Why Chiranjeevi Lucifer remake is getting late?

Tuesday,April 06,2021 - 09:57 by Z_CLU

"సంక్రాంతి తర్వాత షూటింగ్. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ తో మొత్తం షూటింగ్ కంప్లీట్ చేస్తాం."

స్వయంగా చిరంజీవి ఇచ్చిన స్టేట్ మెంట్ ఇది. కానీ లూసిఫర్ రీమేక్ మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. మోహన్ రాజా దర్శకత్వంలో రావాల్సిన ఈ సినిమా మరింత ఆలస్యం కాబోతోంది.

ఫిబ్రవరి పూర్తయింది, మార్చి ముగిసింది, ఏప్రిల్ కూడా వచ్చేసింది. కానీ లూసిఫర్ రీమేక్ మాత్రం స్టార్ట్ అవ్వలేదు. దీనికి ప్రధానంగా 2 కారణాలు కనిపిస్తున్నాయి.

- ఆచార్య ఆలస్యం కరోనా/లాక్ డౌన్ కారణంగా ఆచార్య సినిమా ఆలస్యమైంది. మధ్యలో కాజల్ పెళ్లి వల్ల ఇంకాస్త లేట్. ఇప్పుడు సెకెండ్ వేవ్ కూడా మొదలవ్వడంతో ఆచార్య షూట్ ఇంకాస్త లేట్ అయ్యేలా ఉంది.

- నటీనటుల ఎంపిక మరోవైపు లూసిఫర్ నటీనటుల ఎంపిక కూడా లేట్ అవుతోంది. ముందుగా అనుకున్న నటీనటులు తర్వాత బిజీ అయిపోయారు. దీంతో లూసిఫర్ ప్రాజెక్టు ఇంకాస్త లేట్ అయ్యేలా ఉంది.

ఈ ఏడాదిలోనే లూసిఫర్ ను రిలీజ్ చేస్తామని గతంలో ప్రకటించారు. అయితే ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు.

- Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics