Vijay Kanakamedala to Direct Naandhi Hindi Remake

Wednesday,June 30,2021 - 01:59 by Z_CLU

అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన 'నాంది' విజయంతో పాటు ప్రశంసలు కూడా దక్కించుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమాలో అల్లరి నరేష్ నటనకి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా సక్సెస్ మీట్ కి దిల్ రాజు కూడా హాజరై సినిమాను మెచ్చుకున్నారు. వెంటనే నిర్మాత నుండి హిందీ రీమేక్ రైట్స్ కొనుగోలు చేసి చక చకా ప్లాన్ చేశారు. హిందీలో అజయ్ దేవగన్ తో ఈ రీమేక్ సినిమాను నిర్మించనున్నట్లు ఇటివలే ప్రకటన కూడా విడుదల చేశారు దిల్ రాజు.

అయితే ఈ రీమేక్ సినిమాను డైరెక్ట్ చేసేదెవరు ? అల్లరి నరేష్ పాత్రను అక్కడ ఎవరితో చేయిస్తున్నారు? అనే డీటెయిల్స్ మాత్రం చెప్పలేదు మేకర్స్. దీంతో ఇప్పుడీ సినిమా డైరెక్షన్ భాద్యత ఎవరి చేతిలో పెడతారా ? అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. తాజా సమాచారం మేరకు తెలుగులో నాంది తో దర్శకుడిగా పరిచయమైన విజయ్ కనకమేడల నే హిందీ వర్షన్ ని కూడా డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుంది.

vijay kanakamedala naandhi director

ఇటివలే దిల్ రాజు దర్శకుడు విజయ్ ని పిలిచి ఈ రీమేక్ సినిమాను డైరెక్ట్ చేయమని అడ్వాన్స్ కూడా అందించారని సమాచారం. ప్రస్తుతం తెలుగులో సూపర్ హిట్టైన 'HIT' సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నారు దిల్ రాజు. ఆ రీమేక్ ని ఒరిజినల్ దర్శకుడు శైలేష్ కొలను చేతిలో పెట్టారు రాజు. ఒరిజినల్ లో ఉన్న సోల్ మిస్ అవ్వకుండా రీమేక్ ని డీల్ చేసే తెలుగు దర్శకులకే ప్రియారిటీ ఇస్తున్నారు దిల్ రాజు. ప్రస్తుతం నాంది హిందీ రీమేక్ కి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. హిందీకి తగ్గట్టుగా కొన్ని మార్పులతో పాటు డైలాగ్ వర్షన్ రాస్తున్నారు. త్వరలోనే మేకర్స్ దర్శకుడు విజయ్ పేరు ఎనౌన్స్ చేసి వెల్కం చెప్పే అవకాశం ఉంది.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics