Weekend Release – Uppena FCUK ready for release

Wednesday,February 10,2021 - 02:57 by Z_CLU

గడిచిన 3 వారాలుగా ప్రతి వీకెండ్ మినిమం అరడజను సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. లాస్ట్ వీక్ అయితే ఏకంగా 10 సినిమాలొచ్చాయి. అయితే ఈ వీకెండ్ మాత్రం ముచ్చటగా మూడే వస్తున్నాయి. ఆ 3 సినిమాలేంటో చెక్ చేద్దాం

ఈ వీకెండ్ భారీ అంచనాల మధ్య వస్తున్న సినిమా ఉప్పెన. హీరోగా వైష్ణవ్ తేజ్, హీరోయిన్ గా కృతి షెట్టి, దర్శకుడిగా బుచ్చిబాబు సన ఒకేసారి పరిచయమౌతున్న సినిమా ఇది. సుకుమార్ సపోర్ట్, మైత్రీ మూవీ మేకర్స్ లాంటి బ్యానర్, దేవిశ్రీ సూపర్ హిట్ మ్యూజిక్ తోడవ్వడంతో ఈ ప్రాజెక్టుపై బజ్ పెరిగింది. ఓపెనింగ్స్ తోనే ఈ సినిమాకు 5 కోట్ల రూపాయలు వస్తాయని అంచనా వేస్తున్నారంటే.. ఉప్పెనపై ఏ రేంజ్ లో ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయో అర్థంచేసుకోవచ్చు.

ఈ సినిమాతో పాటు జగపతిబాబు, రామ్ కార్తీక్ హీరోలుగా నటించిన FCUK అనే సినిమా కూడా వీకెండ్ థియేటర్లలోకి వస్తోంది. జగపతిబాబు-రామ్ కార్తీక్ తండ్రి కొడుకులుగా  నటించగా.. అమ్ము అభిరామి హీరోయిన్ గా నటించింది. రంజిత్ మూవీస్ బ్యానర్ పై వచ్చిన ఈ సినిమాలో ఎలాంటి అశ్లీలం ఉండదని, క్లీన్ ఎంటర్ టైనర్ అని చెబుతున్నారు మేకర్స్. థియేటర్లలోకొచ్చి ఓ సరికొత్త స్టోరీని ఎక్స్ పీరియన్స్ చేయమని కోరుతున్నారు.

ఉప్పెన, FCUK మూవీస్ తో పాటు వైతరుణి రాణా అనే మరో సినిమా కూడా ఈ వీకెండ్ థియేటర్లలోకి వస్తోంది. ఈ 3 సినిమాల్లో ఏ సినిమా క్లిక్ అవుతుందో చూడాలి.