Zee5 : Hanuman Rampage on Zee5 with record views

Wednesday,March 20,2024 - 11:17 by Z_CLU

ఈ ఏడాది సంక్రాంతి పోటీలో 300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో విజేతగా నిలిచి ఫ్యామిలీ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసి బిగ్గెస్ట్ హిట్ అనిపించుకుంది హనుమాన్. ఇప్పుడు OTT స్ట్రీమింగ్ లో కూడా అంతకు మించి అనిపించేలా సరికొత్త బెంచ్ మార్క్ నమోదు చేస్తూ రికార్డ్ వ్యూస్ తో దూసుకెళ్తోంది

లోక కళ్యాణం కోసం దుర్మార్గుల ఆట కట్టించేందుకు హనుమంతుడి సూపర్ పవర్స్ అందుకున్న హనుమంతు అనే సాదారణ కుర్రాడి స్టోరీతో అదిరిపోయే విజువల్ ఎఫెక్ట్స్ తో సూపర్ నేచురల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాను జీ5 లో కిడ్స్ తో పాటు ఫ్యామిలీ అంతా భారీగా చూస్తున్నారు. దీంతో మొదటి రోజే రికార్డ్ వ్యూస్ కొల్లగొట్టింది హనుమాన్. OTT లో రిలీజైన 11 గంటల్లోనే 102 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ తో హైయెస్ట్ నంబర్ రీచ్ అయ్యింది.

ప్రస్తుతం జీ5 లో భారీ వ్యూస్ తో టాప్ ప్లేస్ లో నిలిచిన హనుమాన్ ట్రెండింగ్ లో ఉంది . తేజ సజ్జ నటన , క్యూట్ లవ్ స్టోరీ , పాటలు , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , సూపర్బ్ అనిపించే vfx , గూస్ బంప్స్ తెప్పించే క్లైమాక్స్ సీక్వెన్స్ ఇలా సినిమాలో చాలా హైలైట్స్ ఉన్నాయి. వీటన్నిటి కోసం ఈ సినిమా కచ్చితంగా చూడాల్సిందే. ముఖ్యంగా థియేటర్స్ లో ఈ, సినిమాను మిస్ అయిన వారు OTT లో తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. Dont Miss It !

 

బ్లాక్‌బస్టర్ 'హను-మాన్' ZEE5లో స్ట్రీమ్ అవుతోంది. ఇప్పుడే చూడండి. Available in Telugu with English subtitles. zee5.onelink.me/RlQq/HanuMan