Weekend Release – Natyam, Madhura Wines and Other movies

Thursday,October 21,2021 - 04:47 by Z_CLU

తాజాగా ఆంధ్రప్రదేశ్ లో కూడా 100 అక్యూపెన్సీ థియేటర్స్ రన్ చేసుకోవచ్చని ప్రకటించడంతో వరుసగా చిన్న పెద్ద సినిమాలు ఒక్కొక్కటిగా రాబోతున్నాయి. గత వారం విడుదలైన సినిమాలు మంచి వసూళ్ళు రాబడుతున్నాయి. ఈ వారం మరో రెండు రోజుల్లో నాలుగు చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఆ సినిమాలేంటో చూద్దాం.

ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు నటిస్తూ స్వయంగా నిర్మించిన సినిమా ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో నిశ్రింకళ ఫిల్మ్‌ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినీప‌రిశ్ర‌మ‌ నుండి బాలకృష్ణ , ఎన్టీఆర్ , రామ్ చరణ్ లాంటి స్టార్స్ నుండి మంచి సపోర్ట్ అందుకొని ప్రమోషన్స్ తో ఎట్రాక్ట్ చేస్తున్న ఈ చిన్న సినిమాకు తాజాగా మెగాస్టార్ చిరంజీవి ప్ర‌శంసలు కూడా దక్కాయి.

madhura-wines-zeecinemalu

ఈ వారం థియేటర్స్ లోకి రాబోతున్న మరో చిన్న సినిమా 'మధుర వైన్స్'. సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్ ప్రధాన పాత్రల్లో జయ కిషోర్ బండి దర్శకత్వం లో ఎస్ ఒరిజినల్స్ , ఆర్.కె.సినీ టాకీస్ బ్యానర్ పై రాజేష్ కొండెపు నిర్మిస్తున్న సినిమా ఇది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ట్రైలర్స్ ఓ మోస్తరుగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలతో పాటే 'ప్యార్ హి ప్యార్',అసలేం జరిగింది', 'క్లిక్' అనే మరో రెండు చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి.

- Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics