ZeeCinemalu-10thDecember

Wednesday,December 09,2020 - 10:00 by Z_CLU

మాతంగి

నటీనటులు : రమ్య కృష్ణన్జయరామ్

ఇతర నటీనటులు : ఓం పురిశీలు అబ్రహాంరమేష్ పిషరోదిసాజు నవోదయఅక్షర కిషోర్ఏంజిలిన అబ్రహాం తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : రతీష్ వేఘ

డైరెక్టర్ : కన్నన్ తామరక్కులం

ప్రొడ్యూసర్ : హసీబ్ హనీఫ్నౌషాద్ అలాతుర్

రిలీజ్ డేట్ : 20 మే 2016

సత్యజిత్(జయరాం) ఓ ప్రముఖ వ్యాపార వేత్త.. ఉన్నట్టుండి రాత్రి వేళలో సత్యజిత్ కి కొన్ని పీడ కలలు వస్తుంటాయి. ఈ క్రమంలో ఓ రోజు తన కుటుంబమంతా నాశనం అవ్వబోతుందనే కల కంటాడు… తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసంసమస్య కి పరిష్కారం వెతుక్కుంటూ మహేశ్వర బాబా(ఓం పూరి) ని కలుస్తాడు. అయితే సత్యజిత్ గతంలో కొన్న ఓ పాత భవనం వల్లే ఈ సమస్య వచ్చిందనిఅందులో ఉన్న మాతంగి అనే ఓ ఆత్మ వల్లే ఇదంతా జరుగుతుందని తెలుసుకుంటాడు. ఇంతకీ ఆ పాత భవనంలో  ఆత్మగా మారిన మాతంగి ఎవరు…?  మాతంగి కి సత్యజిత్ కి సంబంధం ఏమిటి..చివరికి ఆ ఆత్మ నుంచి సత్యజిత్ తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడా…? అనేది సినిమా కథాంశం.

____________________________________________

నిన్నే ఇష్టపడ్డాను

నటీనటులు – తరుణ్, అనిత, శ్రీదేవి, రాజీవ్ కనకాల, శరత్ బాబు, బ్రహ్మానందం, గిరిబాబు దర్శకుడు – కొండ డైలాగ్స్ – కోన వెంకట్ బ్యానర్ – శ్రీ దుర్గా ఆర్ట్స్ నిర్మాత – కేఎల్ నారాయణ సంగీతం – ఆర్పీ పట్నాయక్ రిలీజ్ – జూన్ 12, 2003

వైజాగ్ లో ఉండే చెర్రీ (తరుణ్) సరదాగా ఉండే ఓ కాలేజ్ స్టూడెంట్. హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చిన సంజన(అనిత), చరణ్ కాలేజ్ లో చేరుతుంది. ఇద్దరి మధ్య చిన్నచిన్న గొడవలు, ఆట పట్టించుకోవడాలు జరుగుతుంటాయి. దీంతో చరణ్ ను ఎలాగైనా దెబ్బకొట్టాలని భావించినసంజన, అతడ్ని ప్రేమించినట్టు నాటకం ఆడుతుంది. పెళ్లి వరకు తీసుకొచ్చి హైదరాబాద్ చెక్కేస్తుంది.

భగ్నప్రేమికుడిగా మారిన చెర్రీ, సంజన కోసం హైదరాబాద్ వెళ్తాడు. సంజన తనను మోసం చేసిందని తెలుకుంటాడు. సంజనకు కాబోయే భర్త బోనీ (రాజీవ్ కనకాల) సహాయంతో ఆమె ఇంట్లోకి ఎంటరైన చరణ్.. సంజనకు ఎలా బుద్ధిచెప్పాడు. ఈ క్రమంలో మరో అమ్మాయి గీత(శ్రీదేవి)కు ఎలా దగ్గరయ్యాడనేది ఈ సినిమా కథ. ఆర్పీ పట్నాయక్ కంపోజ్ చేసిన ఈ సినిమాలో పాటలన్నీ సూపర్ డూపర్ హిట్టయ్యాయి. బాలీవుడ్ హాట్ బ్యూటీ నేహా ధూపియా ఇందులో ఐటెంసాంగ్ చేసింది.

_________________________________

అ..ఆ

నటీనటులు : నితిన్, సమంతా అక్కినేని , అనుపమ పరమేశ్వరన్ ఇతర నటీనటులు : నరేష్, నదియా, హరితేజ, అనన్య, రావు రమేష్, శ్రీనివాస్ అవసరాల మరియు తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ.జె.మేయర్ డైరెక్టర్ : త్రివిక్రమ్ ప్రొడ్యూసర్ : S. రాధాకృష్ణ రిలీజ్ డేట్ : 2 జూన్ 2016

నితిన్, సమంతా జంటగా నటించిన బ్యూటిఫుల్ లవ్ ఎంటర్ టైనర్ అ..ఆ. రిచ్ ఫ్యామిలీలో పుట్టిన అనసూయ (సమంతా), తల్లి క్రమశిక్షణతో విసుగెత్తి పోతుంది. దానికి తోడు తన ఇష్టా ఇష్టాలతో సంబంధం కుదర్చడం మరో తలపోతులా ఫీలవుతూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో తండ్రి సలహా మేరకు తన మేనత్త ఇంటికి వెళ్తుంది. ఆనంద్ విహారి ( నితిన్) తో పాటు, తక్కిన ఫ్యామిలీని కలుసుకుంటుంది. ఆస్తి, ఆర్భాటాలు లేకపోయినా అనురాగ ఆప్యాయతలతో ఉండే ఆ ఫ్యామిలీని ఇష్టపడటమే కాదు ఆనంద్ విహారితో ప్రేమలో కూడా పడుతుంది అనసూయ. ఆ తరవాత ఏం జరుగుతుంది..? అనేదే ఈ సినిమాలో ప్రధాన కథాంశం.

_______________________________________

సుబ్రహ్మణ్యపురం

నటీనటులు : సుమంత్ఈషా రెబ్బ

ఇతర నటీనటులు : సురేష్తనికెళ్ళ భరణిసాయి కుమార్ఆలీసురేష్జోష్ రవిభద్రం గిరిమాధవిహర్షిని, TNR తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర

డైరెక్టర్ : సంతోష్ జాగర్లపూడి

ప్రొడ్యూసర్ : బీరం సుధాకర్ రెడ్డి

రిలీజ్ డేట్ : 7 డిసెంబర్ 2018

నాస్తికుడైన కార్తీక్ (సుమంత్) దేవాలయాలపై పరిశోధనలు చేస్తుంటుంటాడు. ఈ క్రమంలో మహా భక్తురాలైన ప్రియ( ఈషా)ను తొలి చూపులోనే ఆమె మంచితనం చూసి ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో సుబ్రహ్మణ్యపురం అనే గ్రామంలో ఊహించని రీతిలో వరుసగా ఆత్మహత్యలు జరుగుతుంటాయి. ఆ ఊరికి ప్రెసిడెంట్ అయిన వర్మ(సురేష్) ఊరిలో ఎం జరుగుతుందో తెలుసుకోవాలని ప్రయత్నించినా అది అంతు చిక్కని సమస్యలా కనిపిస్తుంది. అయితే ప్రియ ద్వారా సుబ్రహ్మణ్యపురం ఊరిలో అడుగుపెట్టిన కార్తీక్ ఆ ఆత్మ హత్యలపై రీ సెర్చ్ మొదలుపెడతాడు. అలా రీ సెర్చ్ మొదలుపెట్టిన కార్తీక్ పది రోజుల్లో సుబ్రహ్మణ్యపురం గుడి వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదిస్తానని ఊరి ప్రజలకు మాటిస్తాడు. ఇంతకీ సుబ్రహ్మణ్యపురం ఏం జరిగింది… చివరికి కార్తీక్ ఆ రహస్యాన్ని ఎలా ఛేదించాడు అనేది మిగతా కథ.

_____________________________________

కాంచన 3

న‌టీన‌టులు : రాఘ‌వ లారెన్స్‌, ఓవియా, వేదిక‌, నిక్కి తంబోలి, కొవైస‌ర‌ళ‌, క‌భీర్ దుహ‌న్ సింగ్‌, శ్రీమ‌న్‌, దేవ‌ద‌ర్శిని, కిషోర్ త‌దిత‌రులు సినిమాటోగ్ర‌ఫి : వెట్రి, స‌ర్వేష్ మురారి మ్యూజిక్ : తమన్ క‌థ‌-స్క్రీన్‌ప్లే-ద‌ర్శ‌కత్వం: రాఘ‌వ లారెన్స్‌ నిడివి : 161 నిమిషాలు విడుదల తేది : 19 ఏప్రిల్ 2019

దెయ్యం అనే సౌండ్ వింటేనే భయపడే రాఘవ (రాఘవ లారెన్స్) తన కుటుంబంతో కలిసి తాతయ్య షష్టి పూర్తి కోసమని వరంగల్ వెళ్తాడు. అలా తాత ఊరెళ్ళిన రాఘవను తన మావయ్యల కూతుర్లు కావ్య (ఒవియా),ప్రియ (వేదిక),ప్రియా చెల్లి(నిక్కి తంబోలి) ప్రేమలో పడేసి, పెళ్లి చేసుకొనే ప్రయత్నం చేస్తుంటారు. ఆ ముగ్గురిలో తనను బాగా ఆకర్షించిన మరదలిని మాత్రమే పెళ్లి చేసుకుంటానని కండీషన్ పెడతాడు రాఘవ. అయితే అనుకోకుండా ఆ ఇంట్లోకి రెండు ఆత్మలు ప్రవేశిస్తాయి. ఇంట్లో వాళ్ళని భయపెడుతూ పగతో రగిలిపోతుండే ఆ ఆత్మలను ఇంటి నుండి బయటకి పంపించే ప్రయత్నం చేస్తుంటారు రాఘవ తల్లి(కోవై సరళ), అన్నయ్య(శ్రీమాన్) వదిన(దేవ‌ద‌ర్శిని). అయితే ఓ సందర్భంలో రాఘవ లోకి ఆత్మ ప్రవేశిస్తుంది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు రాఘవలోకి కాళి అనే ఆత్మ ప్రవేశించిందని తెలుసుకుంటారు. ఇంతకీ కాళి ఎవరు..? కాళి తో పాటు ఉండే మరో ఆత్మ ఎవరిది..? రాఘవ ద్వారా కాళి తన పగను ఎలా తీర్చుకున్నాడు.. అనేది మిగతా కథ.

_______________________________________

దొంగ

నటీనటులు – కార్తి, జ్యోతిక, సత్యరాజ్, నిఖిలా విమల్, సీత, ఇళవరసు దర్శకుడు – జీతూ జోసెఫ్ బ్యానర్ – వయకామ్ స్టుడియోస్, పారలల్ మైండ్స్ ప్రొడక్షన్ నిర్మాత – రావూరి వి శ్రీనివాస్ సంగీతం – గోవింద వసంత్ రిలీజ్ డేట్ – డిసెంబర్ 20, 2019

విలక్షణ నటుడు కార్తి, సీనియర్ హీరోయిన్ జ్యోతిక నటించిన సినిమా దొంగ. జ్యోతిక, కార్తీ కలిసి నటించిన తొలి చిత్రం ‘దొంగ’ (Donga). నిజ జీవితంలో వదిన-మరిది అయిన వీళ్లిద్దరూ ఈ చిత్రంలో అక్కాతమ్ముళ్లుగా నటించడం విశేషం. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘దృశ్యం’ చిత్రానికి దర్శకత్వం వహించిన జీతూ జోసేఫ్‌ ఈ చిత్రానికి దర్శకుడు. సత్యరాజ్‌ తండ్రి పాత్ర పోషించిన ఈ చిత్రంలో Karthi సరసన ‘మేడ మీద అబ్బాయి’, ‘గాయత్రి’ ఫేమ్‌ నిఖిలా విమల్‌ హీరోయిన్ గా నటించింది.

గోవాలో చిన్న చిన్న దొంగతనాలు, చీటింగ్ లు చేస్తూ ఫ్రీ బర్డ్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు విక్కీ(కార్తీ). 15ఏళ్లుగా తప్పిపోయిన కొడుకు శర్వా కోసం వెతుకుతుంటారు తండ్రి జ్ఞానమూర్తి (సత్య రాజ్), అక్క పార్వతి(జ్యోతిక). బాగా డబ్బున్న ఈ కుటుంబంలోకి శర్వాలానే ఉన్న విక్కీని ప్రవేశపెడతాడు పోలీసాఫీసర్ జీవానంద్ (ఇళవరసు). డబ్బు కోసం అతడు ఈ పని చేస్తాడు.

మరి శర్వా గా జ్ఞానమూర్తి కుటుంబంలోకి వెళ్లిన విక్కీ అక్కడ ఎదుర్కున్న పరిస్థితులు ఏమిటి? ఆ కుటుంబం అతనిని నమ్మిందా? అసలు శర్వా ఏమయ్యాడు? చివరికి విక్కీ, పార్వతి, జ్ఞానమూర్తిల కథ ఎలా ముగిసింది? అనేది ఈ ‘దొంగ’ స్టోరీ.