When will Balakrishna’s Akhanda Release?

Friday,May 07,2021 - 12:53 by Z_CLU

నందమూరి నట సింహం బాలకృష్ణ, మాస్ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'అఖండ' సినిమాకు సంబంధించి కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ నెలలోనే సినిమా థియేటర్స్ లోకి రావాల్సి ఉంది. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో సినిమా విడుదల వాయిదా పడింది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను సెప్టెంబర్ లో వినాయక చవితి కానుకగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నరని సమాచారం.

జూన్ లేదా జులై మిగతా బ్యాలెన్స్ షూట్ ఫినిష్ చేసి సెప్టెంబర్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారట. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.

ఇటివలే రిలీజ్ చేసిన టీజర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫాస్ట్ గా 50 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న టీజర్ 'అఖండ' పై భారీ అంచనాలు నెలకొలిపింది. బాలయ్య -బోయపాటి కాంబోలో మూడో సినిమాగా వస్తున్న ఈ సినిమాలో బాలయ్య అఘోరగా డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. సినిమాలో డ్యుయల్ రోల్ ప్లే చేస్తున్నాడు బాలయ్య. పంచెకట్టులో మాస్ లుక్ లో ఎట్రాక్ట్ చేస్తూ మరోవైపు అఘోరగా కనిపించబోతున్నాడు. సినిమాలో బోయపాటి మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ఆడియన్స్ ని విపరీతంగా మెప్పిస్తాయని ఇన్సైడ్ టాక్.

akhanda movie balakrishna

బాలయ్య సరసన ప్రగ్య జైస్వాల్ , పూర్ణ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ద్వారక క్రియేషన్స్ బేనర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

  • - Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics