Zee Cinemalu (2nd February)

Monday,March 01,2021 - 10:00 by Z_CLU

స్టూడెంట్ నంబర్ 1

నటీనటులు : N.T.R., గజాల ఇతర నటీనటులు : రాజీవ్ కనకాల, బ్రహ్మానందం, ఆలీ, సుధ, కోట శ్రీనివాస రావు, M.S. నారాయణ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : M.M. కీరవాణి డైరెక్టర్ : S.S. రాజమౌళి ప్రొడ్యూసర్ : K. రాఘవేంద్ర రావు రిలీజ్ డేట్ : 27 సెప్టెంబర్ 2001

ఇంజనీర్ అవ్వాలనే ప్యాషన్ ఉన్నా కేవలం చేయని నేరానికి శిక్షననుభవిస్తున్న తండ్రిని కాపాడుకోవడానికి లా కాలేజ్ లో జాయిన్ అవుతాడు ఆదిత్య. ఓ వైపు మర్డర్ కేసులో జైలు పాలయినా, జైలులో ఉంటూ కూడా తన తండ్రి గౌరవం కాపాడటానికి కష్టపడతాడు. అసలు ఆదిత్య చంపింది ఎవరిని…? ఎందుకు చేశాడా హత్య..? తన తండ్రిని నిర్దోషిగా నిరూపించడంలో ఆదిత్య ప్రయత్నం సక్సెస్ అవుతుందా…? ఆదిత్య జైలు నుండి విడుదల అవుతాడా…? అనేదే ఈ సినిమా ప్రధానాంశం.

________________________________________________ akashamantha-zeecinemalu-fpc

ఆకాశమంత

నటీ నటులు : ప్రకాష్ రాజ్, త్రిష, జగపతి బాబు, ఐశ్వర్య, గణేష్ తదితరులు.

సంగీతం  : విద్యా సాగర్

నిర్మాత : దిల్ రాజు

రచన -దర్శకత్వం : రాదా మోహన్

'ఆకాశమంత' తండ్రి కూతురు మధ్య ఉండే ప్రేమ, ఎమోషన్ ని పర్ఫెక్ట్ క్యాప్చర్ చేసిన సినిమాల్లో బెస్ట్ సినిమా అని చెప్పొచ్చు.  2009 లో రాధామోహన్ దర్శకత్వంలో విడుదలైన తమిళ అనువాద చిత్రం. సినిమాలో ప్రకాష్ రాజ్ , త్రిష నటన,పాటలు సినిమాకు హైలైట్.

______________________________________

చూడాలని ఉంది

నటీనటులు : చిరంజీవి, సౌందర్య, అంజలా జవేరి ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, ధూళిపాళ్ళ, బ్రహ్మాజీ, వేణు మాధవ్, ఆహుతి ప్రసాద్ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ డైరెక్టర్ : గుణశేఖర్ ప్రొడ్యూసర్ : అశ్విని దత్ రిలీజ్ డేట్ : 27 ఆగష్టు 1998

తన కూతురు ప్రియ, తనకిష్టం లేకుండా రామకృష్ణని పెళ్ళి చేసుకుందన్న కోపంతో తనపై ఎటాక్ చేయిస్తాడు మహేంద్ర. అయితే ఓ సందర్భంలో రామకృష్ణకి బులెట్ తగిలే సమయానికి ప్రియ అడ్డు పడుతుంది. దాంతో ప్రియ చనిపోతుంది. ఇదే సమయంలో రామకష్ణ, ప్రియ ల కొడుకును మహేంద్ర తీసుకెళ్ళిపోతాడు. దానికి తోడు ప్రియని చంపింది రామకృష్ణే అని హత్యానేరం మోపుతాడు. దాంతో జైలుకు వెళ్ళిన రామకృష్ణ మహేంద్ర దగ్గర ఉన్న తన కొడుకు కోసం తిరిగి వస్తాడు. అప్పుడే తనకు పద్మావతితో పరిచయమవుతుంది. చివరికి రామకృష్ణ, మహేంద్రకి ఎదురు నిలిచి కొడుకును ఎలా దక్కించు కున్నాడనేదే అసలు కథ.

_________________________________________

అహ నా పెళ్ళంట

నటీనటులు : అల్లరి నరేష్శ్రీహరిరీతు బర్మేచ ఇతర నటీనటులు : అనిత హాసనందినిబ్రహ్మానందంఆహుతి ప్రసాద్సుబ్బరాజువిజయ్ సామ్రాట్ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : రఘు కుంచె డైరెక్టర్ : వీరభద్రం ప్రొడ్యూసర్ : అనిల్ సుంకర రిలీజ్ డేట్ : 2 మార్చి 2011

రియల్ స్టార్ శ్రీహరినరేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన హిలేరియస్ ఎంటర్ టైనర్ అహ నా పెళ్ళంట. వీరభద్రం డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అన్ని సెంటర్ లలోను సూపర్ హిట్ అయింది. కామెడీ ఈ సినిమాకి పెద్ద ఎసెట్.

_______________________________________

కందిరీగ

నటీనటులు : రామ్హన్సిక  మోత్వాని

ఇతర నటీనటులు : అక్ష పార్ధసానిజయ ప్రకాష్ రెడ్డిసోను సూద్జయ ప్రకాష్ రెడ్డిచంద్ర మోహన్శ్రీనివాస రెడ్డి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S. తమన్

డైరెక్టర్ : సంతోష్ శ్రీనివాస్

ప్రొడ్యూసర్ : బెల్లంకొండ సురేష్

రిలీజ్ డేట్ : 12 ఆగష్టు 2011

ఎనర్జిటిక్ స్టార్ రామ్హన్సిక మోత్వాని జంటగా నటించిన హిలేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ కందిరీగ. కామెడీ ఈ సినిమాకి పెద్ద ఎసెట్ గా నిలిచింది.