Vijay Deverakonda Anushka Movie on cards

Monday,October 05,2020 - 01:28 by Z_CLU

టాలీవుడ్ సర్కిల్స్ లోకి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ వచ్చి చేరింది. మోస్ట్ హ్యాపెనింగ్ స్టార్ Vijay Deverakonda, టాలీవుడ్ బొమ్మాలి Anushka కలిసి ఓ సినిమా చేయబోతున్నారట.

ఓ కొత్త కుర్రాడు రాసుకొచ్చిన కథ వీళ్లిద్దరికీ బాగా నచ్చిందని ఫిలింనగర్ ఫ్రెష్ టాక్.

అసలు ఈ పెయిర్ ను ఊహించుకోవడమే కష్టంగా ఉంది కదా. కానీ కథకు వీళ్లిద్దరే కరెక్ట్ అంట. చాలా డిఫరెంట్ స్టోరీ అంటున్నారు.

హీరోగా, యాక్టర్ గా విజయ్ దేవరకొండ స్టామినా ఏంటో అందరికీ తెలుసు. అటు అనుష్క టాలెంట్ కూడా అందరికీ తెలుసు. ఇలాంటి ఇద్దరు టాలెంటెడ్ ఆర్టిస్టులు కలిస్తే కచ్చితంగా ఆ సినిమా హాట్ టాపిక్ అవుతుంది.