What is Allu Arjun’s Next after Pushpa 2

Thursday,January 27,2022 - 08:08 by Z_CLU

ప్రస్తుతం 'పుష్ప' సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న అల్లు అర్జున్ నెక్స్ట్ 'పుష్ప 2' సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. మార్చ్ లేదా ఏప్రిల్ నుండి 'పుష్ప పార్ట్ 2' ని స్టార్ట్ చేయబోతున్నాడు బన్నీ. అయితే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ చేయబోయే నెక్స్ట్ సినిమాపై ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. దీనికి రీజన్ బన్నీ నెక్స్ట్ లిస్టులో చాలా మంది దర్శకులు ఉండటమే.

అవును బన్నీ లిస్టులో అరడజను మంది దర్శకులున్నారు. అందులో శ్రీరామ్ వేణు , బోయపాటి శ్రీను పేర్లు ముందుగా వినబడుతున్నాయి. 'ఐకాన్' అనే టైటిల్ తో శ్రీరామ్ వేణు దర్శకత్వంలో దిల్ రాజు బేనర్ లో ఎనౌన్స్ కూడా చేశారు. అలాగే బోయపాటి శ్రీనుకి బన్నీతో గీతా ఆర్ట్స్ లో కమిట్ మెంట్ ఉంది. అఖండ టైంలోనే బన్నీతో సినిమా గురించి ఎప్పటికప్పుడు అల్లు అరవింద్ తో మీటింగ్స్ పెట్టుకున్నాడు బోయపాటి. అల్లు అరవింద్ కూడా ఓ సందర్భంలో ఈ కాంబో సినిమా ఉందని ప్రకటించారు.

ఇదిలా ఉంటే మురుగుదాస్ తో పాటు ప్రశాంత్ నీల్ తో కూడా బన్నీ సినిమాలు చేయాల్సి ఉందని నిర్మాత బన్నీ వాస్ ఓ సందర్భంలో తెలిపాడు. ఇక అల వైకుంఠపురములో తర్వాత బన్నీ -త్రివిక్రమ్ కాంబోలో కూడా మళ్ళీ సినిమా ఉండొచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. ఇక తాజాగా బన్నీ లిస్టులో కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కూడా చేరాడు. అట్లీతో బన్నీ ఓ పాన్ ఇండియా సినిమా చేయనున్నాడనే టాక్ వినబడుతుంది. మరి ఇంత మంది దర్శకుల్లో బన్నీ పుష్ప ది రూల్ తర్వాత ఏ దర్శకుడితో నెక్స్ట్ సినిమా చేస్తాడో తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే.