Will Nithin gets hit with Maestro?

Wednesday,September 15,2021 - 03:59 by Z_CLU

కొన్నేళ్లుగా వరుస అపజయాలతో సతమవుతున్న హీరో నితిన్ 'భీష్మ'తో ఎట్టకేలకు మళ్ళీ హిట్టు కొట్టి ట్రాక్ ఎక్కాడు. కానీ ఆ తర్వాత నితిన్ నుండి వచ్చిన రెండు సినిమాలు ఆశించిన విజయం అందించలేకపోయాయి. ఇప్పుడు హిందీలో బ్లాక్ బస్టర్ సాధించిన 'అంధాదున్' రీమేక్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు నితిన్. అయితే ఈసారి థియేటర్స్ కాకుండా OTT ద్వారా ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.

సొంత బేనర్ లో ఈ సినిమా చేసిన నితిన్ ఈ సినిమా ప్రమోషన్స్ కోసం సమయం కేటాయించి సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు OTT కి అమ్మేసిన సినిమాలకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగలేదు. తొలిసారి 'మాస్ట్రో' తో ఆ వేడుకకి తెర తీశాడు నితిన్. నిన్న కాస్టింగ్ అందరితో కలిసి ఈవెంట్ కి ఎటెండ్ అయ్యాడు.ఇక తమన్నా , నభా లతో కలిసి ఓ ప్రమోషనల్ సాంగ్ కూడా షూట్ చేసి వదిలాడు. ఆ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది.

maestro movie nithin nabha tamanna 1

ఇక హిందీలో ఆయుష్మాన్ ఖురానా నటించిన 'అంధాదున్' ని తెలుగులో రీమేక్ చేయడం నితిన్ చేసిన పెద్ద సాహసమే అని చెప్పొచ్చు. ఆ సినిమాకు గానూ ఆయుష్మాన్ కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. మరి ఆ పెర్ఫార్మెన్స్ ని నితిన్ మ్యాచ్ చేయగలడా అనే సందేహాలు కూడా ఉన్నాయి.

సినిమాలో అంధుడిగా కనిపిస్తాడు నితిన్. ఫస్ట్ టైం తన జానర్ నుండి బయటికొచ్చి ఎక్సరిమెంట్ చేశాడు నితిన్. రెండ్రోజుల్లో రిలీజ్ అయ్యే ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. దర్శకుడు మేర్లపాక గాంధి ఈ రీమేక్ ని కొన్ని మార్పులతో తెరకెక్కించాడని సమాచారం. మరి ఈ రీమేక్ తో OTT హిట్టు కొట్టి సక్సెస్ అందుకుంటాడా ? చూడాలి. సెప్టెంబర్ 17 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.