Weekend Release Movies

Wednesday,February 03,2021 - 03:29 by Z_CLU

లాస్ట్ వీక్ లానే ఈ వీకెండ్ కూడా చిన్న సినిమాలు క్యూ కట్టాయి. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 10 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో కాస్తో కూస్తో అంచనాలు పెంచుతున్న సినిమా ఒకే ఒక్కటి.

Zombie-Reddy-Release-February-5

ఈ వీకెండ్ ఓ మోస్తరు అంచనాలతో వస్తున్న సినిమా జాంబీరెడ్డి. తేజ సజ్జ హీరోగా పరిచయమౌతున్న ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకుడు. జాంబీ కాన్సెప్ట్ తో తెలుగులో వస్తున్న తొలి సినిమా ఇదే. ఆనంది, దక్ష హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో హారర్ ఎలిమెంట్స్ కంటే, కామెడీనే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నాడు హీరో తేజ.

bomma-adirindi-shakalaka_shankar-zeecinemalu

ఈ సినిమా తప్ప మిగతావన్నీ చిన్న సినిమాలే. ప్రణవం, నాతో ఆట, చేతిలో చెయ్యేసి చెప్పు బావ, జై మరయమ్మ, బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది, జర్నలిస్ట్, విఠల్ వాడీ, రాధాకృష్ణ, జి-జాంబీ సినిమాలు ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో ఏ సినిమా క్లిక్ అవుతుందో చూడాలి.