Vijay Antony’s Jwala is 25 Cr budget Movie

Monday,November 30,2020 - 07:47 by Z_CLU

Vijay Antony JWALA Movie: ‘బిచ్చగాడు’ చిత్రంతో తెలుగులో ఫ్యాన్స్‌ను సంపాదించుకున్న తమిళ నటుడు విజయ్‌ ఆంటోని. ప్రస్తుతం ఈ హీరో జ్వాల అనే సినిమా చేస్తున్నాడు. విజయ్ ఆంటోనీ కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ మూవీ ఇది.

తెలుగులో ‘జ్వాలా’గా, తమిళ్‌లో ‘అగ్ని శిరగుగళ్‌’ గా బై-లింగ్వుల్ ప్రాజెక్టుగా ఇది తెరకెక్కుతోంది. ఈ సినిమాలో విజయ్‌ సరసన అక్షరహాసన్‌ (Akshara Haassan) నటిస్తుండగా ‘సాహో’ ఫేమ్‌ అరుణ్‌ విజయ్‌ కీలకపాత్ర చేస్తున్నాడు.

నవీన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తెలుగులో శర్వంత్‌రామ్‌ క్రియేషన్స్‌ పతాకంపై జవ్వాజి రామాంజనేయులు, షిరిడిసాయి క్రియేషన్స్‌ పతాకంపై యమ్‌.రాజశేఖర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు.

ఉజ్బెకిస్తాన్, కజికిస్తాన్‌ దేశాలతో పాటు యూరప్‌లోని కొన్ని కంట్రీస్ లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. ప్రస్తుతం కోల్ కతా లో ఫైనల్ షెడ్యూల్ నడుస్తోంది.

విజయ్‌ ఆంటోని కెరీర్‌లోనే దాదాపు 25కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న తొలి చిత్రమిది. రీమాసేన్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు నటరాజన్‌ సంగీతం అందిస్తున్నాడు.