Who is the 2nd hero in Pawan-SagarChandra Movie

Wednesday,October 28,2020 - 02:20 by Z_CLU

విజయదశమి సందర్భంగా Sithara Entertainments నుండి Pawan సినిమా ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. Sagar Chandra దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన 'Ayyappanum Koshiyum' కు రీమేక్ గా తెరకెక్కనుంది. ఈ విషయాన్నీ ఇది వరకే మేకర్స్ ప్రకటించారు. ఇటివలే ఎనౌన్స్ మెంట్ వీడియోలో కూడా పవన్ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ చేయబోతున్నాడని చెప్పేసారు.

దీంతో ఇప్పుడు సినిమాలో మరో క్యారెక్టర్ ను ఎవరు చేస్తారా అనే టాపిక్ డిస్కషన్ లోకొచ్చింది. ఆ రోల్ ని Rana తో చేయిస్తారనే టాక్ నడుస్తుంది. కానీ మేకర్స్ నుండి ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. మొన్న పవన్ తో పాటు రానా పేరు కూడా ఎనౌన్స్ చేస్తే ఆ రోల్ పై అందరికీ ఓ క్లారిటీ వచ్చేది. మరి మేకర్స్ ఆ రోల్ చేసే హీరో పేరు ఎనౌన్స్ చేసే వరకు దీనిపై చర్చ నడుస్తుంటుంది.