Yash in Ramcharan-Shankar Movie
Saturday,February 13,2021 - 12:12 by Z_CLU
నిన్న ఎనౌన్స్ చేసిన రామ్ చరణ్ , శంకర్ కాంబో సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికొచ్చింది. సినిమాలో కన్నడ స్టార్ KGF ఫేం యష్ స్పెషల్ క్యారెక్టర్ చేయనున్నాడని ప్రచారం జరుగుతుంది.
సినిమాలో ఇంపార్టెంట్ రోల్ కావడంతో యష్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నాడట శంకర్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి యష్ కి నిర్మాత దిల్ రాజు అడ్వాన్స్ కూడా ఇచ్చారని సమాచారం. ఈ విషయంపై మేకర్స్ నుండి ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు కానీ ఆల్మోస్ట్ యష్ ఈ సినిమాలో నటించడం మాత్రం కన్ఫర్మ్ అని తెలుస్తుంది.
ఒక వేళ ఈ ప్రచారం నిజమైతే ప్రస్తుతం ఎన్టీఆర్ , రామ్ చరణ్ లతో రాజమౌళి తెరకెక్కిస్తున్న క్రేజీ మల్టీ స్టారర్ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ మల్టీ స్టారర్ సినిమా ఇదే అవుతుంది. మరి శంకర్ ఈ ఇద్దరితో ఎలాంటి సినిమా చేస్తారో ? అసలు యష్ రోల్ ఎంత సేపు ఉంటుందో తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం శంకర్ 'ఇండియన్ 2' సినిమాతో బిజీగా ఉండగా రామ్ చరణ్ 'RRR','ఆచార్య' షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమాలు ఫినిష్ అవ్వగానే దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.