Vijay Deverakonda, Puri Jagannath next film launch tomorrow

Monday,March 28,2022 - 01:03 by Z_CLU

విజయ్ దేవరకొండ , పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో 'లైగర్' సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో ఉండగానే వీరిద్దరి కాంబోలో రానున్న మరో ప్రాజెక్ట్ కూడా లాంచ్ చేయబోతున్నారు. అవును విజయ్ తో  బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేస్తున్నాడు పూరి. ఈ కాంబోలో రాబోయే రెండో సినిమాను రేపు ముంబై లాంచ్ చేయబోతున్నారు.

ఈ క్రేజీ మూవీను రేపు లాంచ్ చేయనున్నట్లు ఓ పోస్టర్ ద్వారా టైంతో సహా  ప్రకటించారు. ఎనౌన్స్ మెంట్ పోస్టర్ లో పవర్ ఫుల్ వెపన్ చూపిస్తూ నెక్స్ట్ మిషన్ స్టార్ట్ ఫ్రం టుమారో అంటూ డీటెయిల్స్ ఇచ్చారు. అయితే పూరి డ్రీం ప్రాజెక్ట్ 'జనగణమన' ను విజయ్ తో చేస్తున్నాడని మొన్నటి వరకూ టాక్ వినిపించింది. ఇప్పుడు ప్రీ లాంచ్ పోస్టర్ చూస్తే పూరి విజయ్ తో ఏదో డిఫరెంట్ ఎక్సపరిమెంట్ సినిమా చేయబోతున్నాడని అనిపిస్తుంది.

ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని డీటెయిల్స్ రేపు బయటికి రానున్నాయి. మరి పూరి విజయ్ తో జనగణమన సినిమానే తీస్తున్నాడా ? లేదా ఇది మరో కథా ? తెలియాల్సి ఉంది. రేపు లాంచ్ చేసి ముంబైలోనే మొదటి షెడ్యుల్ ప్లాన్ చేస్తున్నాడు పూరి. పూరీ టూరింగ్ టాకీస్ , పూరి కనెక్ట్స్ బేనర్ పై పూరి , ఛార్మీ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించనున్నట్లు సమాచారం. లాంచ్ అయ్యాక ఈ సినిమా గురించి మరిన్ని డీటెయిల్స్ బయటికి రానున్నాయి.