Vijay Deverakonda’s ‘LIGER’ release date announced !

Thursday,February 11,2021 - 12:02 by Z_CLU

విజయ్ దేవరకొండ -పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న 'లైగర్ (సాలా క్రాస్ బ్రీడ్)' సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. సెప్టెంబర్ 9న సినిమా తెలుగు , హిందీ , కన్నడ , తమిళ్ , మలయాళం భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుందని ప్రకటించారు.  లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడిన ఈ సినిమా నేటి నుండి మళ్ళీ ముంబై లో షూటింగ్ జరుపుకుంటుంది. ముంబైలో కొన్ని కీలక సన్నివేశాలు తీసిన అనంతరం టీం బ్యాంకాక్ వెళ్లనుంది. అక్కడ లాస్ట్ షెడ్యుల్ ప్లాన్ చేస్తున్నాడు పూరి.

Liger-Release-poster-zeecinemalu

ధర్మ ప్రొడక్షన్స్ , పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు కరణ్ జోహార్ , అపూర్వ మెహత, ఛార్మీ నిర్మాతలు. విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా సినిమాలో రమ్య కృష్ణ కీలక పాత్రలో నటిస్తుంది. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ సినిమాకు వర్క్ చేస్తున్నాడు. త్వరలోనే మేకర్స్ టెక్నీషియన్స్ పేర్లు వెల్లడించనున్నారు.