Will RRR Release postpones again?

Sunday,August 22,2021 - 02:04 by Z_CLU

ఎన్టీఆర్ , రామ్ చరణ్ లతో రాజమౌళి తీస్తున్న మోస్ట్ ఎవైటింగ్ పాన్ ఇండియా మూవీ RRR అక్టోబర్ రిలీజ్ అంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. జనవరి సంక్రాంతి రిలీజ్ నుండి దసరా రిలీజ్ కి షిఫ్ట్ అయిన ఈ సినిమా మరోసారి వాయిదా పడనుందని సమాచారం. అవును మేకర్స్ ప్రకటించినట్లు సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకా రెండు నెలలే ఉంది. కానీ షూటింగ్ పూర్తవ్వలేదు. పాటలు షూట్ చేయాల్సి ఉంది. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ కి కూడా ఇంకా టైం కావాల్సి ఉంది. అలాగే పాన్ ఇండియా లెవెల్ లో థియేటర్ మార్కెట్ ఓపెన్ అవ్వడానికి ఇంకా సమయం పడుతుంది. అందుకే బడా సినిమాలు కూడా వచ్చే ఏడాది థియేటర్స్ లోకి రానున్నాయి.

అందుకే మేకర్స్ తాజాగా రిలీజ్ పై ఓ నిర్ణయం తీసుకొని సినిమాను వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. నెక్స్ట్ ఇయర్ లో మార్చిలో ఉగాది కానుకగా లేదా సమ్మర్ స్పెషల్ గా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లానింగ్ జరుగుతుందట. ఎలాగో పోస్ట్ ప్రొడక్షన్ కి ఇంకా రెండు మూడు నెలలు పైనే పడుతుంది కాబట్టి సినిమా ఫైనల్ కాపీ రెడీ అయ్యే సరికి వచ్చే ఏడాది వచ్చేస్తుంది.

ప్రస్తుతం యూనిట్ ఉక్రెయిన్ లో ఉన్నారు. త్వరలోనే హైదరాబాద్ రానున్నారు. వచ్చిన వెంటనే రాజమౌళి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పై ఫోకస్ పెట్టి టీంతో వర్క్ చేయించి వీలైనంత త్వరగా అవుట్ పుట్ తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. ఇక ప్రమోషన్ స్టాటజీ కూడా భారీగా రెడీ చేస్తున్నాడు జక్కన్న. బాహుబలి ఫ్రాంచైజీ తర్వాత రాజమౌళి నుండి రానున్న ఈ భారీ ప్రాజెక్ట్ పై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి చూడాలి RRR ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుందో ? ఆ అంచనాలను ఎలా అందుకుంటుందో ?

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics