ZeeCinemalu

Thursday,October 22,2020 - 10:55 by Z_CLU

కుక్కలున్నాయి జాగ్రత్త నటీనటులు : సిబిరాజ్, అరుంధతి ఇతర నటీనటులు : ఇదో, బాలాజీ వేణుగోపాల్, మనోబాల, మయిల్ సామి, ప్రింజ్ నితిక్ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : ధరన్ కుమార్ డైరెక్టర్ : శక్తి సౌందర్ రాజన్ ప్రొడ్యూసర్ : సత్యరాజ్, మహేశ్వరి సత్యరాజ్ రిలీజ్ డేట్ : 21 నవంబర్ 2014 సిబిరాజ్, అరుంధతి జంటగా నటించిన ఇమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ ‘కుక్కలున్నాయి జాగ్రత్త’. మోస్ట్ ఇంటెన్సివ్ యాక్షన్ థ్రిల్లర్ లో కుక్క కీ రోల్ ప్లే చేసింది. ఒక అమ్మాయి కిడ్నాప్ కేసును ఇన్వెస్టిగేట్ చేసే ప్రాసెస్ లో తన ఫ్రెండ్ ని కోల్పోతాడు పోలీసాఫీసర్ కార్తీక్. ఆ కిడ్నాపర్లను అంతం చేసే ప్రాసెస్ లో ఉన్న కార్తీక్ కి అనుకోకుండా మిలిటరీ ట్రైన్డ్ కుక్క స్నేహం ఏర్పడుతుంది. ఆ కుక్క పోలీసాఫీసర్ కార్తీక్ కి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో ఎలా సహాయపడింది..? అనేదే ఈ సినిమాలో మోస్ట్ థ్రిల్లింగ్ ఎలిమెంట్.

=======================

స్పైడర్ నటీనటులు : మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్ ఇతర నటీనటులు : S.J. సూర్య, భరత్, RJ బాలాజీ, ప్రియదర్శి, జయప్రకాష్, సాయాజీ షిండే మ్యూజిక్ డైరెక్టర్ : హారిస్ జయరాజ్ డైరెక్టర్ : A.R. మురుగదాస్ ప్రొడ్యూసర్ : N.V. కుమార్, ఠాగూర్ మధు రిలీజ్ డేట్ : 27 సెప్టెంబర్ 2017 ఇంటలిజెన్స్ బ్యూరో లో పనిచేసే శివ(మహేష్ బాబు) అందరి కాల్స్ ట్రాప్ చేస్తూ తను రెడీ చేసుకున్న ఓ సాఫ్ట్ వేర్ ద్వారా సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికెళ్లి ఎలాంటి తప్పు జరగకుండా అడ్డుపడుతుంటాడు.. అలా సాటి మనిషికి ఎటువంటి బాధ కలగకూడదనే వ్యక్తిత్వంతో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా జీవితాన్నిగడిపే శివ, ట్రాప్ ద్వారా ఓ కాల్ వింటాడు. అనుకోకుండా విన్న ఆ కాల్ శివ జీవితంలో ఓ పెద్ద మార్పు తీసుకొస్తుంది.. ఆ ఫోన్ కాల్ విన్న మరసటి రోజే శివ జీవితంలోకి వస్తాడు భైరవుడు… ఇంతకీ భైరవుడు ఎవరు ? అసలు శివకి భైరవుడికి మధ్య ఏం జరిగింది ? చివరికి శివ భైరవుడిని ఎలా అంతమొందించి ప్రజల్ని కాపాడాడనేది సినిమా కథాంశం.

============================

బ్రూస్ లీ నటీనటులు : రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ ఇతర నటీనటులు : అరుణ్ విజయ్, కృతి కర్బందా, నదియా, సంపత్ రాజ్, బ్రహ్మానందం, ఆలీ మరియు తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్ డైరెక్టర్ : శ్రీను వైట్ల ప్రొడ్యూసర్ : D.V.V. దానయ్య రిలీజ్ డేట్ : 16 అక్టోబర్ 2015 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కరియర్ లోనే డిఫెరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ బ్రూస్ లీ. తన అక్క చదువు కోసం స్టంట్ మ్యాన్ గా మారిన యువకుడి క్యారెక్టర్ లో చెర్రీ పర్ఫామెన్స్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. మెగాస్టార్ క్యామియో సినిమాకి మరో హైలెట్.

===========================

క్రైమ్ 23 నటీనటులు - అరుణ్ విజయ్, మహిమా నంబియార్, వంశీ కృష్ణ, తంబీ రామయ్య దర్శకుడు - అరవగన్ వెంకటాచలం బ్యానర్ - శ్రీ విజయ నరసింహా ఫిలిమ్స్ నిర్మాత - ప్రసాద్ ధర్మిరెడ్డి సంగీతం - విశాల్ చంద్రశేఖరన్ రిలీజ్ డేట్ - ఆగస్ట్ 31, 2018 కంప్లీట్ సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ ఫీల్ కావాలంటే CRIME 23 మూవీ చూడాల్సిందే. చర్చి ఫాదర్, ప్రెగ్నెంట్ జెస్సిక అనుమానాస్పద హత్యలతోనే ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి సిటీ అసిస్టెంట్ కమిషనర్ అయినా అరుణ్ విజయ్ రంగంలోకి దిగుతాడు. ఇన్వెస్టిగేట్ చేస్తున్న క్రమంలో ఈ హత్యలు మెడికల్ మాఫియా తో సంభంధం ఉందని తెలుసుకుంటాడు విజయ్. అసలు ఈ మెడికల్ మాఫియా ఎవరిది? ఎందుకుప్రెగ్నెంట్ లేడీస్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు? ఇలా ఎన్నో మలుపులు, ఇంకెంతో ఉత్కంఠ మధ్య సాగుతుంది క్రైమ్ 23 మూవీ.

=============================

ముత్తు నటీనటులు : రజినీకాంత్, మీనా ఇతర నటీనటులు : రఘువరన్, శరత్ బాబు, జయ భారతి, వడివేలు, కాంతిమతి, రాధా రవి మరియు తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : A.R. రెహమాన్ డైరెక్టర్ : K.S. రవికుమార్ ప్రొడ్యూసర్ : రాజం బాలచందర్ రిలీజ్ డేట్ : 23 అక్టోబర్ 1995 సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ముత్తు సెన్సేషనల్ హిట్ అయింది. రాకుమారుడైన ముత్తు, అతని కుటుంబ సభ్యులు చేసిన కుట్ర వల్ల పనివాడిలా పెరుగుతాడు. పెరిగి పెద్దవాడైన ముత్తు తన అధికారాన్ని ఎలా సాధించుకున్నాడు. అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.