Weekend Release – Kondapolam, Aaradugula Bullet to release

Wednesday,October 06,2021 - 05:48 by Z_CLU

ప్రస్తుతం థియేటర్లలో సాయితేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఇప్పుడు సాయితేజ్ సినిమాకు, అతడి తమ్ముడి నుంచే పోటీ ఎదురైంది. అవును.. వైష్ణవ్ తేజ్ నటించిన కొండపొలం సినిమా ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రాబోతోంది. క్రిష్ డైరక్ట్ చేసిన ఈ సినిమాతో పాటు మరో 2 సినిమాలు ఈ వారాంతం రిలీజ్ అవుతున్నాయి. ఆ డీటెయిల్స్ చెక్ చేద్దాం.

ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వైష్ణవ్ తేజ్ నటించిన సినిమా కొండపొలం. సీనియర్ క్రియేటివ్ దర్శకుడు క్రిష్ డైరక్ట్ చేసిన సినిమా ఇది. రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించింది. కొండపొలం అనే నవల ఆధారంగా, అదే టైటిల్ తో తెరకెక్కింది ఈ సినిమా. కరోనా టైమ్ లో డేర్ చేసి ఈ సినిమా షూట్ చేశారు. సినిమాలో వైష్ణవ్ గొర్రెల కాపరిగా, ఓబులమ్మ అనే పల్లెటూరి పిల్ల పాత్రలో రకుల్ కనిపిస్తారు. ఇప్పటికే ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కీరవాణి సంగీతం అందించిన పాటల్లో 2 బాగున్నాయి. ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్, టాలీవుడ్ నెగెటివ్ సెంటిమెంట్ అయిన సెకెండ్ మూవీ సిండ్రోమ్ ను అధిగమిస్తాడో లేదో చూడాలి.

ఇక కొండపొలంతో పాటు థియేటర్లలోకొస్తున్న మూవీ ఆరడుగుల బుల్లెట్. గోపీచంద్ హీరోగా నటించిన ఈ సినిమా ఇప్పటిది కాదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే కరోనాకు ముందు రెండేళ్ల కిందటే రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇది. అనుకోని కారణాల వల్ల ఆలస్యమైన ఈ మూవీ ఎట్టకేలకు ఈ వీకెండ్ థియేటర్లలోకి వస్తోంది. సినిమా లేట్ గా వచ్చినా, లేటెస్ట్ గా ఉంటుందంటున్నారు మేకర్స్. గోపీచంద్ లాంటి స్టార్, నయనతార లాంటి స్టార్ హీరోయిన్ ఈ సినిమాకు క్రౌడ్ పుల్లర్స్. సీనియర్ డైరక్టర్ బి.గోపాల్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ఓ కీలక పాత్ర పోషించాడు. జయ బాలాజీ రియల్ మీడియా బ్యానర్ మీద తాండ్ర రమేష్ ఈ నిర్మించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు.

కొండపొలం, ఆరడుగుల బుల్లెట్ సినిమాలు రిలీజైన 24 గంటల గ్యాప్ లో డాక్టర్ అనే సినిమా రాబోతోంది. పేరుకు ఇది డబ్బింగ్ సినిమా అయినప్పటికీ ట్రయిలర్ తో టాలీవుడ్ ఆడియన్స్ ను కూడా ఎట్రాక్ట్ చేసింది. తెలుగు జనాలకు కూసింత పరిచయమున్న శివ కార్తికేయన్, ప్రియాంక మోహన్ హీరోహీరోయిన్లుగా నటించారు. నెల్సన్ ఈ సినిమాకు దర్శకుడు.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics