Venkatesh’s Narappa to release in Summer
Monday,January 25,2021 - 01:42 by Z_CLU
సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా నారప్ప. విక్టరీ వెంకటేష్, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో వస్తున్న ఈ ఎంటర్ టైనర్ లో ప్రియమణి హీరోయిన్ గా నటిస్తోంది.
సినిమాలో నారప్పగా వెంకటేష్, సుందరమ్మగా ప్రియమణి కనిపించబోతున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్, పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది.
ఇక సంక్రాంతికి విడుదల చేసిన పోస్టర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. వెంకీ గతంలో ఎన్నడూ కనిపించని విధంగా ఇలా ఫ్యామిలీతో కలిసి కొత్తగా కనిపిస్తున్నారు. పోస్టర్ లో కేరాఫ్ కంచరపాలెం ఫేం కార్తీక్ రత్నం సహా వెంకీ ఫ్యామిలీ అంతా హాయిగా నవ్వుడం చూడొచ్చు..
ఇలా అంచనాలు పెంచిన ఈ సినిమాను వేసవికి విడుదల చేయాలని నిర్ణయించారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తారు.
నటీనటులు - విక్టరీ వెంకటేష్, ప్రియమణి, కార్తిక్ రత్నం, రావు రమేష్, రాజీవ్ కనకాల తదితరులు
సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు,
సంగీతం: మణిశర్మ,
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్,
ఆర్ట్: గాంధీ నడికుడికర్,
కథ: వెట్రిమారన్,
స్క్రిప్ట్ కన్సల్టెంట్: సత్యానంద్,
ఫైట్స్: పీటర్ హెయిన్స్, విజయ్,
లిరిక్స్: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, అనంతశ్రీరామ్, కృష్ణకాంత్, కాసర్ల శ్యాం,
ఫైనాన్స్ కంట్రోలర్: జి.రమేష్‌రెడ్డి,
ప్రొడక్షన్ కంట్రోలర్: రామబాలాజి డి.,
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఏపీ పాల్ పండి,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ శంకర్ డొంకాడ,
కో- ప్రొడ్యూసర్: దేవి శ్రీదేవి సతీష్
నిర్మాతలు: డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్. థాను
దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల.