Vijay Deverakonda Perfect Planning

Tuesday,September 29,2020 - 01:15 by Z_CLU

'పెళ్లి చూపులు' సినిమాతో హీరోగా పరిచయమైన Vijay Deverakonda ఆ తర్వాత వచ్చిన 'ArjunReddy' తో సెన్సేషనల్ హీరోగా గుర్తింపు అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత 'Geethagovindam' తో వంద కోట్ల హీరో అనిపించుకున్నాడు. ఆ ఘన విజయం తర్వాత ఇక విజయ్ కెరీర్ కి తిరుగుండదని అందరూ భావించారు. కానీ వరుస అపజయాలతో విజయ్ కెరీర్ డౌన్ అయింది.

అర్జున్ రెడ్డి, గీతగోవిందం తో వచ్చిన మార్కెట్ 'డియర్ కామ్రేడ్', 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలతో దెబ్బతింది. దీంతో ఇప్పుడు అదిరిపోయే ప్లానింగ్ తో ముందుకెళ్తున్నాడు విజయ్. మళ్ళీ మార్కెట్ పెంచుకోవడానికి సీనియర్ దర్శకులతో వరుసగా సినిమాలు ప్లాన్ చేసుకున్నాడు.

ప్రస్తుతం Puri Jagannadh తో 'Fighter' చేస్తున్న రౌడీ తన తదుపరి సినిమాను క్రియేటీవ్ డైరెక్టర్ Sukumar తో చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఇలా స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తూ మళ్ళీ తన మార్కెట్ పెంచుకునే పనిలో ఉన్నాడు. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అయితే Vijay Deverakonda మళ్ళీ మెయిన్ స్ట్రీంలోకి ఎంటరయినట్టే.