Zee Cinemalu (9th April)

Thursday,April 08,2021 - 10:00 by Z_CLU

పెంగ్విన్

న‌టీటులు: కీర్తి సురేష్‌‌, లింగా, మదంప‌ట్టి రంగ‌రాజ్, మాస్ట‌ర్ అద్వైత్‌, నిత్య త‌దిత‌రులు నిర్మాత‌: కార్తీక్ సుబ్బ‌రాజ్, కార్తికేయ‌న్ సంతానం, సుధ‌న్ సుంద‌రం, జ‌య‌రాం ర‌చ‌న‌- ద‌ర్శ‌క‌త్వం: ఈశ్వ‌ర్ కార్తీక్‌ సంగీతం: సంతోష్‌ నారాయణ్‌ ఛాయాగ్ర‌హ‌ణం: కార్తీక్ ప‌ళ‌ని బ్యాన‌ర్‌: స్టోన్‌ బెంచ్‌ ఫిల్మ్స్‌, ఫ్యాష‌న్ స్టూడియోస్‌ విడుద‌ల‌: జూన్ 19 (OTT)

రిథమ్‌‌ (కీర్తి సురేష్‌‌), ర‌ఘు (లింగ‌)ల ఒక్క‌గానొక్క కొడుకు అజ‌య్‌. అజ‌య్ అంటే రిథ‌మ్‌కు పంచ‌ప్రాణాలు. ఓ రోజు అజ‌య్ కిడ్నాప్ అవుతాడు. దీంతో అత‌డి కోసం త‌ల్లిదండ్రులిద్ద‌రూ అడ‌విలో అంగుళం అంగుళం జ‌ల్లెడ ప‌ట్టిన‌ప్ప‌టికీ అజ‌య్ జాడ దొర‌క‌దు. అజ‌య్ దుస్తులు క‌నిపించ‌గానే అత‌డు చ‌నిపోయాడ‌ని అంద‌రూ భావిస్తారు.. రిథ‌మ్ మాత్రం నమ్మదు. అదే స‌మ‌యంలో అజ‌య్ కోసం మానసికంగా కుంగిపోతున్న రిథ‌మ్ నుంచి ర‌ఘు విడాకులు తీసుకుంటాడు. అయిన్ప‌టికీ ఆమె త‌న అన్వేష‌ణ మాన‌దు. ఈ క్ర‌మంలో ఆమె గౌతమ్‌‌(రంగ‌రాజ్‌)ను వివాహం చేసుకుని గ‌ర్భం దాల్చుతుంది. అయితే ఓరోజు స‌డ‌న్‌గా రిథ‌మ్‌కు అజ‌య్ క‌నిపిస్తాడు. ఇన్ని రోజులు అజ‌య్ ఏమైపోయాడు? అత‌నితో పాటు అప‌హ‌ర‌ణ‌కు గురైన ఆరుగురు పిల్ల‌లు బ‌తికే ఉన్నారా? అస‌లు వీరిని ఎందుకు కిడ్నాప్ చేశారు? చార్లీ చాప్లిన్ ముసుగు ధ‌రించిన‌ సీరియ‌ల్ కిల్ల‌ర్ ఎవ‌రు? గ‌ర్భంతో ఉన్న కీర్తి అత‌డిని ఎలా ఎదుర్కొంది? అన్న విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

__________________________________________

బొమ్మరిల్లు

నటీనటులు : సిద్ధార్థ్జెనీలియా

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్కోట శ్రీనివాస రావుజయసుధసత్య కృష్ణన్సుదీప పింకీసురేఖా వాణి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : భాస్కర్

ప్రొడ్యూసర్ : దిల్ రాజు

రిలీజ్ డేట్ : 9 ఆగష్టు 2006

తండ్రి కొడుకుల అనుబంధాన్ని అద్భుతంగా తెరకెక్కించిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ బొమ్మరిల్లు. న్యాచురల్ పెర్ఫామెన్స్ అలరించిన జెనీలియాసిద్ధార్థ్ పర్ఫామెన్స్ సినిమాకే హైలెట్. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకే హైలెట్.

_____________________________________

ఉన్నది ఒకటే జిందగీ

నటీనటులు : రామ్ పోతినేని, అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి

ఇతర నటీనటులు : శ్రీ విష్ణు, ప్రియదర్శి, కిరీటి దామరాజు, హిమజ, అనీషా ఆంబ్రోస్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : కిషోర్ తిరుమల

ప్రొడ్యూసర్ : కృష్ణ చైతన్య, స్రవంతి రవి కిషోర్

రిలీజ్ డేట్ : 27 అక్టోబర్ 2017

అభి(రామ్) – వాసు(శ్రీ విష్ణు) ఒకరిని వదిలి ఒకరు ఉండలేని ప్రాణ స్నేహితులు.  చిన్నతనం నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ గా  జీవితాన్ని గడుపుతున్న అభి – వాసు జీవితంలోకి  అనుకోకుండా మహా(అనుపమ) అనే అమ్మాయి ఎంటర్ అవుతుంది.  స్నేహితుడు తర్వాతే ఇంకెవరైనా అనుకునే అభి- వాసులు మహా వల్ల నాలుగేళ్లు  దూరమవుతారు. ఇంతకీ మహా ఎవరు…? ఒకరినొకరు వదిలి ఉండలేని అభి – వాసులు ఎందుకు విడిపోయారు.. చివరికి మళ్ళీ ఎలా కలిశారు..అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

_______________________________

కందిరీగ

నటీనటులు : రామ్హన్సిక  మోత్వాని

ఇతర నటీనటులు : అక్ష పార్ధసానిజయ ప్రకాష్ రెడ్డిసోను సూద్జయ ప్రకాష్ రెడ్డిచంద్ర మోహన్శ్రీనివాస రెడ్డి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S. తమన్

డైరెక్టర్ : సంతోష్ శ్రీనివాస్

ప్రొడ్యూసర్ : బెల్లంకొండ సురేష్

రిలీజ్ డేట్ : 12 ఆగష్టు 2011

ఎనర్జిటిక్ స్టార్ రామ్హన్సిక మోత్వాని జంటగా నటించిన హిలేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ కందిరీగ. కామెడీ ఈ సినిమాకి పెద్ద ఎసెట్ గా నిలిచింది. 

_________________________________________

కాశి

నటీనటులు: విజయ్ ఆంటోనీ, అంజలి, సునైన, అమృత అయ్యర్, నాజర్, జెపి తదితరులు

సంగీతం : విజయ్ ఆంటోని

సినిమాటోగ్రఫీ : రిచర్డ్ ఎం.నాథన్

నిర్మాతలు: ఉదయ్ హర్ష వడ్డెల, గణేష్ పెనుబోతు, ప్రధ్యుమ్న  చంద్రపతి

రచన-దర్శకత్వం : కిరుతిగ ఉదయనిధి

విడుదల తేది : 18 మే 2018

సెన్సిబుల్ సినిమాలతో.. నటుడిగా, సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన సినిమా “కాశి”.

అమెరికాలో భరత్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎం.డి గా గొప్ప జీవితాన్ని అనుభవించే డాక్టర్ భరత్(విజయ్ ఆంటోనీ)కి ఓ పెద్ద పాము కనిపించినట్టుగా… అలాగే ఎద్దు పరుగెడుతూ వచ్చి ఓ మహిళను పొడిచినట్టుగా ఓ కల వస్తుంది. అయితే ఆ కల నిజామా..లేదా..అనే భ్రమలో ఉన్న భరత్ కి అమెరికాలో తనతో పాటు ఉన్న తల్లిదండ్రులు తన సొంత తల్లిదండ్రులు కారనే నిజం తెలుస్తుంది. చిన్నతనంలో అనాధగా ఉన్న తనను దత్తత తీసుకొని అమెరికా తీసుకొచ్చి పెంచుకున్నారని తెలుసుకున్న మరుక్షణం తన గతం వెతుక్కుంటూ ఇండియాకి బయలుదేరతాడు భరత్.. అలా తన తల్లితండ్రుల జాడ తెలుసుకోవడానికి కంచర్లపాలెం చేరుకున్న భరత్ కి ఆ ఊళ్ళో కొన్ని అనుకోని కథలు ఎదురవుతాయి. ఇంతకీ భరత్ తల్లిదండ్రులు ఎవరు..? వారు బ్రతికే ఉన్నారా..? చివరికి భరత్ వాళ్ళ గురించి ఎలా తెలుసుకున్నాడు..అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

________________________________________________

లక్ష్మి

తారాగణం : ప్రభుదేవా , ఐశ్వర్య రాజేష్, కోవై సరళ, దిత్య బండే , సల్మాన్ యూసుఫ్ ఖాన్, చామ్స్ , అక్షత్ సింగ్, జీత్ దాస్, సామ్ పాల్. రచన మరియు దర్శకత్వం: ఎఎల్ విజయ్ నిర్మాతలు: సి. కల్యాణ్, ప్రతీక్ చక్రవర్తి, శృతి నల్లప్ప మరియు ఆర్.రవీంద్రన్ బ్యానర్లు: సి.కె ఎంటర్టైన్మెంట్స్, ప్రమోద్ ఫిల్మ్స్ మరియు ట్రైడెంట్ ఆర్ట్స్ సంగీతం: సామ్ సీఎస్ డీఓపీ : నీరవ్ షా ఎడిటర్ : ఆంథోనీ

ప్రభుదేవా, ఐశ్వర్య ప్రధానపాత్రల్లో నటిస్తున్న సినిమా ‘లక్ష్మి’.. ఏ.ఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా కిడ్స్ డాన్స్ రియాలిటీ షో సూపర్ డాన్సర్ సీజన్ 1 విజేత అయిన దిత్య బండే బాలనటిగా పరిచయమైంది. డాన్స్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో దిత్య డాన్స్ గురువుగా ప్రభుదేవా కనిపించాడు. దిత్య స్టెప్పులు, కథలో ఎమోషన్స్ ఈ సినిమాలో మెయిన్ ఎట్రాక్షన్స్.

  *Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics