VV Vinayak to Direct Chatrapathi Hindi Remake with Bellamkonda
Sunday,November 22,2020 - 11:10 by Z_CLU
హీరో బెల్లంకొండ శ్రీనివాస్ త్వరలోనే బాలీవుడ్ బెబ్యూ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ హిట్టయిన ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నాడు బెల్లంకొండ. ఇప్పుడీ ప్రాజెక్టుకు దర్శకుడు దాదాపు ఫిక్స్ అయ్యాడు
Chatrapathi Remake ను హిందీలో వీవీ వినాయక్ హ్యాండిల్ చేయబోతున్నాడు. బెల్లంకొండను తెలుగులో పరిచయం చేసింది ఇతడే. ఇప్పుడు బెల్లంకొండ హిందీ డెబ్యూకు కూడా ఇతడే దర్శకత్వం వహించే ఛాన్స్ ఉంది.
నిజానికి చిరంజీవితో లూసిఫర్ రీమేక్ చేయాలనుకున్నాడు వినాయక్. కానీ ఆ ప్రాజెక్టు చేతులు మారినట్టు తెలుస్తోంది. దీంతో ఛత్రపతి రీమేక్ ఛాన్స్ వినాయక్ ను వరించింది.
త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలు బయటకొస్తాయి.