Superstar Mahesh Babu Watched Writer Padmabhushan, Appreciates The Entire Team

Monday,February 06,2023 - 02:59 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ బాబు 'రైటర్ పద్మభూషణ్‌' చూసి, టీమ్‌ని మెచ్చుకున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా అంటూ కితాబిచ్చాడు.

'రైటర్ పద్మభూషణ్‌'ని చూసిన అనంతరం సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు Mahesh Babu సినిమా తను పూర్తిగా ఎంజాయ్‌ చేశానని, ఈ సినిమాలో హీరోగా నటించిన సుహాస్‌ ను, దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్‌, నిర్మాతలు శరత్‌చంద్ర, అనురాగ్‌రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు.

మహేష్ బాబు మాట్లాడుతూ, “WriterPadmabushan చూసి ఆనందించాను! హృద్యమైన చిత్రం, ముఖ్యంగా క్లైమాక్స్!  కుటుంబాలు తప్పనిసరిగా చూడవలసిన సినిమా! సినిమాలో సుహాస్  Suhas నటన నచ్చింది! ఘనవిజయం సాధించినందుకు శరత్ , అనురాగ్, ప్రశాంత్‌షన్ముక్ & టీమ్ మొత్తానికి అభినందనలు

స్క్రీనింగ్ తర్వాత మహేష్ బాబు టీంతో కలిసి ఉన్న ఫోటోను కూడా షేర్ చేశాడు. రైటర్ పద్మభూషణ్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతుంది. ఇప్పటికే 5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పిస్తూ ఆకట్టుకుంటుంది.