Zee Cinemalu (16th February)

Monday,February 15,2021 - 10:00 by Z_CLU

శివగంగ

నటీనటులు : శ్రీరామ్, రాయ్ లక్ష్మి ఇతర నటీనటులు : సుమన్, జాన్ పీటర్, శరవణన్, శ్రీనివాసన్, సింగం పూడి తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : జాన్ పీటర్ డైరెక్టర్ : V.C. వడివుడియన్ ప్రొడ్యూసర్ : జాన్ మ్యాక్స్, జోన్స్ రిలీజ్ డేట్ : మార్చి 4, 2016

శ్రీ రామ్, రాయ్ లక్ష్మీ నటించిన అల్టిమేట్ హారర్ ఎంటర్ టైనర్ శివగంగ. వడివుడియన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో హారర్ ఎలిమెంట్స్ హైలెట్ గా నిలిచాయి.

______________________________________

దేవత 

 నటీ నటులు : శోభన్ బాబుశ్రీదేవి మిగతా నటీనటులు – జయప్రదమోహన్ బాబురావుగోపాల్రావు సంగీతం – చక్రవర్తి దర్శకత్వం – కె.రాఘవేంద్రరావు విడుదల తేదీ – 1982, సెప్టెంబర్ 4

దేవత పేరుచెప్పగానే బిందెలు గుర్తొస్తాయి. చీరలతో చేసిన డెకరేషన్ గుర్తొస్తుంది. ఆ వెంటనే ఓ సూపర్ హిట్ సాంగ్ గుర్తొస్తుంది. అదే వెల్లువొచ్చి గోదారమ్మ పాట. దర్శకుడు కె.రాఘవేంద్రరావుసంగీత దర్శకుడు చక్రవర్తి కాంబినేషన్ లో చాలా సినిమాలొచ్చాయి. వాటిలో ఎన్నో పాటలు హిట్ అయ్యాయి. కానీ దేవతలోని ఈ పాట మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతుంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్.

____________________________________ Nani_jersey_movie-zeecinemalu

జెర్సీ

నటీనటులు : నాని, శ్రద్ధా దాస్ ఇతర నటీనటులు : సత్యరాజ్, మాస్టర్ రోనిత్ కామ్ర, హరీష్ కళ్యాణ్, విశ్వనాథ్ దుద్దుంపూడి, సానుష మరియు తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : అనిరుద్ రవిచందర్ డైరెక్టర్ : గౌతమ్ తిన్ననూరి ప్రొడ్యూసర్ : సూర్యదేవర నాగవంశి రిలీజ్ డేట్ : 19 ఏప్రిల్ 2019

అర్జున్ (నాని).. క్రికెట్ అతడి ప్రపంచం. హైదరాబాద్ ప్లేయర్ గా ది బెస్ట్ అనిపించుకుంటాడు. రంజీల్లో కూడా సత్తా చాటుతాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో క్రికెట్ ను వదిలేస్తాడు. ప్రేమించిన సారా (శ్రద్ధ శ్రీనాధ్)ను పెళ్లి చేసుకుంటాడు. వాళ్లకు ఓ కొడుకు కూడా పుడతాడు. కానీ క్రికెట్ ను వదిలేసి పదేళ్లయినా జీవితంలో సెటిల్ అవ్వడు అర్జున్. భార్య సంపాదన మీద బతుకుతుంటాడు. ప్రభుత్వ ఉద్యోగం కూడా పోగొట్టుకుంటాడు.

అనుకోని సంఘటనల మధ్య మరోసారి క్రీజ్ లోకి అడుగుపెడతాడు అర్జున్. ఊహించని విధంగా క్రికెట్ బ్యాట్ పట్టుకుంటాడు. 36 ఏళ్ల లేటు వయసులో అర్జున్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటాడు? అసలు అర్థాంతరంగా అర్జున్ క్రికెట్ ను వదిలేయడానికి కారణం ఏంటి? క్లయిమాక్స్ లో అర్జున్ ఏం సాధించాడు? అనేది బ్యాలెన్స్ కథ.

___________________________________ trisha mohini

మోహిని

నటీనటులు : త్రిషజాకీ భజ్ఞాని ఇతర నటీనటులు : ముకేష్ తివారీపూర్ణిమ భాగ్యరాజ్యోగి బాబుజాంగిరి మధుమితజ్ఞానేశ్వర్స్వామినాథన్ మరియు తదితరలు మ్యూజిక్ డైరెక్టర్ : వివేక్ – మెర్విన్ డైరెక్టర్ : రమణ మాదేశ్ ప్రొడ్యూసర్ : S. లక్ష్మణ్ కుమార్ రిలీజ్ డేట్ : 27 జూలై 2018

ఇండియాలో పాపులర్ చెఫ్ వైష్ణవి (త్రిష). ఆమెకు లండన్ నుంచి ఊహించని ఆఫర్ వస్తుంది. అక్కడకు తన టీమ్ తో పాటు వెళ్తుంది వైష్ణవి. అక్కడే సందీప్ (జాకీ భగ్నానీ) ను కలుస్తుంది. తొలిచూపులోనే ఇద్దరూ ప్రేమించుకుంటారు. తన ప్రేమ విషయాన్ని తల్లికి (పూర్ణిమ) కూడా చెప్పేస్తుంది వైష్ణవి. ఇక్కడ వరకు అంతా ప్రశాంతం. సడెన్ గా తన బాయ్ ఫ్రెండ్ సందీప్టీమ్ తో కలిసి బోటు షికారుకు వెళ్తుంది వైష్ణవి. అక్కడే ఊహించని సంఘటన జరుగుతుంది. ఆ ఘటన కారణంగా సముద్ర గర్భంలో ఓ శంఖంలో కొన్నేళ్లుగా ఉన్న మోహిని (త్రిష) ఆత్మ బయటకు వస్తుంది. బయటకొచ్చి తనలా ఉన్న వైష్ణవిని చూసి ఆమెలో ప్రవేశిస్తుంది. గతంలో తనకు అన్యాయం చేసిన వ్యక్తులపై వైష్ణవి రూపంలో ఉన్న మోహిని ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. ఇందులో భాగంగా తనను చంపిన గుంపులో సందీప్ కూడా ఉన్నాడనే చేదు నిజం తెలుసుకుంటుంది. వైష్ణవిలోకి మోహిని ప్రవేశించిందనే విషయాన్ని సందీప్ తో పాటు విలన్లు గుర్తిస్తారు. మరో క్షుద్ర మాంత్రికుడితో కలిసి మోహినిని బంధించాలనిఅవసరమైతే వైష్ణవిని చంపేయాలని చూస్తారు. ఫైనల్ గా విలన్లను మోహిని ఏం చేసింది.. విలన్ల బారి నుంచి వైష్ణవిని మోహిని ఎలా కాపాడింది అనేది ఈ సినిమా స్టోరీ.

________________________________________ Brand-babu-zee-cinemalu

బ్రాండ్ బాబు

నటీనటులు : సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బ ఇతర నటీనటులు : పూజిత పున్నాడ, మురళీ శర్మ, రాజా రవీంద్ర, సత్యం రాజేష్ మరియు తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : J.B. డైరెక్టర్ : ప్రభాకర్ P. ప్రొడ్యూసర్ : A. శైలేంద్ర బాబు రిలీజ్ డేట్ : ఆగష్టు 3, 2018

వ్యాపారవేత్త డైమండ్ రత్నం (మురళీ శర్మ)కు బ్రాండ్స్ అంటే పిచ్చి. డబ్బున్నవాళ్ల స్టేటస్ మొత్తం వాళ్లు వాడే బ్రాండ్స్ లోనే కనిపిస్తుందనేది అతడి ప్రగాఢ విశ్వాసం. అతడి నమ్మకాలకు తగ్గట్టే కొడుకును పెంచుతాడు రత్నం. వాడే స్పూన్ నుంచి వేసుకునే అండర్ వేర్ వరకు ఇలా ప్రతిది బ్రాండ్ వాడే హీరో (సుమంత్ శైలేంద్ర) డైమండ్.. తనకు కాబోయే భార్య కూడా ఆల్-బ్రాండ్ అమ్మాయిగా ఉండాలని భావిస్తాడు. అయితే ఒకసారి తనకొచ్చిన ఓ మెసేజ్ చూసి హోం మినిస్టర్ కూతురు తనను ప్రేమిస్తుందని భ్రమపడతాడు. తనను ఇంప్రెస్ చేసేందుకు తన ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతుంటాడు. ఈ క్రమంలో హోం మినిస్టర్ కూతురు అనుకొని, ఆ ఇంట్లో పనిచేస్తున్న రాధ (ఇషా రెబ్బా)ను ప్రేమిస్తాడు. అక్కడే అసలు కథ బిగిన్ అవుతుంది. బ్రాండ్ నే నమ్ముకున్న వ్యక్తి , పని మనిషితో ప్రేమలో పడితే ఏం జరుగుతుంది అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.