Vijay Master Movie first Day collection

Thursday,January 14,2021 - 12:03 by Z_CLU

విజయ్ హీరోగా నటించిన మాస్టర్ మూవీ నిన్న వరల్డ్ వైడ్ రిలీజైంది. తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజైన ఈ సినిమాకు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే వసూళ్లలో మాత్రం మాస్టర్ అదరగొట్టాడు. మొదటి రోజు ఏపీ, నైజాంలో కలిపి ఈ సినిమాకు 5 కోట్ల 74 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

ఇవాళ్టి నుంచి ఈ సినిమాకు కలెక్షన్ తగ్గుతుంది. ఎందుకంటే ఈరోజు ఒకేసారి అల్లుడు అదుర్స్, రెడ్ సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. అలా మాస్టర్ మూవీ రెండో రోజుకే చాలా థియేటర్లు కోల్పోవాల్సి వచ్చింది.

ఏపీ, నైజాం ఫస్ట్ డే కలెక్షన్  నైజాం - రూ. 1.49 కోట్లు సీడెడ్ - రూ. 1.10 కోట్లు ఉత్తరాంధ్ర - రూ. 0.83 కోట్లు ఈస్ట్ - రూ. 0.48 కోట్లు వెస్ట్ - రూ. 0.56 కోట్లు గుంటూరు - రూ. 0.67 కోట్లు నెల్లూరు - రూ. 0.25 కోట్లు కృష్ణా - రూ. 0.36 కోట్లు