Vijay to romance Trisha after 14years in #Thalapathy67

Wednesday,February 01,2023 - 03:03 by Z_CLU

సంక్రాంతికి వారసుడు సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విజయ్ నెక్స్ట్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో భారీ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే భారీ కాస్టింగ్ తో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు పెంచేశాడు లోకేష్. తాజాగా ఈ సినిమాకు హీరోయిన్ గా త్రిష ను తీసుకున్నారు. ఆమెకి వెల్కం చెప్తూ ఎనౌన్స్ పోస్టర్ వదిలారు.

విజయ్ -త్రిష కోలీవుడ్ లో హిట్ పెయిర్. వీరిద్దరి కాంబోలో చాలా సూపర్ హిట్స్ మూవీస్ వచ్చాయి. మళ్ళీ 14 ఏళ్ల తర్వాత ఈ కాంబోను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు లోకేష్. ఈ మేరకు రిలీజ్ చేసిన ఎనౌన్స్ మెంట్ వీడియో కూడా ఆకట్టుకుంటుంది. ఇక విజయ్ -లోకేష్ కాంబోలో వచ్చిన 'మాస్టర్' బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. తెలుగులోనూ ఈ సినిమా బాగానే ఆడింది.

ఇక లోకేష్ కనగరాజ్ 'విక్రమ్' తెలుగులో భారీ వసూళ్లు అందుకుంది. దీంతో ఇప్పుడు విజయ్ సినిమాపై కూడా తెలుగులో భారీ అంచనాలున్నాయి.