Vijay’s ‘Beast’ Telugu Trailer Released

Tuesday,April 05,2022 - 05:20 by Z_CLU

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ , డైరెక్టర్ నెల్సన్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'బీస్ట్' రిలీజ్ కి రెడీ అవుతోంది . ఈ సందర్భంగా తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 'బీస్ట్'  తెలుగులో డబ్బింగ్ సినిమాగా గ్రాండ్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. తెలుగు వర్షన్ ని అగ్ర నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు.

ట్రైలర్ లో సినిమా థీమ్ ఏంటనేది క్లియర్ కట్ చెప్పేసి సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో 2 నిమిషాల 55 సెకన్ల ట్రైలర్ తో చూపించాడు దర్శకుడు నెల్సన్.  ముఖ్యంగా విజయ్ హీరోయిజం ఎలివేట్ చేసే షాట్స్ , అనిరుద్ స్కోర్ , మనోజ్ పరమహంస విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ బిట్స్  ట్రైలర్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచి సినిమాపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశాయి.

విజయ్ సరసన పూజ హెగ్డే నటిస్తున్న ఈ సినిమాలో సెల్వ రాఘవన్ ఓ కీలక పాత్రలో నటించారు.  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ ఎండింగ్ లో ఉన్న ఈ సినిమా ఏప్రిల్ 13న థియేటర్స్ లోకి రానుంది.

  Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics