‘Waltair Veerayya’ Trailer Review

Saturday,January 07,2023 - 06:43 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవి ,మాస్ మహారజా రవితేజ కాంబినేషన్ లో దర్శకుడు బాబీ తెరకెక్కించిన 'వాల్తేరు వీరయ్య' సంక్రాంతి స్పెషల్ గా జనవరి 13న థియేటర్స్ లోకి రాబోతుంది. తాజాగా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

రా డిపార్ట్ మెంట్ వాళ్ళు ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ ను తీసుకొస్తున్నారు అంటూ వాయిస్ ఓవర్ తో సముద్రపు అలల షాట్స్ తో మొదలైన ట్రైలర్ లో మెగా ఫ్యాన్స్ కి మూవీ లవర్స్ ఫీస్ట్ ఇచ్చాడు దర్శకుడు బాబీ. ట్రైలర్ లో వీరయ్య కేరెక్టర్ కి ఇచ్చిన ఎలివేషన్స్ ఫ్యాన్స్ ట్రీట్ లా ఉన్నాయి. "మాస్ అనే పదానికి బొడ్డు కోసి పేరెట్టిందే ఆయన్ను సూసి", "రికార్డ్స్ లో నా పేరుండటం కాదు , నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి" వంటి డైలాగ్స్ మెగా ఫ్యాన్స్ ని అలరించేలా ఉన్నాయి. అలాగే రవితేజ యాక్షన్ సీన్స్ కూడా ట్రైలర్ లో ఎట్రాక్షన్ గా నిలిచాయి.

"మీ కథలోకి నేను రాల , నా కథలోకే మీరందరూ వచ్చారు వీడు నా ఎర నువ్వే నా సొర " అనే డైలాగ్ దానితో పాటు వచ్చే విజువల్స్ చూస్తే వీరయ్య రివేంజ్ కథతో ఈ సినిమా పవర్ పాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిందని అర్థమవుతుంది. ట్రైలర్ లో రవితేజ ఘరానా మొగుడు డైలాగ్ చెప్పాక చిరు ఇడియట్ డైలాగ్ తన స్టైల్ లో చెప్పడం స్పెషల్ హైలైట్ అనిపించుకుంది. సినిమాలో కీ రోల్ ప్లే చేసిన ప్రకాష్ రాజ్ , బాబీ సింహా , సత్య రాజ్ ఇలా అందరినీ చూపించి సినిమాలో చాలా కేరెక్టర్స్ ఉందనున్నాయని చెప్పకనే చెప్పారు. అలాగే రవితేజ కి పెయిర్ గా కనిపించనున్న కేథరిన్ ను కూడా ట్రైలర్ లో చూపించారు.

ఓవరాల్ గా మెగా మాస్ కాంబోలో రాబోతున్న 'వాల్తేరు వీరయ్య' మంచి యాక్షన్ తో పాటు ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేసే వినోదం కూడా మేళవించి ఉన్నట్టు కనిపిస్తుంది. సంక్రాంతి కి వీరయ్య గా చిరు బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమనిపిస్తుంది.