Vishwak Sen’s PAAGAL Movie Trailer Talk

Tuesday,August 10,2021 - 04:17 by Z_CLU

విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన 'పాగల్' సినిమా ఈ నెల 14న థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తుంది. రిలీజ్ దగ్గరపడటంతో తాజాగా సినిమా ప్రమోషన్ మొదలు పెట్టారు యూనిట్. అందులో భాగంగా ఈరోజు ట్రైలర్ రిలీజ్ చేశారు. 2 నిమిషాల 16 సెకన్ల నిడివితో కట్ చేసిన ట్రైలర్ లో విశ్వక్ సేన్ క్యారెక్టర్ , మణికందన్ విజువల్స్, రధాన్ మ్యూజిక్, డైలాగ్స్ హైలైట్స్ గా నిలిచాయి.

"నా పేరు ప్రేమ్ నేను పదహారు వందల మంది అమ్మాయిలను ప్రేమించాను" అంటూ విశ్వక్ సేన్ చెప్పే డైలాగ్ తో స్టార్టయిన ట్రైలర్ లో ఆ తర్వాత వచ్చే గీత అనే అమ్మాయి కోసం చెప్పే మాటలు, లవ్ సీన్స్ , నివేత పెతురాజ్ డైలాగ్ , కిస్ గురించి వచ్చే సీన్ , కనబడవా సాంగ్ బిట్ స్పెషల్ ఎట్రాక్షన్ అనిపించాయి. అలాగే సినిమాలో లవ్ ట్రాక్స్ తో పాటు మంచి ఎమోషన్ ఉందని , మంచి ట్విస్టులు ఉంటాయని అలాగే రాహుల్ రామకృష్ణ , రంగస్థలం మహేష్ కామెడీ కూడా సినిమాలో హైలైట్ కానుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఓవరాల్ గా పాగల్ ట్రైలర్ మూవీ లవర్స్ ని ఎట్రాక్ట్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది.

దిల్ రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ సినిమాతో నరేష్ కొప్పిలి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. నివేత పెతురాజ్ , సిమ్రాన్ , మేఘ లేఖ హీరోయిన్స్ నటించారు. మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాతో విశ్వక్ సేన్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics