Vijay Deverakonda’s ‘Liger’ Day1 Collections details

Friday,August 26,2022 - 06:01 by Z_CLU

విజయ్ దేవరకొండ , పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'లైగర్' భారీ అంచనాల నడుమ నిన్న థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదటి రోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మంచి ఓపెనింగ్ అందుకుంది. వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా మూవీగా రిలీజైన ఈ సినిమా మొదటి రోజు 33 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి మంచి నంబర్ రాబట్టింది. ఇది పూరి , విజయ్ ఇద్దరికీ బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని చెప్పాలి.

విజయ్ కి యూత్ లో ఉన్న క్రేజ్ , సినిమా మీద ఉన్న బజ్ తో 'లైగర్' డే 1 బెస్ట్  కలెక్షన్స్ తెచ్చుకున్న ఈ సినిమా వీకెండ్ లో కూడా బాగానే వసూళ్ళు అందుకునే అవకాశం కనిపిస్తుంది. వీకెండ్ దాటే సరికి అవలీలగా 60 కోట్ల గ్రాస్ దాటేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఓవర్సీస్ లో కూడా ఇప్పటికే హాఫ్ మిలియన్ క్రాస్ చేసిన లైగర్ మరో రెండు మూడు రోజుల్లో 1 మిలియన్ డాలర్ మార్క్ రీచ్ అవ్వనుంది.

ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బేనర్స్ పై కరణ్ జోహార్, అపూర్వ మెహత , పూరి -చార్మీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. క్లైమక్స్ లో వచ్చే ఎపిసోడ్ లో మైక్ టైసన్ ఓ స్పెషల్ రోల్ లో కనిపించాడు.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics