Vijay Deverakonda creates record in facebook

Wednesday,July 21,2021 - 08:11 by Z_CLU

రౌడీ బాయ్ గా, యూత్ లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ మరొక మైల్ స్టోన్ ను అధిగమించాడు. సోషల్ మీడియా లో విజయ్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికే ఇన్ స్టా గ్రామ్ లో 1 కోటీ 25 లక్షల మంది ఫాలోవర్స్ పైగా సొంతం చేసుకుని సౌత్ ఇండియాలోనే నంబర్ 1 హీరోగా రికార్డు సృష్టించిన విజయ్ ఇప్పుడు ఫేస్ బుక్ లో కూడా కోటీ మంది ఫాలోవర్స్ ను సంపాదించుకోవటం విశేషం.

విజయ్ దేవరకొండ 10 మిలియన్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకోవడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో ‘‘లైగర్’’ మూవీ లో నటిస్తున్న విజయ్ త్వరలోనే ఆ షూట్ లో జాయిన్ అవుతాడు.

విజయ్ దేవరకొండ ఇలా రికాార్డుల మీద రికార్డులు సృష్టించడం ఇదే తొలిసారి కాదు. యంగ్ స్టార్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ గతంలో రేర్ రికార్డ్ సొంతం చేసుకున్నారు. "హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మెన్" గా మూడో సారి ఎంపికయ్యారు. ఇది మరే టాలీవుడ్ స్టార్ కు దక్కని అరుదైన రికార్డ్. టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ ఏటా మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ రిలీజ్ చేస్తుంది. స్టార్ డమ్, టాలెంట్, ఆడియెన్స్ లో క్రేజ్ ఆధారంగా ఈ జాబితా తయారు చేస్తుంది. ఈమధ్య రిలీజ్ చేసిన "హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2020" లిస్ట్ లో టాప్ ప్లేస్ దక్కించుకున్నారు విజయ్ దేవరకొండ. సెల్ఫ్ మేడ్ హీరోగా తనకు తానుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎదిగిన విజయ్ ...'పెళ్లి చూపులు',  'అర్జున్ రెడ్డి', 'టాక్సీవాలా', 'గీత గోవిందం'..ఇలా వరుస సూపర్ హిట్స్ తో స్టార్ హీరోగా టాలీవుడ్ లో సుస్థిర స్థానం ఏర్పర్చుకున్నారు.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics