VV Vinayak thanked Hero Kalyan Ram for launching Vasishta as Director

Wednesday,August 10,2022 - 03:50 by Z_CLU

స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ కి థాంక్యూ చెప్పారు. కళ్యాణ్ రామ్ నటించిన 'బింబిసార' తో దర్శకుడు వసిష్ఠ డైరెక్టర్ గా పరిచయమైన సంగతి తెలిసిందే. దర్శకుడు వసిష్ఠ కి స్టార్ డైరెక్టర్ వినాయక్ కి మధ్య మంచి అనుబంధం ఉంది. వినాయక్ డైరెక్ట్ చేసిన 'బన్నీ' సినిమాకు వసిష్ఠ తండ్రి మల్లిడి సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరించారు. అంతే కాదు వినాయక్ , శ్రీను వైట్ల వసిష్ఠ కుటుంబంలో ఒకరిగా ఉంటారు. అందుకే 'బింబిసార' వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తో వసిష్ఠను దర్శకుడిగా లాంచ్ చేసినందుకు ఇటివలే కళ్యాణ్ రామ్ కి స్పెషల్ గా థాంక్స్ చెప్పుకున్నాడు వినాయక్. కళ్యాణ్ రామ్ ను అలాగే వసిష్ఠ ను వినాయక్ ఓ ఇంటర్వ్యూ చేసి వారిని అభినందిస్తూ సినిమా గురించి మాట్లాడాడు. ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

వసిష్ఠ చాలా ఏళ్లుగా కథలు పట్టుకొని తిరిగాడని కొందరు హీరోల దగ్గర ఎప్పటికప్పుడు స్టక్ అవుతూ వచ్చాడని కానీ ఏరోజు ఫ్రస్ట్రేట్ అవ్వలేదని ఈ సందర్భంగా వినాయక్ ఇంటర్వ్యూ లో చెప్పారు. ఇక కళ్యాణ్ రామ్ కూడా అది నిజమని తాము కూడా కొన్ని ఇబ్బందులు పెట్టి మార్పులు చేర్పులు చెప్తూ వచ్చినా ఊపిక పట్టి వర్క్ చేశాడని అదే ఈరోజు వసిష్ఠ ని దర్శకుడిగా సక్సెస్ చేసిందని తెలిపాడు.  సినిమా చూశాక వసిష్ఠ వర్క్ కి షాకయ్యానని, కన్ఫ్యూజ్ చేయకుండా చాలా అద్భుతంగా సినిమాను తీశాడని, అలాగే ఇందులో కళ్యాణ్ రామ్ నటన తనను అవాక్కయ్యేలా చేసిందని , సినిమాలో ఆయన డ్యుయల్ రోల్ అని తనకి తెలియదని ఆ విషయంలో సర్ప్రయిజ్ అయ్యానని చెప్పుకున్నారు వినాయక్. ఓవరాల్ గా తన నిర్మాత కొడుకు దర్శకుడిగా సక్సెస్ అయినందుకు తనెంతో సంతోషంగా ఉన్నానని ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలియజేశారు వినాయక్.

   
  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics