదీస్తుంది. ఐర్లాండ్‌లో ఉద్యోగం చేయాలన్న భర్త ఆశలు, అక్కడే చదవాలన్న కూతురు కలల్ని నెరవేర్చేందుకు తానూ ప్రయత్నిస్తుంది. ఐర్లాండ్‌లో కుటుంబం మనుగడ సాధించాలంటే భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తే తప్ప సాధ్యం కాదు. అయితే 36 ఏళ్ల వాసంతికి ఉద్యోగం రాదు. వరుస ఘటనలతో కుంగిపోయిన వాసంతి.. ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఎలా సక్సెస్‌ సాధించింది అన్నదే 36-వయసులో సినిమా కథ.

_____________________________________

బ్రదర్ అఫ్ బొమ్మాలి

నటీనటులు : అల్లరి నరేష్, కార్తీక, మోనాల్ గజ్జర్

ఇతర నటీనటులు : హర్ష వర్ధన్ రాణే, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర

డైరెక్టర్ : చిన్ని కృష్ణ

ప్రొడ్యూసర్ : అమ్మి రాజు కనిమిల్లి

రిలీజ్ డేట్ : నవంబర్ 7 , 2014

కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా , కార్తీక, మోనాల్ గజ్జర్ ఇతర పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘బ్రదర్ అఫ్ బొమ్మాలి’. ఈ సినిమా లో అల్లరిగా నరేష్ అక్కగా కార్తీక యాక్టింగ్ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. కోన వెంకట్ గా బ్రహ్మానందం కామెడీ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. అల్లరి నరేష్ ఎనర్జీ తో కూడిన ఫన్నీ పెరఫార్మెన్స్, శేఖర్ చంద్ర మ్యూజిక్, కామెడీ సీన్స్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్స్. ________________________________

బ్రూస్ లీ

నటీనటులు : రామ్ చరణ్రకుల్ ప్రీత్ సింగ్

ఇతర నటీనటులు : అరుణ్ విజయ్కృతి కర్బందానదియాసంపత్ రాజ్బ్రహ్మానందంఆలీ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్

డైరెక్టర్ : శ్రీను వైట్ల

ప్రొడ్యూసర్ : D.V.V. దానయ్య

రిలీజ్ డేట్ : 16 అక్టోబర్ 2015

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కరియర్ లోనే డిఫెరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ బ్రూస్ లీ. తన అక్క చదువు కోసం స్టంట్ మ్యాన్ గా మారిన యువకుడి క్యారెక్టర్ లో చెర్రీ పర్ఫామెన్స్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. మెగాస్టార్ క్యామియో సినిమాకి మరో హైలెట్.

____________________________________________________

శతమానంభవతి

నటీనటులు : శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, జయసుధ, నరేష్, ఇంద్రజ, రాజా రవీంద్ర, హిమజ, ప్రవీణ్ మరియు తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ. జే. మేయర్ డైరెక్టర్ : సతీష్ వేగేశ్న ప్రొడ్యూసర్ : దిల్ రాజు రిలీజ్ డేట్ : 14 జనవరి 2017

ఆత్రేయ పురం అనే గ్రామంలో రాఘవ రాజు(ప్రకాష్ రాజ్) జానకమ్మ(జయసుధ) అనే దంపతులు తమ పిల్లలు విదేశాల్లో స్థిరపడి తమను చూడడానికి రాకపోవడంతో కలత చెంది తన మనవడు రాజు (శర్వానంద్) తో కలిసి సొంత ఊరిలోనే జీవిస్తుంటారు. ఈ క్రమంలో పిల్లల్ని ఎలాగైనా సంక్రాంతికి తమ ఊరికి రప్పించాలని రాజు గారిని కోరుతుంది జానకమ్మ. తన భార్య కోరిక మేరకూ ఎప్పుడు కబురుపెట్టినా రాని పిల్లల కోసం ఒక పథకం వేసి సంక్రాంతికి ఊరు రప్పిస్తాడు రాఘవ రాజు. ఇంతకీ రాజు గారు వేసిన ఆ పథకం ఏమిటి? రాజు గారి కబురు మేరకు స్వదేశం తిరిగొచ్చిన పిల్లలు తాము దూరంగా ఉండడం వల్ల తల్లిదండ్రుల పడుతున్న భాధ ఎలా తెలుసుకున్నారు? అనేది ఈ సినిమా కథాంశం.

_____________________________________________

కాంచన 3

న‌టీన‌టులు : రాఘ‌వ లారెన్స్‌, ఓవియా, వేదిక‌, నిక్కి తంబోలి, కొవైస‌ర‌ళ‌, క‌భీర్ దుహ‌న్ సింగ్‌, శ్రీమ‌న్‌, దేవ‌ద‌ర్శిని, కిషోర్ త‌దిత‌రులు సినిమాటోగ్ర‌ఫి : వెట్రి, స‌ర్వేష్ మురారి మ్యూజిక్ : తమన్ క‌థ‌-స్క్రీన్‌ప్లే-ద‌ర్శ‌కత్వం: రాఘ‌వ లారెన్స్‌ నిడివి : 161 నిమిషాలు విడుదల తేది : 19 ఏప్రిల్ 2019

దెయ్యం అనే సౌండ్ వింటేనే భయపడే రాఘవ (రాఘవ లారెన్స్) తన కుటుంబంతో కలిసి తాతయ్య షష్టి పూర్తి కోసమని వరంగల్ వెళ్తాడు. అలా తాత ఊరెళ్ళిన రాఘవను తన మావయ్యల కూతుర్లు కావ్య (ఒవియా),ప్రియ (వేదిక),ప్రియా చెల్లి(నిక్కి తంబోలి) ప్రేమలో పడేసి, పెళ్లి చేసుకొనే ప్రయత్నం చేస్తుంటారు. ఆ ముగ్గురిలో తనను బాగా ఆకర్షించిన మరదలిని మాత్రమే పెళ్లి చేసుకుంటానని కండీషన్ పెడతాడు రాఘవ. అయితే అనుకోకుండా ఆ ఇంట్లోకి రెండు ఆత్మలు ప్రవేశిస్తాయి. ఇంట్లో వాళ్ళని భయపెడుతూ పగతో రగిలిపోతుండే ఆ ఆత్మలను ఇంటి నుండి బయటకి పంపించే ప్రయత్నం చేస్తుంటారు రాఘవ తల్లి(కోవై సరళ), అన్నయ్య(శ్రీమాన్) వదిన(దేవ‌ద‌ర్శిని). అయితే ఓ సందర్భంలో రాఘవ లోకి ఆత్మ ప్రవేశిస్తుంది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు రాఘవలోకి కాళి అనే ఆత్మ ప్రవేశించిందని తెలుసుకుంటారు. ఇంతకీ కాళి ఎవరు..? కాళి తో పాటు ఉండే మరో ఆత్మ ఎవరిది..? రాఘవ ద్వారా కాళి తన పగను ఎలా తీర్చుకున్నాడు.. అనేది మిగతా కథ.

____________________________________

ఫోరెన్సిక్

నటీనటులు : తొవినో థామస్ , మమత మోహన్ దాస్ ,సిజ్జు, రేంజి , రెబా మోనికా ,రోనీ డేవిడ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : జేక్స్ బిజోయ్

డైరెక్టర్ : అఖిల్ పౌల్

ప్రొడ్యూసర్ : నేవిక్స్ , సిజు

రిలీజ్ డేట్ : 28 ఫిబ్రవరి 2020

'ఫోరెన్సిక్' క్రైం మిస్టరీ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన సినిమా. సైకో థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారిని సినిమా బాగా ఆకట్టుకుంటుంది. కథ -కథనంతో పాటు నేపథ్య సంగీతం మమత మోహన్ దాస్ , థామస్ పెర్ఫార్మెన్స్ సినిమాకు హైలైట్.