Zee Cinemalu (27th February)

Friday,February 26,2021 - 10:00 by Z_CLU

memu-zee-cinemalu-427x320

మేము

నటీనటులు : సూర్య, అమలా పాల్ ఇతర నటీనటులు : రామ్ దాస్, కార్తీక్ కుమార్, విద్యా ప్రదీప్, బిందు మాధవి, నిశేష్, వైష్ణవి తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : ఆరోల్ కోలేరి డైరెక్టర్ : పాండిరాజ్ ప్రొడ్యూసర్స్ : సూర్య, పాండిరాజ్ రిలీజ్ డేట్ : 24th డిసెంబర్ 2015

పిల్లల్లో హైపర్ ఆక్టివిటీని ఎలా హ్యాండిల్ చేయాలి అనే సెన్సిటివ్ టాపిక్ తో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మేము. ఈ సినిమాలో సూర్య, అమలా పాల్ నటన హైలెట్ గా నిలిచింది.

________________________________ loukyam-zee-cinemalu-586x276

లౌక్యం

నటీనటులు : గోపీచంద్రకుల్ ప్రీత్ సింగ్

ఇతర నటీనటులు : బ్రహ్మానందంముకేష్ రిషిసంపత్ రిషిచంద్ర మోహన్రాహుల్ దేవ్మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్

డైరెక్టర్ : శ్రీవాస్

ప్రొడ్యూసర్ : V. ఆనంద్ ప్రసాద్

రిలీజ్ డేట్ : 26 సెప్టెంబర్ 2014

గోపీచంద్రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లౌక్యం. తన ఫ్రెండ్ ఒక అమ్మాయిని ప్రేమించడంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా ఆఇంట్లోంచి ఆ అమ్మాయిని ఎత్తుకొచ్చి వారిద్దరి పెళ్ళి చేస్తాడు వెంకీ. దాంతో ఆ అమ్మాయి అన్న వెంకీపై కక్ష కడతాడు. ఈ ఇన్సిడెంట్ తరవాత వెంకీ ఒక ఆమ్మాయి ప్రేమలో పడతాడు. తర్వాత ఆ లోకల్ క్రిమినల్ మరో చెల్లెలే తను ప్రేమించిన అమ్మాయి అని తెలుసుకుంటాడు. అప్పుడువెంకీ ఏం చేస్తాడు..అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

__________________________________________ okato-number-kurradu-ఒకటో-నంబర్-కుర్రాడు-zeecinemalu-580x320

ఒకటో నంబర్ కుర్రాడు

నటీనటులు : తారకరత్న, రేఖ ఇతర నటీనటులు : గిరిబాబు, సునీల్, తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, ఎమ్మెస్ నారాయణ మ్యూజిక్ డైరెక్టర్ : కీరవాణి డైరెక్టర్ : కోదండరామిరెడ్డి ప్రొడ్యూసర్ : అశ్వనీదత్, కె.రాఘవేంద్రరావు రిలీజ్ డేట్ : సెప్టెంబర్ 18, 2002

తారకరత్న, రేఖ నటించిన హిట్ సినిమా ఒకటో నంబర్ కుర్రాడు. తారకరత్న ను హీరోగా పరిచయం చేసిన సినిమా ఇది. కోదండ రామిరెడ్డి డైరక్ట్ చేసిన ఈ సినిమాకు రాఘవేంద్రరావు కథ అందించడం విశేషం. స్వప్న సినిమాస్ బ్యానర్ పై అశ్వనీదత్ ఈ సినిమాను సమర్పించగా.. రాఘవేంద్రరావు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈ సినిమాకు కీరవాణి అందించిన సంగీతం సూపర్ హిట్టయింది. ఇప్పటికీ ఈ సినిమాలో పాటలు అక్కడక్కడ వినిపిస్తుంటాయి.

__________________________________________________

శ్రీమంతుడు

నటీనటులు : మహేష్ బాబుశృతి హాసన్ ఇతర నటీనటులు : రాజేంద్ర ప్రసాద్జగపతి బాబుసుకన్యసితారముకేష్ రిషిసంపత్ రాజ్ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్ డైరెక్టర్ : కొరటాల శివ ప్రొడ్యూసర్ : Y. నవీన్, Y. రవి శంకర్, C.V. మోహన్ రిలీజ్ డేట్ : 7 ఆగష్టు 2015

కొరటాల మార్క్ కమర్షియల్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ‘శ్రీమంతుడు’. రూరల్ డెవెలప్ మెంట్ కోర్స్ నేర్చుకునే ప్రాసెస్ లో చారుశీలకు దగ్గరైన హర్షఒక రిమోట్ విలేజ్ ని దత్తత తీసుకుంటాడు. ఆ ఊరిని డెవెలప్ చేసే ప్రాసెస్ లో ఉన్న అడ్డంకులను ఫేస్ చేస్తూనేఎలాగైనా ఆ ఊరికి అండగా నిలవలనుకునే హర్షకితన తండ్రిది కూడా అదే ఊరని తెలుసుకుంటాడు. ఆ తరవాత ఏం జరిగింది..తన తండ్రిని మళ్ళీ ఆ ఊరికి ఎలా దగ్గర చేశాడు..అనేదే సినిమా ప్రధాన కథాంశం.

_______________________________________ Aravindha-Sametha-zee-cinemalu-586x314-586x314

అరవింద సమేత వీర రాఘవ 

నటీనటులు : N.T. రామారావు, పూజా హెగ్డే ఇతర నటీనటులు : ఈషా రెబ్బ, సునీల్, జగపతి బాబు, నవీన్ చంద్ర, సుప్రియా పాఠక్, నాగబాబు, రావు రమేష్, నరేష్ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : తమన్ డైరెక్టర్ : త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రొడ్యూసర్ : S. రాధాకృష్ణ రిలీజ్ డేట్ : 11 అక్టోబర్ 2018

కొమ్మద్ది గ్రామానికి చెందిన నారపరెడ్డి(నాగబాబు), నల్లగుడికి చెందిన బసిరెడ్డి(జగపతిబాబు)కి కొన్నేళ్ళుగా ఫ్యాక్షన్ గొడవలు. ఈ క్రమంలో నారపరెడ్డిని చంపడానికి బసిరెడ్డి ఓ అవకాశం కోసం ఎదురుచూస్తుంటాడు. అదే సమయంలో లండన్ నుండి వచ్చిన వీరరాఘవరెడ్డి(ఎన్టీఆర్)ని స్టేషన్ నుంచి తీసుకొస్తున్నప్పుడు అదే అవకాశంగా భావించి నారపరెడ్డిని హతమారుస్తాడు బసిరెడ్డి. కళ్ళ ముందే తండ్రి ప్రత్యర్దుల చేతిలో చనిపోవడంతో బసిరెడ్డిపై కత్తి దూస్తాడు వీర రాఘవ.. అక్కడి నుండి మళ్ళీ గొడవలు మొదలవుతాయి.

అయితే తన కొడుకు చావుతో గొడవలు ఆపేయమని వీర రాఘవుణ్ణి కోరుతుంది నానమ్మ సుగుణ(సుప్రియ పాఠక్)… అలా నానమ్మ మాటకి కట్టుబడి గొడవలు ఆపేయాలన్న ఉద్దేశ్యంతో హైదరాబాద్ వెళ్ళిపోయిన రాఘవ.. నీలంబరి(సునీల్) గ్యారేజ్ లో ఆశ్రయం పొందుతాడు. ఆ సమయంలోనే క్రిమినల్ లాయర్(నరేష్)కూతురు అరవింద(పూజా హెగ్డే)పరిచయం ప్రేమగా మారుతుంది.

ఇక చావు నుండి బ్రతికి బయటపడ్డ బసిరెడ్డి తన కొడుకు బాల్ రెడ్డి(నవీన్ చంద్ర) ద్వారా శత్రువు వీరరాఘవ రెడ్డి కోసం వెతుకుతూనే ఉంటాడు. ఈ క్రమంలో రాఘవ హైదరాబాద్ లో ఉన్నాడని పసిగట్టి చంపడానికి చూస్తుంటాడు బసి రెడ్డి. ఈ క్రమంలో వీర రాఘవ ఫ్యాక్షన్ గొడవలను ఆపడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసాడు.. చివరికి పగతో రగిలిపోతూ క్రూరంగా తయారైన బసిరెడ్డిని వీరరాఘవ మార్చగలిగాడా.. లేదా… అనేది సినిమా కథ.

____________________________________________

బ్రూస్ లీ

నటీనటులు : రామ్ చరణ్రకుల్ ప్రీత్ సింగ్

ఇతర నటీనటులు : అరుణ్ విజయ్కృతి కర్బందానదియాసంపత్ రాజ్బ్రహ్మానందంఆలీ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్

డైరెక్టర్ : శ్రీను వైట్ల

ప్రొడ్యూసర్ : D.V.V. దానయ్య

రిలీజ్ డేట్ : 16 అక్టోబర్ 2015

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కరియర్ లోనే డిఫెరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ బ్రూస్ లీ. తన అక్క చదువు కోసం స్టంట్ మ్యాన్ గా మారిన యువకుడి క్యారెక్టర్ లో చెర్రీ పర్ఫామెన్స్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. మెగాస్టార్ క్యామియో సినిమాకి మరో హైలెట్.